వేదా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేదా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, మే 09, 2020

పాలరాతి మందిరాన...

నేనూ మనిషినే చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనూ మనిషినే (1971)
సంగీతం : వేద (ఎస్.వేదాచలం)
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితే అందం

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ
తోడు లేని మరునాడూ వాడి పోవు కాదా
ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం
ఆ కన్నెకు తోడుగ నిలచి అల్లుకుంటే అందం


పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

నీ సోగకన్నుల పైనా బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను
ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం

చెలుని వలపు నింపుకున్న
చెలియ బ్రతుకు అందం
అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం..
లా.ల.లా..ల.. లాలలాలలాలా..
 

మంగళవారం, జనవరి 16, 2018

డుండుండుం గంగిరెద్దు...

మిత్రులందరకూ కనుమరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఎడ్లపందాలతో సందడిగా గడిచే పల్లె వాతావరణాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సరదా ఐన పాట విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అవేకళ్లు (1967)
సంగీతం : వేదపాల్ వర్మ (వేదా)
సాహిత్యం : కొసరాజు 
గానం : సుశీల, బృందం

డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు
డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు
ప్రభువు గారికీ దండం పెట్టమన్నాడు
పాతపంచ తప్పకుండా కప్పునన్నాడు

డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు

రామయ్యకు సీతమ్మకు పెళ్ళి అన్నాడు
బొర్రల్లుడు ఒచ్చెననీ బుర్ర ఊదాడు
రామయ్యకు సీతమ్మకు పెళ్ళి అన్నాడు
బొర్రల్లుడు ఒచ్చెననీ బుర్ర ఊదాడు
బుగ్గ ఎరుపు బుల్లెమ్మకు సిగ్గేసిందీ
బుగ్గ ఎరుపు బుల్లెమ్మకు సిగ్గేసిందీ
తుర్రుమనీ ఇంటిలోకి దూరుకున్నదీ
తుర్రుమనీ ఇంటిలోకి దూరుకున్నదీ

డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు

అల్లుడు పిల్లని చూసీ ఐసైపోయాడు
ఇల్లు చూసి పూరిదనీ మూతి విరిశాడు
అల్లుడు పిల్లని చూసీ ఐసైపోయాడు
ఇల్లు చూసి పూరిదనీ మూతి విరిశాడు
గుడిసె పీకి మేడలాగ మార్చుదాములే
గుడిసె పీకి మేడలాగ మార్చుదాములే
పెళ్ళి చేసి దీవెనతో పంపుదాములే
పెళ్ళి చేసి దీవెనతో పంపుదాములే

డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు
ప్రభువు గారికీ దండం పెట్టమన్నాడు
పాతపంచ తప్పకుండా కప్పునన్నాడు

డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు
డుండుండుం గంగిరెద్దు దాసరొచ్చాడు
డుడుడు బసవన్నను తోలుకొచ్చాడు

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.