పృథ్వీచంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పృథ్వీచంద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మార్చి 12, 2021

అందమే అతివై వస్తే...

సుల్తాన్ సినిమాలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సుల్తాన్ (2021)
సంగీతం : వివేక్,మెర్విన్   
సాహిత్యం : కృష్ణకాంత్ 
గానం : పృథ్వీ చంద్ర  

హే అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే 
చంపుతోంది నన్నే

అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే

నీ చెయ్యే తాకి నీళ్ళాకైనా 
సర్రూన జర్రం రాదా
గండు చీమే నిన్నే కుట్టి 
సీతాకోకై పోదా
నువ్వట్టా పూసే పచ్చి పసుపే 
కొంగొత్త కలరై మారు
నీ కాలికంటే మట్టీ కూడా 
మిఠాయి కాదా నాకు
పోగు చెవికూగినా 
ప్రేమ పెరిగేనులే
నీ చేతి గోరింటాకే 
నా లోకమెరుపెక్కునే
నింగి తిరగేసి చీర నేస్తా 
తారై రారాదే తళుకు నువ్వే 
తళుకు నువ్వే

తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే 
చంపుతోంది నన్నే

అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని షాకులే
 


గురువారం, మార్చి 04, 2021

సత్యమేవ జయతే...

లాంగ్ బ్రేక్ తర్వాత పవన్ నటిస్తున్న ’వకీల్ సాబ్’ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : శంకర్ మహదేవన్, పృథ్వీచంద్ర

జన జన జన.. జనగణమున 
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున 
నిలబడగల నిజం మనిషిరా..

నిశి ముసిరిన కలలను 
తన వెలుగుతో గెలిపించు 
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక 
బలమగు భుజమివ్వగలడురా..

వదలనే వదలడు.. 
ఎదురుగా తప్పు జరిగితే..
ఇతనిలా ఓ గళం 
మన వెన్ను దన్నై పోరాడితే..

సత్యమేవ జయతే.. 
సత్యమేవ జయతే..

జన జన జన.. జనగణమున 
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున 
నిలబడగల నిజం మనిషిరా..

నిశి ముసిరిన కలలను 
తన వెలుగుతో గెలిపించు 
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక 
బలమగు భుజమివ్వగలడురా..

గుండెతో స్పందిస్తాడూ
అండగా చెయ్యందిస్తాడు

ఇల చెంప జారెడి ఆఖరి 
అశ్రువునాపెడి వరకూ అనునిత్యం 
బలహీనులందరి ఉమ్మడి గొంతుగ 
పోరాటమె తన కర్తవ్యం

వకాల్త పుచ్చుకుని 
వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి 
కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని 
కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి 
పెట్టిస్తాడు దండాలు 
ఇట్టాంటి ఒక్కడుంటే 
అంతే చాలంతే 
గొంతెత్తి ప్రశ్నించాడో 
అంతా నిశ్చింతే 
ఎట్టాంటి అన్యాయాలు 
తలెత్తవంతే 
మోరెత్తే మోసగాళ్ళ 
పత్తా గల్లంతే 

సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
 


శుక్రవారం, జులై 03, 2020

నిన్ను రోడ్డు మీద...

ఈ రోజు సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య రీమేక్ చేసిన ఓ పాటను తలచుకుందాం. ఈ రీమిక్స్ పాటను కూడా ఒరిజినల్ స్వరపరచిన కీరవాణి గారే స్వరపరచడం విశేషం. పల్లవిని మాత్రం వాడుకుని చరణాన్ని మార్చి రాసేసుకుని మరింత ర్యాప్ చేర్చేసి రీమిక్స్ చేసిన ఈ పాట విశేషమేంటో మీరే చూసేయండి. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సవ్యసాచి (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి, వేటూరి 
గానం : పృథ్వీ చంద్ర, మౌనిమ చంద్రభట్ల, 

నూనూగు మీసాల నూత్న యవ్వనమున
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైందీ ప్రేమ కహానీ
ఆ కాంటీన్ లో సొల్లు కబుర్లు 
నైటంతా బైక్ షికారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీట్టే
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాక్డ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయతు
మై హార్ట్ ఈజ్ బౌన్సింగ్ 
ఎన్ ఫాలింగ్ యట్ యూ

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వే కదా నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయతు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగమన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత్తం
దునియానంత దున్నేద్దాము
తుబిందా.. లగాయతు.. 

