సిరివెన్నెల సినిమాలోని ఈ అందమైన చిన్ని పాట నాకు బాగా ఇష్టం.. ముఖ్యంగా ఇందులో వినిపించే వేణుగానం బాగుంటుంది. మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సిరివెన్నెల (1987)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాలా ఆలాపన
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాలా ఆలాపన
మేఘాల రాగాలా ఆలాపన
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.