సుమంగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుమంగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, మే 14, 2020

మెల్లగా కరగనీ...

వర్షం చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వర్షం (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.చరణ్, సుమంగళి

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి
హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన
బిడియం తడబడి నిను విడదా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా

ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులువేయనా
మన కలయిక చెదరని చెలిమికి
ఋజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి
హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
 

గురువారం, సెప్టెంబర్ 01, 2016

ఎవరో..అతనెవ్వరో..

అభి చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటె ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లొడ్ చేస్కోవచ్చు. వీడియో దొరకలేదు ఎంబెడ్ చేసినది జ్యుక్ బాక్స్ అది లోడ్ అవని వాళ్ళు ఇక్కడ వినవచ్చు. 

 

చిత్రం : అభి (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : వేటూరి
గానం : సాగర్, సుమంగళి

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ

తెలవారే వేళా..కలగన్నా తననే..
అది ప్రేమో ఏమో..ఏమిటో

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

అణువణువు అతని తలపే వేధించసాగే
అనుదినమూ అతని కధలే వినిపించెనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడ సాగే
తొలి వలపో..జతకు పిలుపో బదులే రాదే

మనసుంటే నేరం .. మనసంతే భారం
నిలిచేనా ప్రాణం .. ఒంటిగా

ఎవరో..తను ఎవ్వరో..ఎదురే వచ్చిందీ
వివరం ఏం చెప్పనూ..విరహం రేపిందీ
హో..ఓఓ..ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ

ఓ..పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంధం రాసే
ప్రతినిముషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసే

హౄదయం లో దాహం..తడిపే ఓ మేఘం
ఎపుడూ నీ స్నేహం..ఓ ప్రియా

ఎవరో..అతనెవ్వరో..అతిధిగ వచ్చాడూ
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడూ
తెలవారే వేళా..హా.. కలగన్నా తననే.. హా..
అది ప్రేమో.. హా..ఏమో..ఏమిటో
 

శుక్రవారం, మే 27, 2016

ఏదో ప్రియరాగం వింటున్నా...

ఆర్య చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వర సారధ్యంలో సిరివెన్నెల గారు వ్రాసిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సాగర్, సుమంగళి(ఆలాప్)

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే



శుక్రవారం, మే 08, 2015

కనులు తెరిచినా...

ఆనందం చిత్రం కొసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన ఒక చక్కని సిరివెన్నెల రచనను ఈ రోజు తలచుకుందాం. వీడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆనందం (2001)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్, సుమంగళి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
 
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
 
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

 
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా 
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

సోమవారం, మే 04, 2015

నిలువద్దము నిను ఎపుడైనా...

దేవీశ్రీప్రసాద్ అండ్ సిరివెన్నెల గారు చేసిన వండర్ ఫుల్ మాజిక్ ఈ పాట.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్, సుమంగళి

ఊ...నిలువద్దము నిను ఎప్పుడైనా 
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా...
నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా..
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా...
నీ కన్నుల మెరిసే రూపం.. నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే.. తియ్యదనం నాపేరేనా
అది నువ్వే.. అని నువ్వే.. చెబుతూ ఉన్నా..

నిలువద్దము నిను ఎప్పుడైనా 
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా..

ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు 
నామాట విన్నట్టు నేనాపలేనంతగా...
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా...
 

నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు...
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు.. 

లలల...లలలై...లలల...లలలై
లలల...లలలై...లలల...లలలై...

నిలువద్దము నిను ఎప్పుడైనా 
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా....

ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా...

 తడబడకు నన్ను అడుగు... చెబుతాను పాఠాలు
నీలేత పాదాలు.. జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం.. 

మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం ...

లలల...లలలై...లలల...లలలై
లలల...లలలై...లలల...లలలై

 

సోమవారం, మార్చి 30, 2015

ప్రియా ప్రియా అంటూ...

దేవీశ్రీ కంపోజ్ చేసిన "కలుసుకోవాలని" సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కలుసుకోవాలని (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వేణు, సుమంగళి

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా

 ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని

క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది

ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చేయగా
యుగాలు కలకాలమా ఇలాగే నూఆగుమా
దయుంచి ఆ దూరమా ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా


శుక్రవారం, జూన్ 13, 2014

నువ్వు నువ్వు...

సిరివెన్నెల గారి సాహిత్యానికీ, దేవీశ్రీ సంగీతానికీ, కృష్ణవంశీ చిత్రీకరణ తోడైతే ప్రేమికుల మనసును వింత లోకాలలో విహరింప చేస్తుంది కదా మరి... ఇష్టమైన అబ్బాయి మీద ఇష్టాన్ని మరింత ఇష్టంగా వ్యక్తీకరించే ఈ పాట వచ్చి అప్పుడే పన్నెండేళ్ళైనా ఇంకా కొత్తగానే ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఖడ్గం (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుమంగళి

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ

నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా వయసుని వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వూ
మెత్తని ముళ్ళే గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే కోరికవే నువ్వు
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వూ
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
ఐనా ఇష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరుజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వూ నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.