ఆదివారం, ఆగస్టు 31, 2014

తూనీగా తూనీగా...

ఒక టైమ్ లో తెలుగు సినీ ప్రేక్షకులను మధురమైన సంగీతంలో ఓలలాడించిన ఆర్పీపట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాట ఇది. నాకు ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మనసంతానువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : సంజీవని, ఉష

తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా
దూరంగా పోనీకా 
ఉంటాగ నీ వెనకాలే 
రానీ సాయంగా
ఆ వంక ఈ వంక హొహొ తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
 
తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా

దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసిఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుణ్ణే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా

తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓ సారటువైపెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈరైలుకి సొంతూరేదో గురుతురాదెలా
 
కూ కూ బండి మా ఊరుంది 
ఉండిపోవే మాతో పాటుగా
 
తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే 
రావే నా వంకా
దూరంగా పోనీకా 
ఉంటాగ నీ వెనకాలే 
రానీ సాయంగా 
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా


శనివారం, ఆగస్టు 30, 2014

నిదురించే తోటలోకి

నాకు రేడియో పరిచయం చేసిన అద్భుతమైన పాటలలో ఇదీ ఒకటి... పాట మొదలవగానే ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడివక్కడ ఆపేసి మరీ వినేవాడ్ని. సుశీల గారు పాడిన ది బెస్ట్ సాంగ్స్ లో ఇదీ ఒకటనవచ్చునేమో. మహదేవన్ గారి సంగీతం శేషేంద్రశర్మ గారి సాహిత్యం సుశీలమ్మగారి గాత్రం కలిసిన ఈ పాట విన్నవెంటనే మనసులో చెరగని చోటు సంపాదించేసుకుంటుంది. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : గుంటూరు శేషంధ్రశర్మ
గానం : సుశీల

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండీ నావకు చెప్పండి

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది


శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఎవరవయ్యా..ఎవరవయ్యా...

శ్రీ వినాయక విజయం సినిమాలో చిన్నారి వినాయకుణ్ణి ఉద్దేశించి పార్వతీ దేవి పాడే ఈ పాట నాకు చాలా ఇష్టం, దేవులపల్లి వారి రచన ఆకట్టుకుంటే సాలూరి వారి సంగీతం మార్ధవంగా సాగి మనసుకు హాయినిస్తుంది. వినాయక చవితి సంధర్బంగా మీరూ ఈ చక్కని పాట చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : పి.సుశీల

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా...

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో !
పూజలలో మొదటి పూజ నీదేనేమో !

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా..

చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో
ఎన్నెన్ని వింతలో...
ఎన్నెన్ని కోరికలు నిండి నే కన్న
ఎన్నెన్నో స్వప్నాలు పండి..
చిన్నారి ఈ మూర్తివైనావో
ఈరేడు లోకాలు ఏలేవో
ఈరేడు లోకాలు ఏలేవో

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..

~*~*~*~*~*~*~*~*~*~

పై పాటలో బాల వినాయకుడ్ని చూశారు కదా... ఇపుడు గజముఖుడిని చూడండి... కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరూ తమ తండ్రి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని స్థుతిస్తూ చివరికి విశ్వరూప సందర్శనమిచ్చిన ఆ లయకారుడిని ఎలా ప్రార్ధిస్తున్నారో మీరూ చూసి తరించండి. అందరకూ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఈ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు...చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : వీటూరి
గానం : శైలజ, రమేష్
 
ఒక వంక వరనీల కబరీ భరమ్ము
ఒక వంక ఘన జటాజూట భరితమ్ము
ఒక వంక మణి మయోజ్వల కుండలాలు
ఒక వంక భయద పన్నగ భూషణాలు
ఒక కంట కారుణ్య అవలోకనాలు
ఒక కంట విస్ఫులింగ గచ్ఛటాలు
ఒక వంక రమణీయ కాంచనాంబరము
ఒక వంక నిర్వికారము దిగంబరము
ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము
ఒక పదమ్మున ప్రళయ తండవ విజృంభణము
విశ్వ శ్రేయార్ధకము సృష్టి పరమార్ధమ్ము
శక్తి శివ శక్తుల సంగమ స్వరూపమ్ము
సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము
అనశ్వరము శుభకరము అర్ధనారీశ్వరము

శ్రీమన్మహా దేవదేవా ! అమేయ ప్రభావా ! భవా !
భవ్య కారుణ్య భావా ! శివా !
భవానీ ప్రియా ! చిన్మయానంద హృదయా అద్వయా !
దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా ! అవ్వయా !
ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధార చక్రాన విహరించి 
సంరక్తితో సృష్టి గావించి పాలించవే
సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా  !
నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా !
భూమి నీ పాద పీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా 
తేజమే నీకు నీరాజనమ్ముగా 
వాయువే వింజామరమ్ముగా నభము ఛత్రమ్ముగా 
పంచ భూతాలు సతతమ్ము సేవించగా 
సప్తపాదోనిధుల్ సుప్త శైలేంద్రముల్ 
సర్వ లోకాలు తీర్థాలు నీ కుక్షిలో 
సదా ప్రక్షిప్తమై యుండవే !
విశ్వరూపా  ! నమో వేద భువన ప్రదీపా  !
సంతతానంద కేళీకలాపా ! 
జగద్ గీత కీర్తీ  ! లసత్ భూత వర్తీ  !
సదానందమూర్తీ ! నమో దేవతా చక్రవర్తీ 
నమస్తే.. ! నమస్తే.. !! నమః.. !!!       


