లీల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లీల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జనవరి 12, 2021

జయహే కృష్ణావతారా...

శ్రీ కృష్ణావతారం సినిమాలో శ్రీ కృష్ణుని కథను క్లుప్తంగా వివరించే ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఘంటసాల, లీల, సరోజిని, స్వర్ణలత 
 
జయహే కృష్ణావతారా
నంద యశోదా పుణ్యావతారా
జయహే కృష్ణావతారా
పాపుల నణచీ సాధుల బ్రోవగ
వ్రేపల్లె వెలసిన గోపకిశోరా
జయహే కృష్ణావతారా
 
ఎన్నోజన్మల పున్నెము పండీ 
నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ
కన్నతల్లి నీ కడుపెరుగదు నా
చన్నుగుడువ కనుమూసెదు రారా
 
విషపూతన ప్రాణాపహారీ
శకటాసుర సంహారీ శౌరీ 
జయహే కృష్ణావతారా
 
కాపురమ్ము సేయలేమమ్మా వ్రేపల్లెలోన
ఓ యశోదా ఈ పాపమెందూ చూడలేదమ్మా
పాలు వెన్నమనగనీడు
పడుచునొంటిగ చనగనీడు
కలిమి ఉంటే కట్తి కుడుతురు 
కన్న సుతునిటు విడుతురా
కాపురమ్ము సేయలేమమ్మా
 
జయహే కృష్ణావతారా
నందకుమారా నవనీత చోరా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కాళింగ మడుగున, కాళీయ పడగల
కాలూని ధిమి ధిమి నాట్యము చేసి
సర్పాధీశుని దర్పము నణచిన
తాండవ నాట్యవినోదా
 
జయహే కృష్ణావతారా
కాళీయ మణిగణ రంజిత చరణా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
తనువులపై అభిమానము వీడిన గాని
తరణులార ననుజేర తరము గాదులే 
సిగ్గువదలి యిరుచేతుల జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా
 
జయహే కృష్ణావతారా
గొపకుమారీ వస్త్రాపహారా 
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
బాలుడితడనీ శైలము 
చాల బరువనీ
మీ భయము వదలుకొండీ
నా అండను చేరగరండీ
ఈ కేలల్లాడదు నమ్మండీ
 
గోవర్థన గిరిధారీ
సురనాయక గర్వాపహారీ
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కృష్ణా...ఆఆఆ...ఆఆఆ... 
రాధా మానసచోరా
నీ మధు మురళీ గానమునా 
నా మనమూ బృందావనమూ
నిలువున పూచీ నీ పద పూజకు
పిలిచేనోయీ రావోయీ
సేవలు చేకొన రావోయీ 
రాధా మానస చోరా కృష్ణా..ఆఆ.. 
 


బుధవారం, జనవరి 06, 2021

అమ్మా మన్ను తినంగ...

శ్రీ కృష్ణలీలలు సినిమాలో యశోదమ్మకు కన్నయ్య తన నోటిలో విశ్వాన్ని చూపించే ఒక చక్కని సన్నివేశాన్ని పద్యాలతో ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : పోతన 
గానం : సుశీల, లీల   

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్
 

శుక్రవారం, నవంబర్ 20, 2020

ఇచ్చకాలు నాకు నీకు...

తెనాలి రామకృష్ణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్, రామ్మూర్తి  
సాహిత్యం : అన్నమయ్య కీర్తన  
గానం : లీల 

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి

జట్టి గొంటివిదె నన్ను జాలదా వోరి యీ-
చిట్టంట్ల నీవేఁచక చిత్తగించరా
ఎట్టైనా నేనీకింత యెదురా వోరి నీ-
పట్టిన చలమే చెల్లె బాపురా వోరి

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి

వేసాల వేంకటగిరివిభుఁడా నేఁడోరి నీ-
సేసిన మన్ననలిట్టె చిత్తగించరా
వాసన కస్తూరిమేని వన్నెకాఁడ నీ-
యాసల మేకులే దక్కెనద్దిరా వోరి

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి
 

సోమవారం, నవంబర్ 16, 2020

రసిక రాజ మణి రాజిత...

