అనిశెట్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనిశెట్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జనవరి 15, 2021

పదరా పద పద రాముడు...

రథం ముగ్గులు, మినప గారెలు, ముస్తాబైన పశువులు, ఎడ్లపందాలు, ఆటపాటలతో కూడిన కనుమ సంధర్బంగా కుటుంబగౌరవం చిత్రంలో అన్నగారు తన ఎడ్ల గురించి పాడిన ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కుటుంబ గౌరవం (1957)
సంగీతం :విశ్వనాథన్, రామ్మూర్తి
సాహిత్యం : అనిశెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల

ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు

రాముడూ పెద్ద మొనగాడు 
భీముడూ పెద్ద మోతుబరి 
ముట్టిన కొట్టిన సహించరూ
మోరలెత్తి పైకెగబడుతారూ 
కష్టం వేస్తే పెద్ద పులులవే 
ఇష్టం వేస్తే పసిపాపలవే 

పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 

తొలకరి జల్లే చిలకరించినా 
పొంగి నేలయే పులకరించినా 
పరవశమై దూకేస్తారూ
పొలాల చిటెకలో దున్నేస్తారూ
మా రైతులకే సాయంజేసీ 
మహరాజులుగా మార్చేస్తారూ 
ఏమంటావ్ రాముడూ 
ఏమంటావ్ భీముడూ 
ఏమంటావ్ రాముడూ 
ఏమంటావ్ భీముడూ 

అన్నా.. ఓ గోపన్నా.. 
నీకన్నా మాకు తోడు ఎవరున్నారన్నా 
నీవంటే మాకిష్టం నీస్నేహం అదృష్టం 
ఒహొహో ఒహొహో 
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా 
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా 
మనసే విప్పి పలికారా మానవులైనారా
మనసే విప్పి పలికారా మానవులైనారా
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి 
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి
అందరి చేతా ఘన సన్మానం చేయిస్తాలే రండి 

పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 


మంగళవారం, ఫిబ్రవరి 05, 2019

ఓ నెలరాజా వెన్నెల రాజా...

భట్టి విక్రమార్క చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భట్టి విక్రమార్క (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : అనిశెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల, సుశీల

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓ...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటె చుపూ నీకేల చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

ఆఆఆఆఆఆ.... ఆఆఆఆఆఆఆ...
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓ...
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడువ మనకు తరమవున చంద్రుడా

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలేయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

లేత లేత వలపులే పూత పూయు వేళలో
కలవరింత లెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా..

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

బుధవారం, జూన్ 01, 2016

చల్లని వెన్నెలలో...

సంతానం చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరచిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : అనిశెట్టి
గానం : ఘంటసాల 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

చల్లని వెన్నెలలో
చల్లని వెన్నెలలో...
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో...
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో 

చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

కలకలలాడే కన్నె వదనమే
కనిపింతును ఆ తారలలో..ఓ
కలకలలాడే కన్నె వదనమే
కనిపింతును ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము
కలకాలము నీ కమ్మని రూపము
కలవరింతులే నా మదిలో...ఓ..ఓ..

చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.