సోమవారం, ఆగస్టు 18, 2014

తాళాలతో వాన...

ఈ రోజు పాట "తెనాలి" సినిమా కోసం ఎ.ఆర్. రెహ్మాన్ స్వర సారధ్యంలో వేటూరి గారి రచన. పూర్తి హాస్య రస ప్రధానమైన ఈ సినిమా మూడ్ కు తగినట్లుగానే పాట చిత్రీకరణ కూడా హాస్యంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : తెనాలి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ, సలోని, పార్థసారధి, శరణ్య

తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
 
తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
సమరము తీర్చా చంద్రయ్య వచ్చాడ
చిన్న చిన్న తగవు సమసి పోయిందా..
ఆ పొరుపు మరచి కలిసి పోవచ్చు.. 
నిన్న గొడవనంతా గాలెత్తుకెళ్ళిందోచ్..
అయ్యోడా.. ఇది ఇగరని చినుకుల చిటపట
అయ్యోడా.. ఇది కలివిడి వయసుల వరమట 
అయ్యోడా...

తద్దిన్నా తకుదికు తద్దిన్నా 
తకుదికు తద్దిన్నా తాదాననా..
తద్దిన్నా తకుదికు తద్దిన్నా 
తకుదికు తద్దిన్నా ననా..
ఓఓఓఓఓఓఓఓఓఓఓ... 

కోనేటీ వెన్నెలలా కుదురైనదీ కుటుంబం 
ఈ రాతి పిడుగుతో చెదిరెనమ్మా..
కదిలేటి వాగులలో కదిలేటి వెన్నెలలే 
తొలిప్రేమ దీపాలు తెలుసుకోమ్మా.. 
శృంగారా పాల శిల్పాల పక్క రాతిబండ ఏలా..
నా ప్రేమా ఉలి పాటుకే బండ శిల్పమౌ సుమా.. 
పిచ్చి కుదిరింది చింత ముగిసింది 
వడగళ్ల గీతాలై వాన కురిసింది 
పిచ్చి కుదిరింది చింత ముగిసింది 
వడగళ్ల గీతాలై వాన కురిసింది
సొంతమై తాను దక్కంగా 
వాడి నీడ కూడా ఆగదమ్మ

అయ్యోడా.. ఇది ఇగరని చినుకుల చిటపట
అయ్యోడా.. ఇది కలివిడి వయసుల వరమట 
అయ్యోడా...
తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా

తందరతందోర తందరతందోం..
హయ్యోడా హయ్య హయ్యోడ హైహై..
తందరతందోర తందరతందోం..
హయ్యోడా హయ్య హయ్యోడ హైహై.. 
తొదరి తోంత తదరినననన తదరి తోంతోమ్ దిరన
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. 
ఉమాయ్ కొమచేయ్..రభచేయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. ఉమాయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. 
ఉమాయ్ కొమచేయ్..రభచేయ్..
ఉమాని మసాకి నమ్మనిచేయ్.. ఉమాయ్..

గోదారి గట్టంటా రాదారి గరిక మొక్క 
నోచేటి నోము అలల స్నేహమేగా.. 
పంచదార పనస నాటి వెలగపండు కోరినట్టు 
ఎన్నాళ్ళు ఆశపడ్డా లాభమేదీ.. 
దిరిశిన పూవులు మరువపు తోటకి 
కదలి పోవునా... 
గోరింకే దగ్గరయ్యిందీ వన్నె కోయిలమ్మా.. 
ఇరువురు ఇటు నడచిన వేళ 
ఒకే నీడ పడ్డదెందువల్ల 
మంచిమనసున్న ఇంతమంది మధ్య 
నేనూ ఒక మనిషయ్యా.. 

తాళాలతో వాన తైతక్కలాడిందా
డివ్విట్టమంటూ పైకెక్కి చూసిందా
సంధి చెయ్య గోరీ తెనాలి వచ్చాడే
చిన్న చిన్న తగవే సమసి పోయింది..
తుళ్ళి తూనీగలా ఆడి తరిగెను వయసు.. 
నవ్వు సోలించి లాలించి గాయాలు పోగొట్టూ..
అయ్యోడ ఇది కలకాదండి నిజమేనండోయ్
అయ్యోడా ఇక ఆనందరాగాల కోలాటమాడండోయ్..
అయ్యోడా...0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.