శనివారం, ఏప్రిల్ 10, 2021

నిన్న చూసి వెన్నెలే...

హాపీడేస్ సినిమాలోని అరెరె మనసే జారే ట్యూన్ లోనే ఉంటూ సినిమా మధ్య మధ్యలో నేపధ్యంలో బిట్స్ గా వచ్చే ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియోలో ప్రత్యేకంగా విడుదలవలేదు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : హ్యాపీడేస్ (2007)
సంగీతం : మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం : వనమాలి 
గానం : కార్తీక్  

నిన్న చూసి వెన్నెలే అనుకున్నా
మొన్న కూడా నిన్నలా కలదన్నా
అడుగెటు పడుతున్నా 
తనవైపెళుతున్నా

కునుకైన రాని సమరాన
కను మూస్తే చాలు తమరేనా
పెనవేసుకున్న ప్రణయమున
యమునా తీరేనా

నింగి లోని తారలా నీవున్నా
నేలకందే దారులే చూస్తున్నా
ఎదురుగ నేనున్నా
ఎరగవు కాస్తైనా

ఒక మనసు తపన చూసైనా 
ఒడి చేరవేల ఓ లలన
అలజడులు బయట 
పడుతున్నా మౌనంగా ఉన్నా

కరిగా ఓ తీపి కలగా
మిగిలా ఈ నాడు శిలగా
ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా

కరిగా ఓ తీపి కలగా
మిగిలా ఈ నాడు శిలగా
ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.