లైలా మజ్ను
లగ్గాయతు లగ్గాయతు
దేవ్ డి పారు
లగ్గాయతు లగ్గాయతు
మై దీవానీ తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నర్ లో
చెయ్యి చేయీ తగిలేలా
గురుతుందా రసలీలా

లేట్ నైట్ లో లైవ్ చాట్ లో 
ఎన్ని పాటలో హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు చిల్లర ఊహాలు
ఎన్నని చెప్పను పిల్లో మరదల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నిన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఒరిజినల్ వర్షన్ అల్లరి అల్లుడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అల్లరి అల్లుడు (1993)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, చిత్ర 

నూనూగు మీసాల 
నూత్న యవ్వనమున
ఏలూరు సి.ఆర్.రెడ్డి. కళాశాలలో
ఓ రాణీ ప్రేమ పురాణం
ఆ ముచ్చటకైన ఖర్చూ
రోజంతా జంట షికార్లు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు 
వన్స్ మోర్ 
మరపు రావు కాలేజీ రోజులు
వాహ్ క్యాబాత్ హై.. 

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

కాంచనమాల లగాయతు లగాయతు
సూర్యకుమారి లగాయతు లగాయతు
నేను కానా నీకు లేనా

ఆరోజుల్లో మీ ఆడాళ్ళల్లో
కట్ బ్లౌజుల్లో లైలా పోజుల్లో
మొహమాటాలే విడిచీ  
మొగుడాటల్లో గెలిచీ
ప్లాటుఫారమో పార్కు తీరమో
ప్రేమలేఖలా రాయబారమో
జన్మకు రానిది  
మన్మధ సీజను 
ప్రేమతపాలపు అడ్రెసు
U MY LOVEEEE

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

SD బర్మన్ లగాయతు లగాయతు
ఆనంద్ భక్షి లగాయతు లగాయతు
నీది రాగం నాది భావం

ఈ కౌగిట్లో సాగే డ్యూయెట్లో
సిగ్గందిట్లో జారే సందిట్లో
చలిపాఠాలే చదివీ వలపాటల్లో కరిగీ
లవ్ పరీక్షలో ఫష్టు ర్యాంకులో
హిట్టు కొట్టనా జట్టు కట్టనా
నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల 
ప్రేమ జపాలకు మంత్రం
I LOVE UUUUUUU

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు
నేను రోమియోగ మారినది లగాయతు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయతు
అది భామ కాదు క్వాక్ క్వాక్

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు
నన్ను కౌగిలింత కోరినది లగాయతు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు
   

గురువారం, డిసెంబర్ 12, 2019

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో...

వెంకి మామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వెంకిమామ  (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : పృథ్వీ చంద్ర 

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో

ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో

హియర్ వి గో
హీ ఈజ్ ద బ్రాండ్ న్యూ
వెంకి మామ వాటె చేంజ్ మామ
హే భామా మామ భామ మామ

హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి
సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే
పైర గట్టు చూడు పిల్ల గాలి తోటీ
ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ
గొడుగు కింద చోటు కూడా
ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే
మండు వేసవేళ
వెన్నెలంటి ఊసు వింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే

ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో

ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో 
 

సోమవారం, జనవరి 28, 2019

నువు రాముడేషమే...

