అనురాధా శ్రీరామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనురాధా శ్రీరామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జనవరి 28, 2021

చిలకమ్మా ప్రతి రేపవలూ...

ఆశ ఆశ ఆశ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆశఆశఆశ (2002)
సంగీతం : దేవా 
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : ఉన్నికృష్ణన్, అనురాధ 

చిలకమ్మా ప్రతి రేపవలూ 
వెంటాడినదే నీ జ్ఞాపకం
అమ్మమ్మా తొలిచూపులనీ 
కనుపాపలలో నా కాపురం 
చిన్న చిన్న కలతలు 
చిన్న చిన్న అలకలు
వచ్చిపోయె అతిథులు మనకే 
వంద ఏళ్ళ బంధనాల 
తీపి ఏమి మారిపోదు
రోజువారి ఇంటిగొడవలకీ
ప్రేమన్నది ఉన్నచోటా 
ఆఆఆఆ.. 
కలహం ఒక చిన్న ఆటా 
ఆఆఆఆ.. 

చిలకమ్మా ప్రతి రేపవలూ 
వెంటాడినదే నీ జ్ఞాపకం

మరుమల్లెల మంచంలో
చిరు చీకటి దుప్పటిలో
సరికొత్త రకం సరదాల సుఖం
సరసంగా నేర్పేదా
అటు జాబిలి చూస్తోందీ
కిటికీ తెరిచే ఉందీ
తెలుపెయ్యకనే తంటాలు పడే 
ఈ తొందర తప్పు కదా
ఆలు మగలమేగా అంత దూరమేలా
మోజు తీర్చగా మెల్లగా చల్లగా చేరవా

చిలకమ్మా మొహమాటపడి
మోహాన్ని మరీ పెంచావే
అమ్మమ్మా మాటే వినని 
మహ మొరటుతనం నేర్చావే

ఆ తొలిరోజుల తమకం
ఈ పెదవుల చలి గమకం
అది ఇప్పటికీ నా ప్రతి అణువు 
దాచిందే పదిలంగా 
ప్రతి పూటా చీరలనీ 
నగలే తెచ్చివ్వమనీ
వేధించాగా సాధించాగా 
గురుతుందీ నాకింకా 
తగవు మరిచి పోవే
తనువు మరిచి రావే
ఆశతీరగా వడిగా ఒడిలో పడవే

చిలకమ్మా నను చేరుకుని 
నా చేతులకీ పని చెప్పు మరీ
అమ్మమ్మా ఊరించకనే 
ఒడిచేర్చుకుని ఓదార్చు మరీ



మంగళవారం, అక్టోబర్ 01, 2019

జోలాలి వినలేదే..

మహా చండి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహా చండి (2002)
సంగీతం : టి.రాజేందర్
సాహిత్యం :
గానం : చిత్ర, అనురాధా శ్రీరామ్

జోలాలి వినలేదే తల్లి మోము కనలేదే
లాలీ.. జో లాలీ కాళీ శ్రీ శూలీ
జోలాలీ జోలాలీ నేనెవరినే
అమ్మా నువ్వు తోడుంటే నీ బిడ్డనే
జోలాలీ జోలాలీ నేనెవరినే
అమ్మా నువ్వు తోడుంటే నీ బిడ్డనే
వేయి కన్నులున్న తల్లి జోలాలీ
వేయి చేతులున్న తల్లి జోలాలీ
లోకమంత నీదేనమ్మా జోలాలీ
జీవులను కాపడమ్మా జోలాలీ

జోలాలి వినలేదే తల్లి మోము కనలేదే
జోలాలి వినలేదే తల్లి మోము కనలేదే
లాలీ జోలాలిజో.. లాలీ జోలాలిజో..