గురువారం, ఆగస్టు 28, 2014

వేటాడందే ఒళ్ళోకొచ్చి...

చేతిలో బంగారమంటి విద్య ఉండి కూడా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా బతికేస్తూ ఏ పని చేయకుండా జాతకాలనూ బల్లి శాస్త్రాలను నమ్ముకుని అదృష్టం కోసం ఎదురు చూసే మనిషి "లేడీస్ టైలర్" సినిమా కథానాయకుడు సుందరం. పల్లెల్లో ఆహ్లాదకరమైన ఉదయపు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఆతని బద్దకం గురించి కూడా ప్రేక్షకులకు చక్కని అవగాహన వచ్చేలా టైటిల్స్ కి నేపధ్యంగా ఒక పాట పెడితే బాగుంటుందనుకున్నారు వంశీ. తన ఆలోచనలకు సిరివెన్నెల గారు చక్కని అక్షరరూపమిస్తే ఇళయరాజా గారు గురకను నేపధ్యంగా చేసుకుని ఆకట్టుకునే బాణి ఇచ్చారు ఇక వంశీ గారు చిత్రీకరించడంలో తగ్గుతారా.

అయితే ఎందుకో ఈ పాటను క్యాసెట్ లో మిగిలిన పాటలతో పాటు విడుదల చేయలేదు కేవలం సినిమాలో మాత్రమే ఉంటుంది. సినిమా చూసేప్పుడు నేపధ్య సంగీతంలా తప్ప ఒక ప్రత్యేకమైన పాటగా గుర్తించలేకపోయామని చాలామంది చెప్పారు. నాకు కూడా ఈ సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట అస్సలు గుర్తులేదు. శ్రద్దగా ఆలకించాక నాకు బాగా ఇష్టమైన పాటలలో ఒకటిగా చేరింది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియోలో లేకపోవడంతో ఈ పాట పాడిన గాయనీ గాయకుల గురించి కూడా సరైన సమాచారం లేదు, మీకు తెలిస్తే పంచుకోగలరు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే (సినిమా నుండి ఎంపీత్రీ కట్ చేశాను) ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది ఎంబెడ్ వీడియోలో 1m 45s దగ్గర పాట మొదలవుతుంది. చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం  : బాలు(???), కోరస్
డైలాగ్స్ : రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్
 
సూరీడు సూదులెట్టి పొడుత్తున్నాడు.. లేద్దూ..
వెంకటరత్నంగారి కోడి కూతేసేసింది.. లేద్దూ..
 
హైలేస్సా హైలేసా.. హైలేస్సా హైలేసా.. హైలేస్సా హైలెసా.. 

జాలరోళ్ళు అప్పుడే గోదాట్లోకి వెళ్ళిపోతున్నారు.. లెమ్మంటుంటే
బంగారమంటి విద్య చేతిలో పెట్టుకుని ఈ బద్దకమేవిటి
కుంభకర్ణుడిలా ఆ నిద్దరేవిటీ...
ఇలా అయితే నువ్ పనికి రావ్ చేతిలో ఉన్న విద్యనుపయోగించాలి..
హ్మ్.. నీలాంటి వాడి దగ్గర పనిచేయడం నా బుద్దితక్కువ


వేటాడందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు
తెల్లారే దాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదు
గింజా గింజా ఏరకుంటే పూట తీరదు

ఓగురువా సోమరిగా ఉంటే ఎలా
బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా
గురకలలో నీ బ్రతుకే చెడును కదా
దుప్పటిలో నీ బ్రతుకే చిక్కినదా

లేవర లేవర.. అబ్బా పోరా..
సుందర సుందర.. తంతానొరేయ్.. 
చాలును నిద్దర..
థూ... ఈ సారి నిద్దర లేపావంటే సంపేత్తానొరేయ్
 
గోదారమ్మో సల్లంగా దారి సూపవే
సల్లని తల్లి నీ పాపల కాపు కాయవే
వయ్యారంగా మా పడవల ఊయలూపవే
హైలెస్సా హుషారుగా బతుకు నడపవే

కోటిపల్లి కూనవరం ఏ రేవైనా
గెడనునెట్టి తెరలు కట్టి సేరేమమ్మా
అద్దరికి ఇద్దరికీ ఈ మజ్జిన
ఏ పొద్దూ బద్దకమే ఉండదమ్మా

ఎయ్యర ఎయ్యర
జోరుగ జోరుగ
హైలెస్స హైలెస్స హైలెస్స

థూ... మీ పడవలూ పాటలూ తగలెయ్యా
పొద్దున్నే నిద్దర చెడగొట్టేసారు కదరా...
 

