బుధవారం, ఏప్రిల్ 14, 2021

కోకిల కోకిల కూ అన్నది...

పెళ్ళిచేసుకుందాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997)
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీహర్ష
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో 

కోకిల కోకిల కూ అన్నది.. అహ..హహ..హా..
వేచిన ఆమని ఓ అన్నది.. అహ..హహ..హా.. 

గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా 

కోకిల కోకిల కూ అన్నది.. అహ..హహ..హా..
వేచిన ఆమని అన్నది.. అహ..హహ..హా.. 

వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదంటు లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మ

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో 




0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.