ప్రేమమీర బిడ్డను కనీ పాలిచ్చి పెంచేటి
ప్రేమమీర బిడ్డను కనీ పాలిచ్చి పెంచేటి
కన్నతల్లి దైవమని అంటారే
ఆ తల్లి ముఖమైన నేను కనలేదే
కోవెలకు నే వెళితే కుంకుమలో నీరూపే
తల్లివై నువ్వేనా కష్టాలు తీర్చావే
అమ్మా అంటే పరుగున నువ్వు రావా
కలతపడితే దయతో చూసుకోవా
వేడిన వరమిచ్చే శుభదాతా
వేదనలే పోగొట్టే మాతా

జోలాలి వినలేదే తల్లి మోము కనలేదే
జోలాలి వినలేదే తల్లి మోము కనలేదే
జోలాలీ.. లాలీ.. జోలాలీ... లాలీ...

ఏతప్పు చేశానో ఎవరినేమి అన్నానో
ఏతప్పు చేశానో ఎవరినేమి అన్నానో
నన్ను విడిపోయినది నా తల్లి
దయతోటి పెంచినదే నీవమ్మ
ఏకాకి నేనైతే నీడవై వచ్చావే
వ్యథతో నేనుంటే మమతే చూపావే
కనులు తుడిచి దయతొ కాచు తల్లి
నిను చూస్తే వెతలు తొలగు కల్పవల్లి

నీ చిరునవ్వు కన్నీరు నాదే
నా బిడ్డలలో ఒక బిడ్డవు నీవే
జోలాలి పాడవచ్చా తల్లినై నేను వచ్చా
జోలాలి పాడవచ్చా తల్లినై నేను వచ్చా
జోజో.. నా తల్లీ.. జోజో.. నా తల్లీ...
నేనున్నా నీకోసం చిన్నారి
నీవెంటే నేనుంటా బంగారీ
నేనున్నా నీకోసం చిన్నారి
నీవెంటే నేనుంటా బంగారీ
అమ్మా నేనున్నానే జోలాలి
నీకోసమున్నానే జోలాలి
కష్టాలు తీరేనే జోలాలి
శుభాలే కలుగునమ్మ జోలాలి
జోలాలి లాలీజో.. జోలాలి లాలీజో
జోలాలి లాలీజో.. జోలాలి లాలీజో 

 

శనివారం, డిసెంబర్ 29, 2018

కోపాల గోపాలుడే...

అల్లరి పెళ్ళాం చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లరి పెళ్ళాం (1998)
సంగీతం : రమణి భరధ్వాజ్
సాహిత్యం : సాహితీ
గానం : అనురాధా శ్రీరామ్, రమణి భరధ్వాజ్

కోపాల గోపాలుడే నా శ్రీవారు
అలిగారా బాగుంటారు
ఏ కొంచెం ఎడబాటైనా
నను ఆపైనా అమితంగా ప్రేమిస్తారు
తన కోపం శాంతించగా
సఖీ ప్రియా సపర్య చేయనా


షోకైనా భార్యామణీ ఈ దినమూ
చూపించకు అతివినయము
అందితె జుట్టును పట్టుడు
మరి కసిరితే కాలికి మొక్కుడు
బారుగ మూతులు తిప్పుడూ
ఈ భార్యలు ఇంతే ఎప్పుడూ

పొద్దున్నే లేవంగనే పొగలెగజిమ్మే
కాఫీనే అందించనా
పన్నీటి జలకాలతో నిను చల్లంగా
స్నానాలే చేయించనా
మనసెరిగిన ఇల్లాలల్లే
తోడూ నీడై సేవించుకోనా


అమ్మో నీ అల్లర్లతో నా పెళ్ళామా
నా కొంపే గుల్లయ్యిందే
ఇక కాకాలన్నీ ఆపవే
ఏకాకై పోతే మేలులే
జిలిబిలి సొగసుల జాణవే
ఈ చిల్లర తగవులు మానవే

నలభీమ పాకాలనే నేనొండేసి
మురిపెంగా తినిపించనా
ప్రతి ముద్దకు నా ముద్దునే
నే జోడించి యమాగా రుచి పెంచనా
పరువాన్నే తాంబులమై
రేయే హాయై పండించుకోనా


ఆమాటే మన బాటగా సాగించాలి
ముచ్చటగా సంసారమే
ఆలూమగలా బండికి
ఒక చక్రము దీనిలో ఆడది
ఊడితే దెబ్బలే ఒంటికి
నడిచిందా చేరుకొ ఇంటికి 

 

గురువారం, ఫిబ్రవరి 09, 2017

తీయగా రాగాలే తీయగా...