అల్లీ బిల్లీ అల్లరాటకు
చలాకీగా తుళ్ళిపడే ఈతలాటకు
ఒప్పులకుప్పా చకా చకా చిందులెయ్యవే
కిందా మిందా సూడకుండా మొగ్గలెయ్యరా

ఆటలలో పాటలలో విసుగులేదు
ఆయాసం మాకెపుడూ అడ్డేరాదు
సోంబేరికి ఈ బలమే ఎప్పుడు రాదు
మొద్దులతో సావాసం మాకు వద్దు

చెమ్మా చెక్కా.. సిందులు మానండెహె..
చూడర గొప్పా.. సప్పుడు చేయకండెహె..
వెయ్యర మొగ్గ
థూ.. రేయ్ నా నిద్దర సెడగొట్టొద్దన్నానా

ఎర్రబడే తూరుపు మందార మొగ్గలు
నవ్వులతో ముంగిట ముత్యాల ముగ్గులు
చెట్టూ చేమా పూచే ఈ వెలుగు పువ్వులు
కిలా కిలా తుళ్ళిపడే కాంతి నవ్వులు

చెమటలలో తళుకుమనే చురుకుదనం
కండలలో పొంగిన బంగారు బలం
పాటడిదే దొరికినదే అసలు సుఖం
సోమరులకు తెలియనిదీ తీపి నిజం

తియ్యర తియ్యర
తొందర సెయ్యర
పనిలో...
తియ్యర తియ్యర
తియ్యర తియ్యర


బుధవారం, ఆగస్టు 27, 2014

మనసు పలికే...

ఇళయరాజా, విశ్వనాథ్ గారి కలయిక గురించి చెప్పేదేముంది... నాకు నచ్చిన ఈ పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : స్వాతి ముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

మనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు

మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే

శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ
 మరుల జలకాలాడనీ...
సగము మేను గిరిజనై పగలు రేయీ ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ...
హృదయ మేళనలో మధురలాలనలో

 హృదయ మేళనలో మధురలాలనలో
వెలిగిపోనీ రాగదీపం...
వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

 
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే
  
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
 ఓనమాలు దిద్దనీ...
పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి...
లలితయామినిలో కలల కౌముదిలో 

 లలితయామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ కాలమంతా
కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా  

  
మనసు పలికే... మనసు పలికే
మౌనగీతం... మౌనగీతం
మనసు పలికే మౌనగీతం నేడే
మమతలొలికే... మమతలొలికే
స్వాతిముత్యం... స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయమధువు
తనువు సుమ ధనువు

 

మంగళవారం, ఆగస్టు 26, 2014

నీ నడకల స్టైలదిరే...

సౌతిండియన్ స్టైల్ ఐకాన్ గా అప్పటికే చాలా పాపులర్ అయిన రజనీకాంత్ పాపులారిటీని పదింతలు పెంచేసి తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బిగ్గెస్ట్ మాస్ హిట్ "బాషా". తెలుగు తమిళ్ సినిమాలలో ఒక సరికొత్త ట్రెండ్ కు ఈ సినిమా నాంది పలికింది. అందులో పాటలూ, ప్రతి ఒక్క సీన్ తో సహా అన్నీ పాపులరే... సినిమా వచ్చి ఇరవై ఏళ్ళైనా ఇప్పటికీ మాణిక్యం, మాణిక్ భాషా ల రిఫరెన్స్ అపుడపుడు ఆటోవాలాల దగ్గర వినిపిస్తుంటుంది. ఈ సినిమా నెరేషన్ ని అనుకరిస్తూ తీసిన తీస్తున్న సినిమాలకైతే లెక్కే లేదు. 

ఇందులో పాటలన్నీ కూడా బాగానే హిట్ అయినా వాటిలో ఈ పాట ఒకటి నాకు బాగా నచ్చిన పాట. రజనీ వివిధ గెటప్స్ లో కనిపించి అలరించే ఈపాట చూడడానికి కూడా సరదాగా బాగుంటుంది. మీరూ చూసి విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

అదిరే.. అదిరే..  
నీ నడకల స్టైలదిరే.. అదిరే 
నీ నవ్వుల కైపదిరే అదిరే 
నీ మాటల తీరదిరే అదిరే 
నీ చూపుకు ఎదఅదిరే  
అదిరే.. అదిరే..
ఓ కన్నె ఎదే దోచుకున్న నీ ఫోజు అదిరే 
ఆ పోజు చూసినాక జారుపైట అదిరే 
అదిరే అదిరే
 
శీఘ్రమేవ గుడ్ బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు.. 
నీ అల్లరి వయసే నేనొదలను పిల్లా
నన్నల్లుకు పోకా ఇక తప్పదు పిల్లా
కసి కత్తెరలేసే నీ అత్తరు పైట 
చలి ఒత్తిడి కోరే తొలి వలపుల ఆట
మల్లెల లాహిరి మన్మధ చాకిరి అనువుగ కోరినది
తీయని తిమ్మిరి తేనెల చిమ్మిలి అరుదుగ అడిగినది 
ముద్దు పెట్టారాదా హద్దు దాటరాదా.. 

అదిరే.. అదిరే.. 
హాఆ.. నీ నడకల స్టైలదిరే.. అదిరే 
నీ నవ్వుల కైపదిరే అదిరే 
నీ మాటల తీరదిరే అదిరే 
నీ చూపుకు ఎదఅదిరే  
అదిరే.. అదిరే..

