జీవిత చక్రం సినిమాలోని ఒక హుషారైన ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్-జై కిషన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, శారద
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బంధీవై చూడు
హాయ్ సందిట్లో బంధీవై చూడు
సయ్యాటలాడి చూడు
హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా
గుండెల్లో గుండె కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా
సయ్యాట వేళ కాదు
కానుకా ఇవ్వనా..
వద్దులే దాచుకో..
కోరికా చెప్పనా..
అహ తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు..
వుండవా హద్దులు
కాదులే కలిసిపో..
అహ నవ్వరా నలుగురు
కావాలి కొంత చాటు హోయ్
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బంధీవై చూడు.. పొపొ..
హాయ్ సందిట్లో బంధీవై చూడు
సయ్యాటలాడి చూడు
హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా
గుండెల్లో గుండె కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా
సయ్యాట వేళ కాదు
నువ్వు నా జీవితం నువ్వు నా ఊపిరి
నువ్విలా లేనిచో ఏండలో చీకటి
పాలలో తేనెలా ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు
హోయ్...కళ్ళలో కళ్ళు పెట్టి చూశా
గుండెల్లో గుండె కలిపి చూశా
సందిట్లో బంధీనై పోతా
సందిట్లో బంధీనై పోతా
సయ్యాట వేళ కాదు
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బంధీవై చూడు
హాయ్ సందిట్లో బంధీవై చూడు
సయ్యాటలాడి చూడు
లలల్ల్ల..లాల్లల్లాల్లా..లలలా...



