ప్రశాంత్ ఆర్. విహారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రశాంత్ ఆర్. విహారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జూన్ 04, 2020

కళ్లల్లో కలవరమై...

దొరసాని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దొరసాని (2019)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : శ్రేష్ట
గానం : చిన్మయి  

కళ్లల్లో కలవరమై కలవరమై
గుండెల్లో పరవశమో వరమై
కళ్లల్లో కలవరమై కలవరమో
వరమే అవ్వగా

కళ్లల్లో కలవరమై కలవరమై
గుండెల్లో పరవశమే వశమై
కళ్లలో కలవరమై కలవరమై
కలిగే కోరిక


ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా
ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల ఒడిలో ఆడుతూ ప్రాణమే
ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో
ఉడికిస్తూ చంపుతుంటే
ఆ తపనలోన తనువు
తుళ్ళి పడుతుంటే

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే


ఏవో ఏవో ఏవో ఆశలే మెల్లగా
ఎదపై తీపి మధువే చెల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా
మైమరపించు మాయే చెయ్యగా
అణువణువూ అలజడి రేగి
తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన
ఈడు సతమతమై

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే

 

ఆదివారం, డిసెంబర్ 02, 2018

సమయమా...

ఘాజీ దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో త్వరలో వెలువడనున్న అంతరిక్షం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంతరిక్షం (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : యాౙిన్ నిజార్, హరిణి 

సమయమా...
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా...
మరింత హాయి పోగు చేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోనా
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోనా
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ..

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా

ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే ఏఏఏ..
ఈ నేల జాబిల్లి పై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే..ఏఏఏ..
తనే నా సగంగా తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా.. ఆఅ..

ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు 

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా 


మంగళవారం, ఆగస్టు 07, 2018

తొలి తొలి ఆశే ఏమందే...

లేటెస్ట్ హిట్ చి||ల||సౌ|| చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిలసౌ (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి    
సాహిత్యం : శ్రీ సాయి కిరణ్ 
గానం : చిన్మయి 

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్న బావుందా ఇలా

అదేదో జరిగిందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా

మెల్లగా మెల్లగా
నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా

మెల్లగా మెల్లగా
ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా

ఏమయ్యిందో చినుకై
ఎదలో మొదలై ఒక అలజడి
పోపొమ్మంటూ ఇటు తరిమినదా
లోలో ఏదో ఇదివరకెపుడెరుగని
తలపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమీ

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా

మెల్లగా మెల్లగా
నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా

మెల్లగా మెల్లగా
ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

మంగళవారం, మే 15, 2018

ఊహలే ఆగవే...

మెంటల్ మదిలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మెంటల్ మదిలో (2017)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : వివేక్ ఆత్రేయ
గానం : శక్తిశ్రీ గోపాలన్ 

ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
 
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా

 

అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై

ఓఓఓ అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై


ప్రతిపదం పాదమై
ఓ గానమై నీ చెంత చేరదా
పదే పదే ఊసులై
ఊరించెనే ఎడారి వానలా

ఊఊఊఊ... ఊఊఊఊ


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.