నీ చూపులలోనా కసి తుమ్మెదలాడే 
సెగ రేపిన ఈడే బిగి కౌగిలి కోరే
నీ మోహన దాహం నా మోవిని చేరే
ఆ వలపుల మంత్రం చలిచెమ్మలు కోరే 
పెర పెరలాడే పెదవుల రాగం మధువులు కోరెనమ్మ
వయసుకు వయసే వచ్చిన వేళ మనసిక ఆగదమ్మ
పులకరింత నదిలో జలకమాడుదామా

అదిరే.. అదిరే..
ఓ నీ కులుకు నడకదిరే.. అదిరే
నీ మొలక నడుమదిరే అదిరే 
వరదంటీ వయసదిరే అదిరే
పాలుగారు బుగ్గదిరే.. 
అదిరే.. అదిరే.. 
ఓ జాజిపూల మోజు పంచె అందమంత అదిరే 
ఆగలేక రేగుతున్న నీ పరువం అదిరే 
అదిరే అదిరే అదిరే అదిరే


సోమవారం, ఆగస్టు 25, 2014

వాన మేఘం...

ఈ రోజు శ్రావణ మాసం చివరి రోజు... వాన పాటలకిక శలవు చెప్తూ చివరిగా "డాన్స్ మాస్టర్" సినిమాలోని "వాన మేఘం..." అనే పాటను గుర్తు చేసుకుందామా... ఈ పాట సూతింగ్ మ్యూజిక్ బోలెడంత ఆహ్లాదకరమైన అనుభూతిని మనసొంతం చేస్తే వేటూరి గారి సింపుల్ లిరిక్ అండ్ బాలచందర్ గారి చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం

నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం

నింగి నా ముంగిలై నీటి తోరణాలతో హొయ్
వంగి నా పొంగులే వూగే చుంబనాలతో
కన్ను కన్ను కవ్వింతలో తడిపొడి తుళ్ళింతలో
కసికసి రెట్టింతలో అది ఇది అంటింతలో
సయ్యాటాడే ఒయ్యారాలేమో లేత లేతగా
చేతికందగ జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం

నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా

వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం 


ఆదివారం, ఆగస్టు 24, 2014

తకిట తధిమి..

సాగర సంగమం సినిమాలోని ఈ పాటకి పరిచయ వాక్యాలు రాయడమంటే సూరీడిని దివిటీ తో చూపించడం లాంటిదే. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ గుర్తు చేసుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : సాగరసంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత త పన ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల వయసీ వరసా ॥
తెలుసా మనసా
నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని
ఆశల లలలా లలలా
ఏటిలోని అలల వంటి కంటిలోని
కలలు కదిపి గుండియలను
అందియలుగ చేసి ॥
తడబడు అడుగుల తప్పని తరిగి
డదోం తరిగిడదోం తరిగిడదోం
తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ...
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥

పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే
సుస్వరాల గోపురం ॥
అలరులు కురియగనాడెనదే
అలకల కులుకుల అలమేల్మంగా॥
అన్న అన్నమయ్య మాట
అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు పద కవితలు పాడీ...

తకిట తధిమి
తకిట తధిమి తందానా
హృదయ లయల
జతుల గతుల తిల్లానా ॥
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన॥
శ్రుతిని లయని ఒకటి చేసి ॥


శనివారం, ఆగస్టు 23, 2014

జల్లంత కవ్వింత కావాలిలే..

వర్షాన్ని మణిరత్నం గారు ఉపయోగించుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేరేమో... హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి లోని ఈ పాటంటే నాకు చాలా ఇష్టం... ఇప్పటికీ వింటూంటే సినిమా విడుదలైన రోజులలో టీనేజ్ లో ఎంత పిచ్చిగా ఎంజాయ్ చేశామో గుర్తొస్తూ ఉంటాయ్. బహుశా ఈ పాటని ఇష్టపడని తెలుగు వాళ్ళుండరేమోలెండి.. మీరూ మరోసారి గుర్తుచేసుకుని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు గలగలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లె తేనె రెక్క ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి 
 
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
 
  సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో ఒహో

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
హే.. ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే శుక్రవారం, ఆగస్టు 22, 2014

సిరి కథ...

ఈరోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా "మహానగరంలో మాయగాడు" సినిమాలో లక్ష్మీ దేవి గురించిన ఈ సిరికథ గుర్తు చేసుకుందామా. భయమే మన శత్రువనీ... మిగిలిన సప్తలక్ష్ములను విధివశాత్తు కోల్పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యలక్ష్మిని మాత్రం పోగొట్టుకోకూడదని, ధైర్యం ఉంటే మిగిలిన సప్త లక్ష్ములూ తమంత తామే తిరిగి వస్తారని బోధించే ఈ కథ చాలా బాగుంటుంది. మీరూ చూసీ వినీ గుర్తుంచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మహానగరంలో మాయగాడు (1984) 
సంగీతం : సత్యం 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు, సుశీల

శ్రీ గజ వదనం భవతరణం 
శ్రీ గజ వదనం భవతరణం 
సేవిత దేవగణం శితజన పోషణం
శ్రీ గజ వదనం...
శ్రీ మద్రమారమణ గోవిందో హరి.. 
నేనిప్పుడు చెప్పబోయేది హరికథ కాదు.. ఏవిటయ్యా అంటే సిరి కథ.. 
మానవుడు జీవితంలో ఏమైనా పోగొట్టుకోవచ్చు కానీ.. 
ఏపరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదీ ఒక్కటే ఒక్కటి ఉన్నది.. 
ఏవిటయ్యా అది ?? 
ఏవిటంటే సావధాన చిత్తులై ఆలకించండి... 