చాక్లెట్ రోజు సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ చక్కని పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :మృగం (1996)
సంగీతం : రాజ్ 
సాహిత్యం : సిరివెన్నెల ??
గానం : అనురాధా శ్రీరామ్, శ్రీరామ్ 

తీయగా రాగాలే తీయగా 
సయ్యందే వేడుకా మైనా
హాయిగా రగిలించే రేయిగా 
రమ్మంటే తోడుగా రానా 
అదిగో తీసుకొచ్చా పూలమేనా 
అపుడే తేలివచ్చా గాలిపైనా
ఐతే మన పరుపేద్దాం ఆనందం అంచునా 

తీయగా రాగాలే తీయగా 
సయ్యందే వేడుకా మైనా

కౌగిలింతే ప్రపంచం కావాలి 
జామురాత్రే ప్రభాతం రావాలి 
పాపం ఏమి తాపం ఈ ప్రకోపం కాస్త ఆపాలి
రూపం పచ్చ దీపం చూపుతుంటే ఎందుకాగాలి 
మోగనీ పెళ్ళి సన్నాయినీ 
రాయనీ ముద్దు శుభలేఖని 
నాకైనా ఆ మాత్రం ఆశగా లేదనా.. 
 
తీయగా రాగాలే తీయగా 
సయ్యందే వేడుకా మైనా

ఈడు పంచే రహస్యం తేలాలి
వేడి దించే మహత్యం చూడాలి 
తూగే సిగ్గు తీగే ఆగ్గివాగై కాంక్ష పెంచాలి 
సాగే కాలమాగే కన్ను సైగే కంచె తెంచాలి 
హో.. ఎప్పుడో చెప్పు ఆ ముచ్చటా 
ఇంతలో తొందరేముందట 
ఈ లోగ ఊరికే ఊహలో ఉండనా 
 
తీయగా రాగాలే తీయగా 
సయ్యందే వేడుకా మైనా
హాయిగా రగిలించే రేయిగా 
రమ్మంటే తోడుగా రానా 
అదిగో తీసుకొచ్చా పూలమేనా 
అపుడే తేలివచ్చా గాలిపైనా
ఐతే మన పరుపేద్దాం ఆనందం అంచునా 

తీయగా రాగాలే తీయగా 
సయ్యందే వేడుకా మైనా

 

మంగళవారం, మే 19, 2015

సూర్య కిరీటమే నీవా...

తెలుగు సినిమాలకు ఫ్యాక్షన్ కథలను పరిచయం చేసిన "ప్రేమించుకుందాంరా" చిత్రంలో అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపేసిన అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం : మహేష్ మహదేవన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, అనురాధా శ్రీరామ్

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ 
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా

కన్నె శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా 
సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా

సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి


ఆదివారం, జులై 20, 2014

సీతకోక చిలకలమ్మా...

పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మ లాంటి పాపాయిని పొదువుకున్న అమ్మ ఆనందం తెలియాలంటే ఆడజన్మ ఎత్తాల్సిందేనట... పాపలను సీతాకోక చిలుకలతోనూ సెలయేటితోనూ పోలూస్తూ అమ్మకి పాపాయి ఎంత అపురూపమో వివరిస్తూ సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి... మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సొగసు చూడ తరమా (1995)
సంగీతం : రమణి-ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాధా శ్రీరాం

ఆ... ఆ... ఆ... ఆ...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోట కన్నా చిందాడు పసివాడే మిన్నా
బుడత అడుగులే నడిచేటివేళలో పుడమితల్లికెన్ని పులకలో...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా 

  
గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒకవరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చేయి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా అలుపు సొలుపు లేని ఏ అలా...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.