కథానాయకుడు చిత్రంకోసం కీరవాణి కంపోజ్ చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కథానాయకుడు (2018)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కాలభైరవ, పృథ్వీచంద్ర

ఎన్టీఆర్... ఎన్టీఆర్... ఎన్టీఆర్...
నువు రాముడేషమే కట్టావంటే
గుండెలు అన్నీ గుడులైపోతాయే హో..
నువు కృష్ణుడై తెరమీదకు వస్తే
వెన్నముద్దలై కరిగెను హృదయాలే హో..
ఆ దేవుడు దేవుడు ఎదురుగ
వచ్చిన దేవుడు కాదంటాం
ఎందుకనీ అడిగాడో
ఎన్టీఆర్ పోలిక ఒకటీ లేదంటాం..

తెల్లారగట్ల లేచిపోయి
చద్ది కూడు పట్టుకుని   
ఎడ్లబళ్ళు కట్టుకుని వచ్చేశాం
మేం చొక్కాలెన్నో చింపుకున్నాం
గొంతులన్నీ చించుకున్నాం
తనివి తీరనిది నీపై అభిమానం

నువ్వందుకున్న ఘనతని చదివితే
ముచ్చెమటలు పట్టవ చరితకే
ఆ గెలుపను నింగికి నువ్విక చందమామే
ఎవ్వడికీ రాదులేరా నీలో ఎంత రాజసంరా
కనిపిస్తే గత్తర గత్తర నేలా బెంచీల్లో
ఈలలు గొట్టీ ఊళలు గొట్తి
రచ్చలు రేపే రంగుల జాతర ఎన్టీఆర్..

నీ వాల్ పోస్టరు.. హోలీ రంజాన్ ఈస్టర్
గుండీలు తీసుకుంటు కాలర్ ఎత్తి కేకలు కేకలు
ఎవ్వరు చేసిన పుణ్యమొ పుట్టేశావు
భూమికి వైభోగాన్ని తెచ్చావు
శతాబ్దమంతా ఏలుకోరా.. ఎన్టీఆర్..

ఒక రాగమెత్తి నువు పద్యం పాడితె
రాసినోడి చెయ్యి దండం పెడుతుందే హో..
ఆ తేనెలొలుకు నీ మాటలు వింటే
తెలుగు భాష తెగ సంబరపడుతుందే హో..
నువ్వెయ్యని చెయ్యని పాత్రలు గానీ
మిగిలున్నాయంటే ధైర్యంగా చెప్పగలం
ఆ పాత్రలకంతటి ప్రాప్తం లేదంతే

నీ బొమ్మలున్న పత్రికల్ని
పుస్తకాలకట్టలేసి మురిసిపోయి
హీరోల్లాగ ఫోజిస్తాం
మా కళ్ళల్లోన పెట్టుకున్నాం
పచ్చ బొట్టు ఏసుకున్నాం
వెండి తెరకు నువు మేలిమి బంగారం

నిన్నింతకన్న ఇంతకన్న పొగిడితే
మా దిష్టి తగిలి నీకేమన్న జరిగితే
నిను ఊపిరిగ చేసుకున్న మనసులు తట్టుకోవే

వచ్చిందని కొత్తనీరు పొంగింది నిమ్మకూరు
పరుగో పరుగో పరుగో పరుగెత్తిపోయింది పాతనీరు
ఇక ఎవడూ ఎవడూ ఎవదూ ఎదురే లేడు
ఎండనక వాననకా పగలనక రేయనకా
ఒకటే చప్పుడు ఎన్టీఆర్

బుకింగ్ కౌంటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డు
బద్దలవుద్ది చూడు బాక్సాఫీసు దుమ్ము
దులుపు దులుపు దులుపు ఎన్టీఆర్.. 
 

శుక్రవారం, మార్చి 18, 2016

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్...

ప్రేమలో పడిన కుర్రాళ్ళ ఫీలింగ్ ను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేను శైలజ (2015)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
గానం : పృథ్వీచంద్ర

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటే
చైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందే

మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే


ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్


రోడ్ సైడ్ నీతోటి పానిపూరీ తింటుంటే
ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే


క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్


నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే
నిన్ను చూసినాక సో సో గుందే
రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక  ఐ యామ్ హ్యాపీ అందే
రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి
పెరుగుతుంటే ఆస్కార్  విన్ అయినట్టుందే
సారీ హరి  నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.