అమరావతి పట్టణమేలుచుండె అమరేశుండను రేడూ.. 
అతనెలాంటి వాడయ్యా... 
భూపాలుడు.. అనుపమ సద్గుణ శీలుడూ.. 
భూపాలుడు.. ఆశ్రిత సజ్జన లోలుడూ..
అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు..
అతని యశము దశ దిశలు పాకగా దేవతలదిగని బిక్కురు మనగా.. 
ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే.. 
శనిని పిలిచినారు శనైశ్చరుని పిలిచినారు..
శనిని పిలిచినారు శనైశ్చరుని పిలిచినారు..
ఆ మనుజేశుని మహిమను కనుగొని రమ్మనీ.. నేడే పొమ్మనీ 
ధరణికంపినారు.. శనిని ధరణికంపినారు.. 

అహో భూపతీ వింటిని నీ కీర్తీ..
అవనీశుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహీ..
భవతి భిక్షాం దేహీ..
బ్రాహ్మణోత్తమా అభివందనము 
మీ సత్కారము నా నిత్యధర్మము 
బ్రాహ్మణోత్తమా అభివందనము 

నిలు నిలు తనయా నీకీ తొందర తగదయ్యా.. 
నిలు నిలు తనయా నీకీ తొందర తగదయ్యా.. 
ఎవరమ్మా నీవు నన్నెందులకిటులాపెదవు.. 
ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్నూ.. 
ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్నూ.. 
ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడూ... 
నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడూ.. 
శని ఐనను హరి ఐనను ముని ఐనను దేహి అనుచు ముంగిట నిలవన్..
వెనుకాడి ఆడితప్పుట ఇనకులమున లేదు లేదు ఎరుగవె తల్లీ.. 
ఇదే నీ నిర్ణయమైన కుదరదు నీ ఇంట నేను కొలువుండటన్.. 
ఇది నీ విధి అనుకొందున్.. పృధివీశా.. పోవుచుంటి ప్రీతుండగుమా.. 
పృధివీశా.. పోవుచుంటి ప్రీతుండగుమా.. 
పృధివీశా.. పోవుచుంటీ.. 
అని ధాన్యలక్ష్మి ఇల్లు వీడి వెళ్ళిపోయినదట..

అంతట శని.. ఓ మహరాజా ఆశ్రితభోజా
ఓ మహరాజా ఆశ్రితభోజా.. ధాన్యమును ఒసగిన చాలా.. 
ధనమునీయవలదా.. ఆఆఅ...
పొరపాటాయెను భూసురా.. సరగున తెచ్చెద ధనమూ.. 

ధరణీశా ఆగు ఆగు ధనలక్ష్మిని నేను.. 
ధరణీశా ఆగు ఆగు ధనలక్ష్మిని నేను..
శనికి నన్ను ఇవ్వకుమా.. వినుము నాదు హితము.. 
మాట తప్పలేను నీ మాటను వినలేను.. 
విడలేను దాన గుణము... వినుము నాదు శపధము..

అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయిందట.. 
శని అడిగింది అడగకుండా అడుగుతున్నాడటా మహరాజు అడిగింది అడిగినట్లే ఇచ్చాడటా.. 
ఆవిధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారటా.. తదనంతరమున.. 

రాజా ఇచ్చినంతనే గొప్పనుకోకు ఇచ్చి ఏమి ఫలము.. 
నీవు ఇచ్చి ఏమి ఫలము.. 
ఇన్ని సిరులతో ఒంటరిగా నే ఎటుల వెళ్ళగలను
రాజభటులను వెంట పంపమందురా.. 
భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము.. 
ధీరుడవూ నీవే నా వెంట నడువుము 
చిత్తం తృటిలో వచ్చెదన్.. 

ఓయీ రాజా... అన్ని లక్ష్ములను నిర్లక్ష్యపరిచితివి నీవు.. 
అన్ని లక్ష్ములను నిర్లక్ష్యపరిచితివి నీవు..
నేనుమాత్రమూ నీకు అండగా ఏల ఉండవలయు 
ఎవరు తల్లీ నీవు.. 
ధైర్య లక్ష్మిని నేను 
నమో ధైర్య లక్ష్మీ నమో ధీర లక్ష్మీ నమో వీర లక్ష్మీ నమో..
నీవు నాఅండగా దండగా నున్న మరే లక్ష్మీ లేకున్న 
నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యమ్ముతో
సప్త లక్ష్మీ వియోగమ్ము సైతమ్ము నిర్లక్ష్యమున్ జేసితిన్.. 
రాజ్యమున్ గీజ్యమున్ పోయినన్ గానీ నిను నేను పోనిత్తునా 
పేదరికమునైనా భరియింపగలనుగాని పిరికినై జీవింతునా.. 
కాన నాయింట నిలకడై నీ ఉండగా గీటు గీచితిని ఇది దాటరాదు 
సూర్య చంద్రుల పై ఆన.. చుక్కలఆన.. నీ పదముల ఆన
నా నిత్య సత్య వ్రతమ్ముపై ఆన సకల దేవతల ఆన.. ఆఆఅ
అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె ఝల్లుమని.. 
ఇక తన పని చెల్లదనీ.. అదృశ్యుడైనాడట.. 
శ్రీ మద్రమారమణ గోవిందో హారి.. 

