పి.సుశీల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పి.సుశీల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, ఏప్రిల్ 12, 2021

కొమ్మ మీద కోకిలమ్మ...

కోకిలమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది


గురువారం, మార్చి 11, 2021

శైల సుతా హృదయేశా...

మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వినాయకచవితి సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వినాయకచవితి (1957)
సంగీతం : ఘంటసాల    
సాహిత్యం : సముద్రాల   
గానం : పి.సుశీల, గోపాలరావు 

ఆఆఆఆఆఆఆ..ఆఆఆఅ
శైల సుతా హృదయేశా
సాంబశివా పరమేశా 
శైల సుతా హృదయేశా
సాంబశివా పరమేశా 

చంద్రకళాధర ఈశా
చంద్రకళాధర ఈశా
దేహిముదం జగదీశా

శైల సుతా హృదయేశా
సాంబశివా పరమేశా 

మధుర హాసా 
మృదువిలాసా
వినత వాగీశా 
మధుర హాసా 
మృదువిలాసా
వినత వాగీశా 
యోగిరాజ పరిపాలా 
నాగరాజ గళహారా 

శైల సుతా హృదయేశా
సాంబశివా పరమేశా 
శైల సుతా హృదయేశా
సాంబశివా పరమేశా 
 

మంగళవారం, జనవరి 26, 2021

నేను నా దేశం...

మిత్రులందరకూ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నేనూ నా దేశం చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నేను నా దేశం (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : అంకిశ్రీ 
గానం : బాలు, పి.సుశీల

నేను నా దేశం 
పవిత్ర భారతదేశం
సాటి లేనిది..ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం
 
నేను నా దేశం 
పవిత్ర భారతదేశం
 
అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలసిన శాంతి దేశం
కులమత భేధం మాపిన త్యాగి
అమర బాపుజీ వెలసిన దేశం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం
కులమత భేధం మాపిన త్యాగి
అమర బాపుజీ వెలసిన దేశం

నేను నా దేశం 
పవిత్ర భారతదేశం

కదం తొక్కిన వీర శివాజీ
వీర శివాజీ
వీర విహారిణి ఝూన్సీ రాణీ
ఝూన్సీ రాణీ
స్వరాజ్య సమరుడు అల నేతాజీ
జై హింద్...జై హింద్..జై హింద్
స్వరాజ్య సమరుడు అల నేతాజీ
కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం

నేను నా దేశం 
పవిత్ర భారతదేశం

ఆజాదు ఘోఖలె వల్లభ పటేలు, 
లజపతి, తిలక్, నౌరోజిలు
ఆజాదు ఘోఖలె వల్లభ పటేలు, 
లజపతి, తిలక్, నౌరోజిలు
అంబులు కురిపిన మన అల్లూరి
అంబులు కురిపిన మన అల్లూరి
భగత్ రక్తము చిందిన దేశం
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై

నేను నా దేశం 
పవిత్ర భారతదేశం

గుండ్ల తుపాకి చూపిన దొరలకు 
గుండె చూపే మన ఆంధ్రకేసరి
మన ఆంధ్ర కేసరీ
శాంతి దూత మన జవహర్ నెహ్రు
శాంతీ...శాంతీ...శాంతీ.. 
శాంతి దూత మన జవహర్ నెహ్రు
లాలబహదూర్ జన్మ దేశం
జై జవాన్..జై కిసాన్
జై జవాన్..జై కిసాన్

నేను నా దేశం 
పవిత్ర భారతదేశం

అదిగో స్వరాజ్య రధాన సారధి
అదిగో స్వరాజ్య రధాన సారధి
స్వరాజ్య రధాన సారధి
ఆదర్శనారి ఇందిరాగాంధీ 
గరీబి హఠావో... గరీబి హఠావో
ఆదర్శనారి ఇందిరాగాంధీ
అడుగు జాడలో పయనిస్తాం
అఖండ విజయం సాధిస్తాం
అడుగు జాడలో పయనిస్తాం
అఖండ విజయం సాధిస్తాం

నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటిలేనిది ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం
నేను నా దేశం నేను నా దేశం 
నేను నా దేశం 


బుధవారం, జనవరి 20, 2021

ఈ మధుమాసంలో...

కొండవీటిసింహం చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కొండవీటిసింహం (1981)
సంగీతం : చక్రవర్తి   
సాహిత్యం : వేటూరి   
గానం : బాలు, సుశీల  
 
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
అ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలొ ఉదయరాగ సిందూరం
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా 
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా 
సమశ్రుతిలో జతకలిసి
ప్రియలయలొ అదమరచి
అనురాగాలు పలికించు వేళ

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

అందమైన మన యిల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంజెలలొ తేనెనీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలొ కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే
శుభయోగాలు తిలకించు వేళ

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా
 


సోమవారం, జనవరి 18, 2021

ఎలా ఎలా దాచావు...

