వర్షాన్ని వివిధ సంధర్బాలలో అత్యధ్బుతంగా ఉపయోగించుకున్న దర్శకులు మణిరత్నం... తన దర్శకత్వంలో వచ్చిన మౌనరాగం సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లో ఒకటి అందులోని ఈ వాన పాట నాకు చాలా ఇష్టం. అప్పట్లో రేవతి కూడా నాకు చాలా నచ్చేది. తను వెరీ డీసెంట్ అండ్ ఎఫిషియంట్ యాక్ట్రెస్ ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. ఈ చక్కని పాట మీరూ వినీ చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మౌనరాగం (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
చినుకే పూల గాలులే.. పలికె పసిడి గాథలే..
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
చినుకే పూల గాలులే.. పలికె పసిడి గాథలే..
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
నాలో ఊగేను సోయగం
రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే
ఈ పన్నీటిలో గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా వలపించే జ్ఞాపకం
పులకరించి పలకరించెనే...
నాలో ఊగేను సోయగం
రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే
ఈ పన్నీటిలో గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా వలపించే జ్ఞాపకం
పులకరించి పలకరించెనే...
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
కలలో ఈ నాటి జీవితం
ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం
మధుర సంగీతం పాడుదాం
లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్ సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా...
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
చినుకే పూల గాలులే.. పలికె పసిడి గాథలే..
పువ్వులపై అందాలే వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను
ఓహో మేఘమొచ్చెను.. ఏదో లాలి పాడెను..
2 comments:
నాకిష్టమైన చాలా చాలా సినిమా అండి.పాటలూ,రేవతి కూడా అంతే ఇష్టం ..Radhika (nani)
అవును రాధిక గారు.. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది నాక్కూడా బాగా ఇష్టం. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.