అటుపైన నగరు విడిచి వెళ్ళిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున 
దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట..
ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు
మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభసమయంలో
శ్రీ మద్రమారమణ గోవిందో హారి..
మహా భక్తులారా ఈ సిరికథ మనకి భోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే.. 

భయమే నీ శత్రువు ఓ మనిషీ భయమే నీ మృత్యువు.. 
కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ 
ఉన్నవి అన్నీ కోలుపోయినా ఉండవలసినది గుండె ధైర్యమూ.. 
ధైర్యమే ఐశ్వర్యమూ.. ఓ మనిషీ ధైర్యమే నీ విజయమూ.. 
ఏదీ అందరూ ఒక్కసారి .. ధైర్యే సాహసే లక్ష్మీ.. 


గురువారం, ఆగస్టు 21, 2014

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా..

శేఖర్ కమ్ముల చిత్రీకరించిన మరో అందమైన వానపాట ఇది. వేటూరి గారు పడవలు, బడి సెలవలు, పకోడీలు, ఇంద్రధనసులు వేటినీ వదలకుండా బాల్య జ్ఞాపకాలతో మొదటి చరణం అల్లేశారు. అలాగే రెండవచరణంలో వయసు రేపే తీయని వలపు గిలిగింతలను సున్నితంగా వర్ణించడం ఆ మహాకవికే చెల్లింది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆనంద్ (2004)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయ ఘోషల్

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా...
గాలి వాన లాలి పాడేస్తారా....

పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన
చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వానతో కూడీ... వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డి డ్డి...... తొడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా 

 
కోరి వచ్చిన ఈ వాన.. గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే.. ముద్దు లాటలే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు.. తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్లు... కౌగిలింతలా పెళ్లిల్లు
నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తార బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
ఓ.. కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా..

బుధవారం, ఆగస్టు 20, 2014

సందెపొద్దు మేఘం...

నాయకుడు సినిమాలోని ఒక చక్కని వానపాట ఈరోజు మీకోసం... మణిరత్నం కమల్ ల ఈ సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకటి. ఈ పాట చిత్రీకరణ బస్తీవాళ్ళ ఆటపాటలు నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం: బాలు, సుశీల

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...
హోయ్ పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం

మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం
 

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...ఆ..ఆ..

 

నీవు నడిచే బాటలోనా లేవు బాధలే.. తనక్కుధిన్
నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే.. తనక్కుధిన్
ఒకటంటా ఇక మనమంతా లేదంటా చీకూచింతా 

సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం
వీసమైన లేదులే బేధ భావమే 

నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...
 

 పలికెను రాగం సరికొత్త గానం
నీ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 

 
పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా.. తనక్కుధిన్
ఆదరించే దైవముంది కళ్ళముందరా.. తనక్కుధిన్
పూవులతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించూ
మమకారాన్ని పండించూ అందరికీ అది అందినూ 

 వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ
అంతులేని శోభలే చిందులేసెనూ
తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుతాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... 

పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం 

 
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...


మంగళవారం, ఆగస్టు 19, 2014

ఒకే కావ్యం...

వర్ణ సినిమాలోని నాకు నచ్చిన ఒక మంచి పాట ఇది... చిత్రీకరణ కూడా బాగుంటుంది.. వేరే ప్రపంచం అంటూ చిత్రీకరించిన సీన్స్ కొన్ని అందంగా ఉంటాయి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వర్ణ (2013)
సంగీతం : హారీస్ జయరాజ్
రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం
మన తనువు మారును తరము మారును
స్వరము మార్చదు ప్రేమా
ప్రేమా మరణం..
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
 
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలే
ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం

తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే
తనువు తనువుకి ప్రాణద్వారం ప్రేమే..
ఎదలు రెండూ దూరమైనా పెదవులౌను చేరువే
పెదవిద్వారా ఎదను చేరును ప్రేమే
ముల్లు లాంటి కళ్ళతోటి అంతుచూస్తుంది
పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుందీ

ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలి

ప్రేమ పాట పాతదీ పూట పూట కొత్తది
గాలి లేని చోటైనా మోగేనిదీ.. 
ప్రేమ అంటే విషములే విషములోని విశేషమే 
ఇదేజన్మలో మరోజన్మకు మార్గమే 
బీడు భూమిలొ మెట్ట భూమిలొ మొగ్గ ప్రేమేలే 
మండుటెండలొ ఎండమావిలొ నీడ ప్రేమేలే

భళాచాంగు భళాచాంగు భళాచాంగు భళా
మా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళా
ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళా
నిన్ను స్మరిస్తేనే నాలో స్వర్ణకళా.. 
తరంగంలా మృదంగంలా
రావే రావే విరంగంలా


సోమవారం, ఆగస్టు 18, 2014

తాళాలతో వాన...