గోరింటాకు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్  
సాహిత్యం : దేవులపల్లి 
గానం : బాలు, సుశీల 
 
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ...

పిలిచి పిలిచినా పలుకరించినా 
పులకించదు కదా నీ ఎదా 
ఉసురుసురనినా గుసగుసమనినా 
ఊగదేమది నీ మది

నిదుర రాని నిశిరాతురులెన్నో
నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో..
ఆరాటములెన్నో..

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....

తలుపులు తెరుచుకొని 
వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపూ 
చొరబడతారా ఎవరైనా?

దొరవో... మరి దొంగవో
దొరవో... మరి దొంగవో
దొరికావు ఈనాటికీ...

దొంగను కానూ దొరనూ కానూ 
దొంగను కానూ దొరనూ కానూ
నంగనాచినసలే కానూ...

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
 


ఆదివారం, జనవరి 10, 2021

భలే మంచి చౌక బేరము...

ఆ లక్ష్మీనాధుని కొనుగోలు చేయగల ధనం మానవమాత్రుల వద్ద ఉంటుందా. అయినా నారదుల వారు ఈ సాహసానికి ఒడిగట్టారంటే సాక్షాత్తూ ఆ జగన్నాటక సూత్రధారే తన నాటకం వెనక ఉన్నారన్న ధైర్యమే కదా. శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించే ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : చిలకమర్తి లక్ష్మీనరసింహం / చందాల కేశవదాసు ?
గానం : ఘంటసాల, సుశీల 
 
భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము
కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము
ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

మునివరా... తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
ఘనులు స్వాదృశులే ఇటులన్
కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
కాదనుకొను డౌననుకొనుడొక మనసు 
నిష్కళంకముగా నొనరించి తృణంబొసగిన 
వెను వెంటనే నడచుచుండు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరుగున తడయగా

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏ విధి సవతులనిక వీక్షింపగలను
ప్రతి వచనంబేవిధాన బలుకగలను
ఎంత జేసితివి ముని
నీవు సత్యవంతుడవని ఎంచి
ఇట్లు పొరబడితిని మునివరా...

ఇదియే తుది సమయము త్వరపడుడు
ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి
ఇదియే తుది సమయము
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
అదృష్టమింతకెవరిదియో విధిగా
అచటికే కనునుగా ముదంబిపుడు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి భలే మంచి
భలే మంచి చౌక బేరము
 

 

బుధవారం, జనవరి 06, 2021

అమ్మా మన్ను తినంగ...

శ్రీ కృష్ణలీలలు సినిమాలో యశోదమ్మకు కన్నయ్య తన నోటిలో విశ్వాన్ని చూపించే ఒక చక్కని సన్నివేశాన్ని పద్యాలతో ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : పోతన 
గానం : సుశీల, లీల   

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్
 

సోమవారం, జనవరి 04, 2021

జోహారు శిఖిపింఛ మౌళీ...

శ్రీ కృష్ణ విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  
  
        
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల

జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ

కలికి చూపులతోనే చెలులను కరగించి..
కరకు చూపులతోనే అరులను జడిపించి..

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ

నీ నాదలహరిలో నిదురించు భువనాలు...
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగ యుగాల దివ్యలీల నెరపిన 
అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ

చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ 
 


ఆదివారం, డిసెంబర్ 27, 2020

పిల్లనగ్రోవి పిలుపు...

శ్రీకృష్ణ విజయం సినిమాలోని ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకొందామా. పెండ్యాల గారి స్వరసారధ్యంలో హాయిగా సాగే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1970)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

పిల్లనగ్రోవి పిలుపు... 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు..
ఈ మాధవునికే తెలుసు

 
సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు.. 
రతనాల బొమ్మకు తెలుసు...
ఈ రతనాల బొమ్మకు తెలుసు...

ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..అహా...ఆ...అహ..అహా..ఆ...

వెన్న మీగడలు తిన్నావట..
వెన్నెలలో ఆడుకున్నావటా..
వెన్న మీగడలు తిన్నావట...
వెన్నెలలో ఆడుకున్నావటా...
ఎన్నో నేర్చిన వన్నెకాడవట...
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట...

వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ...ఈ.....చిన్నారీ! 
నీ కన్నుల బాసలు.. 
వెన్నుని దోచిన ఆ మాట నిజము..
వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు..
నా డెందము నందొక మెరుపు
ఓ..పిల్లనగ్రోవి పిలుపు...
మెలమెల్లన రేపెను వలపు!
 
అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ..
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో...
అలవోకగా కనుగొన్నాను..
అలవోకగా కనుగొన్నాను... 
ఆఆ..అహ..ఆ..ఆహా..ఆ..
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును...
చెంగును ముడిచిన చెలువవులే...
చెలువవులే చెంగలువవులే...

పిల్లనగ్రోవి పిలుపు.. 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు
 
ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..ఆ...ఆ...అహ..ఆ..అహ...




శనివారం, డిసెంబర్ 26, 2020

లాలి తనయా...

శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : సుశీల    

లాలి తనయా లాలి
లాలి తానయా మా కన్నయ్య
బొజ్జనిండా పాలారగించితివి (2)
బజ్జోవయ్యా బుజ్జి నాయనా
లాలి తనయా లాలీ
లాలి తనయా మా కన్నయ్య

పున్నమే నినుకని మురిసేనయ్యా
జాబిలికన్నా చక్కని తండ్రి
జగమే నినుకని మురిసేనయ్యా
భువిలో ఎవరూ చేయని పుణ్యము
నోచినానురా నోముల పంటా

లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య

పాలూ వెన్న కావలెనంటే 
పరులపంచకు పోనేల(2)
ఇరుగు పొరుగు ఏమనుకొందురు
ఆకతాయివై అల్లరి చేయకు(2)

లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య

ఆటలనాడి అలసితివేమో (2)
హాయిగ నీవు నిదురించుమురా
దొంగ నిదురలో దోబూచులేలా
బంగరుకొండ పవ్వళించరా(2)

లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య
జోజోజోజో
 

  

శుక్రవారం, డిసెంబర్ 25, 2020

జీవము నీవేకదా దేవా...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీహరికి నమస్కరించుకుంటూ భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  
సాహిత్యం : సముద్రాల  
గానం : సుశీల  

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

పతితపావన శ్రితజనావన 
సుజన జీవన మాధవా!
భువననాయక ముక్తిదాయక 
భక్తపాలక కేశవా 

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

సర్వలోక కారణా! సకలశోక  వారణా!
జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
దుష్టగర్వ  శిక్షణా! శిష్ట  శాంతి రక్షణా! 
శాంతి  రక్షణా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా దేవా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా!!

జనకుడు నీపై కినుక వహించీ 
నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ 
సర్వము నీవే కదా స్వామీ !!

నిన్నేగానీ పరులనెరుంగా!
రావే! వరదా! బ్రోవగరావే! 
వరదా! వరదా! అని మొరలిడగా 
కరివిభు గాచిన స్వామివి 
నీవుండ భయమేలనయ్యా||
జీవము నీవే కదా||

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! 
కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! 
అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ 
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా 
పన్నగశయనా నారాయణా

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

మదిలో వెలిలో చీకటిమాపీ
ఆఆఅ... ఆఆఆ.అ....
మదిలో వెలిలో చీకటి మాపీ
పథము జూపే పతితపావనా!
పథము జూపే పతిత పావనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

భవజలధినిబడి  తేలగలేని, 
జీవులబ్రోచే పరమపురుషా! 
నను కాపాడి నీ బిరుదమునూ  
నిలువుకొంటివా శ్రితమందార

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

విశ్వమునిండీ వెలిగే నీవే 
నాలోనుండీ నన్నుకావగా!
విషమునుద్రావా వెరువగనేలా 
విషధర శయనా! విశ్వపాలనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా
 


శనివారం, డిసెంబర్ 19, 2020

యా రమితా వనమాలినా...

భక్త జయదేవ సినిమాలోని ఒక చక్కని జయదేవుని అష్టపదిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. క్వాలిటీ ఉన్న ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భక్తజయదేవ (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : జయదేవుడు 
గానం : ఘంటసాల, సుశీల 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 
సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 

సకల భువనజన వర తరుణేన 
సకల భువనజన వర తరుణేన 
వహతి న సా రుజ మతి కరుణేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా

అనిల తరళ కువలయ నయనేన
తపతి న సా కిసలయ శయనేన
యా రమితా వనమాలినా 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా
 
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 


 

బుధవారం, డిసెంబర్ 16, 2020

యదుమౌళి ప్రియసతి...

