శుక్రవారం, ఏప్రిల్ 09, 2021

కదులు కదులు కదులు...

ఈ రోజు విడుదలవుతున్న ’వకీల్ సాబ్’ సినిమా విజయవంతమవాలని ఆ సినిమా బృందానికీ పవన్ అభిమానులకూ బెస్ట్ విషెస్ చెబుతూ అందులోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ 
గానం : హేమచంద్ర, శ్రీకృష్ణ 

కదులు కదులు కదులు 
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు 
బానిస సంకెళ్ళను వదులు
 
కాలం తన కళ్ళు తెరిచి
గాలిస్తున్నది నీలో 
కాళిక ఏమైందని 
ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులీ నేను 
ఆడదాన్నంటుందా
తోక తొక్కితే నాగు తనను 
ఆడదనుకుంటుందా

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ  ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్
రంగులు పెట్టే గోళ్ళనే 
గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి 
పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని
నరకం పరిచయం చెయ్

నీ శరీరమే నీకూ 
ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో 
నీకు నీవే సైన్యం 
సైన్యం సైన్యం

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ  ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు 
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.