ఈ రోజు పాట "తెనాలి" సినిమా కోసం ఎ.ఆర్. రెహ్మాన్ స్వర సారధ్యంలో వేటూరి గారి రచన. పూర్తి హాస్య రస ప్రధానమైన ఈ సినిమా మూడ్ కు తగినట్లుగానే పాట చిత్రీకరణ కూడా హాస్యంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : తెనాలి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ, సలోని, పార్థసారధి, శరణ్య

తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
 
తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
సమరము తీర్చా చంద్రయ్య వచ్చాడ
చిన్న చిన్న తగవు సమసి పోయిందా..
ఆ పొరుపు మరచి కలిసి పోవచ్చు.. 
నిన్న గొడవనంతా గాలెత్తుకెళ్ళిందోచ్..
అయ్యోడా.. ఇది ఇగరని చినుకుల చిటపట
అయ్యోడా.. ఇది కలివిడి వయసుల వరమట 
అయ్యోడా...

తద్దిన్నా తకుదికు తద్దిన్నా 
తకుదికు తద్దిన్నా తాదాననా..
తద్దిన్నా తకుదికు తద్దిన్నా 
తకుదికు తద్దిన్నా ననా..
ఓఓఓఓఓఓఓఓఓఓఓ... 

కోనేటీ వెన్నెలలా కుదురైనదీ కుటుంబం 
ఈ రాతి పిడుగుతో చెదిరెనమ్మా..
కదిలేటి వాగులలో కదిలేటి వెన్నెలలే 
తొలిప్రేమ దీపాలు తెలుసుకోమ్మా.. 
శృంగారా పాల శిల్పాల పక్క రాతిబండ ఏలా..
నా ప్రేమా ఉలి పాటుకే బండ శిల్పమౌ సుమా.. 
పిచ్చి కుదిరింది చింత ముగిసింది 
వడగళ్ల గీతాలై వాన కురిసింది 
పిచ్చి కుదిరింది చింత ముగిసింది 
వడగళ్ల గీతాలై వాన కురిసింది
సొంతమై తాను దక్కంగా 
వాడి నీడ కూడా ఆగదమ్మ

అయ్యోడా.. ఇది ఇగరని చినుకుల చిటపట
అయ్యోడా.. ఇది కలివిడి వయసుల వరమట 
అయ్యోడా...
తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా

తందరతందోర తందరతందోం..
హయ్యోడా హయ్య హయ్యోడ హైహై..
తందరతందోర తందరతందోం..
హయ్యోడా హయ్య హయ్యోడ హైహై.. 
తొదరి తోంత తదరినననన తదరి తోంతోమ్ దిరన
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. 
ఉమాయ్ కొమచేయ్..రభచేయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. ఉమాయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. 
ఉమాయ్ కొమచేయ్..రభచేయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. ఉమాయ్..

గోదారి గట్టంటా రాదారి గరిక మొక్క 
నోచేటి నోము అలల స్నేహమేగా.. 
పంచదార పనస నాటి వెలగపండు కోరినట్టు 
ఎన్నాళ్ళు ఆశపడ్డా లాభమేదీ.. 
దిరిశిన పూవులు మరువపు తోటకి 
కదలి పోవునా... 
గోరింకే దగ్గరయ్యిందీ వన్నె కోయిలమ్మా.. 
ఇరువురు ఇటు నడచిన వేళ 
ఒకే నీడ పడ్డదెందువల్ల 
మంచిమనసున్న ఇంతమంది మధ్య 
నేనూ ఒక మనిషయ్యా.. 

తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
సంధి చెయ్య గోరీ తెనాలి వచ్చాడే
చిన్న చిన్న తగవే సమసి పోయింది..
తుళ్ళి తూనీగలా ఆడి తరిగెను వయసు.. 
నవ్వు సోలించి లాలించి గాయాలు పోగొట్టూ..
అయ్యోడ ఇది కలకాదండి నిజమేనండోయ్
అయ్యోడా ఇక ఆనందరాగాల కోలాటమాడండోయ్..
అయ్యోడా...ఆదివారం, ఆగస్టు 17, 2014

విన్నావ యశోదమ్మ...

జన్మాష్టమి సందర్బంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... ఈరోజు బోలెడన్ని పిండివంటలు చేసేసి సాయంత్రం చిన్నికృష్ణుడి పాదాలు వేసి మరీ ఆ కన్నయ్యని ఆహ్వానించేస్తారు కదా గృహిణులంతా. ఈ సంధర్బంగా ఆ వెన్నదొంగ అల్లరిని తెలిపే ఈ చక్కని నృత్యరూపకాన్ని తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మాయాబజార్ (1957) 
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
గానం : పి.లీల, సుశీల, స్వర్ణలత(సీనియర్)
 
గోపికలు : విన్నావ యశోదమ్మా..విన్నావ యశోదమ్మా
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మ

యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా


గోపికలు : ఆ..మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని
పాలన్నీ తాగేశనమ్మా
పెరుగంతా జుర్రేశనమ్మా
వెన్నంతా మెక్కేశనమ్మా

కృష్ణుడు : ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?
కలదమ్మా..ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా..విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ..