ఈ రోజు నుండీ ధనుర్మాసం మొదలౌతుంది కదా ఆ కన్నయ్యను తలుచుకుంటూ ఈ రోజు దీపావళి చిత్రం నుండి ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్ర్రం : దీపావళి (1960)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్యులు
గానం : పి.సుశీల, ఘంటసాల, ఎ.పి.కోమల 

యదుమౌళి ప్రియసతి నేనే 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

లేదు భూమిని నా సాటి భామా 
లేదు భూమిని నా సాటి భామా 
అందచందాలు నీవేను లేమా
అందచందాలు నీవేను లేమా
నీ హృదయేశ్వరి నేనేగా 

యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

హే ప్రభూ 
నీ సేవయె చాలును నాకూ 
హే ప్రభూ
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
మురిసెడి వరము నొసగుము స్వామీ 
అదియే నాకు పరమానందమూ 
హే ప్రభూ

సోగ కన్నుల నవ్వారబోసీ 
సోగ కన్నుల నవ్వారబోసీ 
పలుకు పంతాల బందీని జేసీ 
కోరిక తీరగ ఏలేగా 
 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 



శుక్రవారం, డిసెంబర్ 04, 2020

ఏమంటున్నది ఈ గాలీ...

మేమూ మనుషులమే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే  వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మేమూ మనుషులమే (1973)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..

ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి 
అహ..అహ..హ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి

ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ

పైటకు తెలుసు చాటున 
పొంగే ప్రాయం రెపరెపలూ...
గాలికి తెలుసూ విరిసీ విరియని 
పూవుల ఘుమఘుమలూ..
ఊగే నడుమూ.. సాగే జడతో..
వేసెను పంతాలూ..ఊ..
నీలో వుడుకూ.. నాలో దుడుకూ.. 
చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...

మబ్బు మబ్బుతో ఏకమైనది.. 
సాయం సమయంలో...ఓ..
మనసు మనసుతో లీనమైనది.. 
మమతల మైకంలో...ఓ..
అల్లరి కళ్లూ.. వెన్నెల నవ్వూ.. 
పెట్టెను గిలిగింతా..
వెచ్చని వొడిలో.. ఇచ్చిన చోటున.. 
ఇమిడెను జగమంతా..
ఇమిడెను జగమంతా..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...
అహ..హ..అహా...లల..ల.లా.లా..
అహ..హ..అహా...లల..ల.లా.లా..


ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రియే! చారు శీలే...

మేఘసందేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మేఘసందేశం (1984)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : జయదేవుడు, పాలగుమ్మి పద్మరాజు
గానం : ఏసుదాస్, సుశీల 
 
ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥


ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
 
 వదసి యది కించిదపి దంత రుచి కౌముదీ
హరతి దర తిమిరమతిఘోరం ।
పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు
కలికి నా ఎడద చీకటుల పో ద్రోలు
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరమ్‌ ॥
నీ మోము జాబిల్లి మోవి తేనియలు
నా నయనమ్ములు చకోరమ్ములై గ్రోలు

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!

నా పైని అలకేమి ఓ కామినీ 
నా పైని అలకేమి ఓ కామినీ
నా మేన నఖ ముద్ర కెంపులే వెలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగనీ
గాఢంపు సుఖము నా కటులైన కలుగనీ
ఓ... కామినీ... 

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానం అనిదానం ।
ప్రియే! చారు శీలే!
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌॥


ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!



శనివారం, నవంబర్ 28, 2020

మక్కువతీర్చరా...

లేతమనసులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లేతమనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం : క్షేత్రయ్య పదం
గానం : సుశీల

మక్కువతీర్చరా మువ్వగోపాలా
మక్కువతీర్చరా మువ్వగోపాలా
సొక్కియున్న నీ సొగసది ఏమిరా

మక్కువతీర్చరా మువ్వగోపాలా
సొక్కియున్న నీ సొగసది ఏమిరా
ఒకసారికే ఏఏఏ.. ఒకసారికే .. ఆఆ ఒక్కసారికే

ఇనపురి ముద్దుల మువ్వగోపాలా
ఇనపురి ముద్దుల మువ్వగోపాలా
ఏపుమీర నను కలసితిఔరా..
ఏపుమీర నను కలసితిఔరా..
మనముననిన్ను నెరనమ్మిన దానరా. 
మనముననిన్ను నెరనమ్మిన దానరా. 
మారు పలుకకున్నావది ఏమిరా..

మక్కువతీర్చరా మువ్వగోపాలా
సొక్కియున్న నీ సొగసది ఏమిరా
ఒకసారికే ఏఏఏ.. ఒకసారికే .. ఆఆ ఒక్కసారికే 


 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.