బుధవారం, మే 01, 2019

ఆ గట్టునుంటావా...

మేడే సంధర్భంగా కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ రంగస్థలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శివనాగులు (ఆడియో)
దేవీశ్రీప్రసాద్(వీడియో)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న


హే.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సీసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా


ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది
నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా


ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా


ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బద్దం ఉంది శుద్దముందీ
ఆ ఏపునన్నిటికి ముందర ఆ ఉందీ
అంటే..... అన్యాయం అధర్మం అబద్దం అశు.. ఉష్షూ..
అందుకనీ....

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న 

2 comments:

ఈ రోజుల్లో యాప్ట్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.