 
గోపికలు : ఆ..ఎలా బూకరిస్తున్నాడో
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా
భామలందరొక యుక్తిని పన్ని 
గుమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ

ఆహా...ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛెంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడుగవమ్మా

కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే 

యశోద : మరి ఎక్కడున్నావు?
 

కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
కాళింది మడుగున విషమును కలిపె
కాళియు తలపై తాండవమాడి
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచానే..గోవుల చల్లగ కాచానే..
గోవుల చల్లగ కాచానే
 
ద్రౌపది : హే కృష్ణా..హే కృష్ణా
ముకుందా మొరవినవా
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా..కృష్ణా కృష్ణా కృష్ణా

శనివారం, ఆగస్టు 16, 2014

టిప్పులు టప్పులు...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా లోని ఒక అందమైన వాన పాట ఇది నాకు చాలా ఇష్టం. రాథాకృష్ణన్ తన శైలికి భిన్నంగా కాస్త వేగంగా ఉన్న ట్యూన్ ఇచ్చినా దానికి వేటూరి గారు రాసిన సాహిత్యం చాలా చక్కగా ఉంటుంది. గోదారి మీద లాంచీల్లో వర్షంలో చిత్రీకరించిన తీరు కూడా నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.యమ్.రాథాకృష్ణన్
సాహిత్యం :  వేటూరి
గానం : శ్రేయ ఘోషల్

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలూ
జిల్లుజిల్లున జల్లు ముద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులూ
కళ్ళలోన కన్నుగీటగా
కానలా మేడలా చినుకుమన్న జాడలా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు

 
గాలీ వాన తోడై వచ్చి ఉయ్యాలూపగా
వానా రేవు పిన్నా పెద్ద సయ్యటాడగా
గూటిపడవలో గువ్వ జంటలూ
కూత పెట్టు లేత వలపులూ
లంగరేసినా అంది చావని
రంగసాని చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలూ


ఏరూ నీరు ఓ దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోన నీళ్ళాడాలిలే
ఘల్లుఘల్లున సాని కిన్నెరా
గౌతమింట గజ్జెకట్టెలే
ఎంగిలంటని గంగవంటిది
పండు ముసలి శబరి తల్లిలే
ఆడరా పాడరా తోకలేని వానరా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు
 


జిల్లుజిల్లున జల్లు ముద్దులు
చేసిపోయె ముద్దముద్దగా
మబ్బుమబ్బున మెరుపుతీగ పొద్దులు
కళ్ళలోన కన్నుగీటగా 

కానలా మేడలా చినుకుమన్న జాడలా

టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
గాలివాన హొరుజల్లులూ
ఏటిలో చేపలు చేతిలో పాపలు
ఛెంగుమన్న నీటి జింకలు


శుక్రవారం, ఆగస్టు 15, 2014

చేయెత్తి జైకొట్టు తెలుగోడా...

ఈరోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా ముందుగా ఈ లక్ష్మీ శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ప్రతిపదార్ధం కొరకు ఇక్కడ ఈ భక్తి బ్లాగ్ లో చూడవచ్చు. ఎంబెడ్ చేసినది సీతారామ కళ్యాణం సినిమాకోసం ఎమ్మెస్ రామారావు గారు గానం చేసిన ఈ శ్లోకం వీడియో. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సీతారామ కళ్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహా రావు 
గానం : ఎమ్మెస్ రామారావు 
 
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ 


తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.


~*~*~*~*~*~*~*~*~*~

ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా ఈ సంధర్బంగా తెలుగు వారందరిలోనూ స్ఫూర్తి నింపి తగవులను మాని ఒక్కటిగా తెలుగు జాతి అభ్యుదయానికి పాటుపడమంటూ ప్రోత్సహించే ఈ గీతాన్ని తలచుకుందామా. అలాగే ఈ సంధర్బంగా స్వాతంత్రం వచ్చిన అపురూప క్షణాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : పల్లెటూరు (1952)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : వేములపల్లి శ్రీకృష్ణ 
గానం : ఘంటసాల 

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!

వీర రక్తపుధార వారఓసిన సీమ
వీర రక్తపుధార వారఓసిన సీమ 

పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా 

బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్!

నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల
నాయకీ నాగమ్మ, మల్లమాంబా, మొల్ల 

మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే

 వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!

కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ

 తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు
తుంగభద్రా తల్లి పోంగిపొరలిన చాలు 

ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువలేదోయీ!

ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!

పెనుగాలి వీచింది అణగారి పోయింది
పెనుగాలి వీచింది అణగారి పోయింది

 నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది 

చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా మొనగాడా!

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!"మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు అల్లూ అర్జున్ మరియూ సుకుమార్. వారిరువురినీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని మీరూ చూడండి. చూసి ఆలోచించండి...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.