మహాకవి కాళిదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మహాకవి కాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : పింగళి  
గానం : పి.లీల, రత్నం

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
గాన నాట్యముల ఘన కౌశలమున 
నన్ను మించెదవె సోదరీ

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
ప్రియ సోదరీ 
రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ

అమరగానమున హాయి హాయిగా
అమరగానమున హాయి హాయిగా
భోజకీర్తి కాంభోజి రాగమున
భోజకీర్తి కాంభోజి రాగమున
అమరసంగతులు వేయవే

నెమిలి నీడలో నిలచిన నాగు 
సమమున సాములు చేయవే

రాగ తాళముల సరళిని రవళిని 
జగడము సాగని చందమే
రాగ తాళముల సరళిని రవళిని 
జగడము సాగని చందమే
మన జగడము సాగని చందమే

రవి గాననిచో కవి గాంచునెకదా 
రవి గాననిచో కవి గాంచునెకదా 
కవి యేమనునో విందమే
మన కవి యేమనునో విందమే

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
ప్రియ సోదరీ 
రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ



బుధవారం, జులై 01, 2020

కళ్యాణ వైభవమీనాడే...

ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో అలనాటి తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని చూపించే ఈ వీడియోలో ఆ వెంకన్న దర్శనం చేసుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.   


ఇక ఆ శ్రీమణ్ణారాయణుని తలచుకుంటూ శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : జిక్కి, పి.లీల 

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

చూతమురారే సుదతులందరూ
చూతమురారే సుదతులందరూ
చేతమురారే సింగారాలు 
కళ్యాణ వైభవమీనాడే
 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
రంగురంగులా రత్నాలు కలిపీ
ఆఆ...ఆఆఅ...ఆఆఅ....ఆ... 
రంగురంగులా రత్నాలు కలిపి
ముత్యాల ముగ్గులు వేయండి 

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

అతివ కోరిన వరుడు 
అతిలోక సుందరుడోయమ్మా
అతగానికన్నింట జతయౌను 
మా యమ్మా ఆహూ.. ఆహూ..
అల్లారు ముద్దుగ 
పెరిగింది మాపిల్ల ఓయమ్మా
పువ్వుల్లో పుట్టాడు 
మా పిల్లవాడమ్మా ఆహూ.. ఆహూ.. 
 
చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం
చెలి గుణమే బంగారం
మా చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం 
చెలి గుణమే బంగారం

నవలామణికి నగవుల గనికి 
మనసే లావణ్యం లే వయసే వయ్యారం 
చక్కని చెక్కిలి చుక్కెందులకే.. ఎందుకే
చందమామలో నలుపున్నందుకే.. ఆహా
చిన్నదానికి ఆ సిగ్గెందులకే 
అవును ఎందుకే 
మనసులోన మరులున్నందులకే

చల్లనైన తల్లివి శంకరుని రాణివి
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరి 
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
చల్లనైన తల్లివీ 

పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
ప్రణమిల్లెను బ్రతుకెల్లను పచ్చనైన పంటగా
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరీ
  

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

కలవరమాయే మదిలో...

పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: పాతాళభైరవి(1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే 
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే 
మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే

కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే

కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే 
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో


శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020

ఎంత ఘాటు ప్రేమయో...

ప్రేమికుల రోజు సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాతాళ భైరవి చిత్రంలోని ఒ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాతాళ భైరవి (1951)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, లీల

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
యెంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పి జెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో..


 

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2020

అందమె ఆనందం...

బ్రతుకు తెరువు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో  ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బ్రతుకు తెరువు (1953)
సంగీతం : ఘంటసాల  
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఘంటసాల   

అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

పడిలేచే కడలి తరంగం
ఓ ఓ ఓ ఓ
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో... ఓ ఓ ఓ ఓ
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

ఓ... ఓ... ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓ... ఓ... ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ
ఓఒ ఓఒ ఓఒ ఒఒఓ


ఇదే పాటను లీల గారు పాడారు. ఆ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


గానం : పి.లీల

లా లాలలా, లా లాలలా,
లా లాలలా, లలా లాలలా
లలల లాలలా, లలల లాలలా

అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి తీయని రాగం
ఒడిలో చెలి తీయని రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

చల్లని సాగర తీరం
మది జిల్లను మలయ సమీరం
చల్లని సాగర తీరం
మది జిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగయోగం
జీవితమే అనురాగయోగం

అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం
అందమే ఆనందం

లా లాలలా, లా లాలలా,
లా లాలలా, లలా లాలలా,
లలా లాలలా 

గురువారం, ఫిబ్రవరి 06, 2020

ఈనాటి ఈ హాయి...

జయసింహ చిత్రంలోని ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జయసింహా (1955)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, పి.లీల

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..

నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ కోసమే ఈ అడియాశలన్ని
నా ధ్యాస నా ఆశ నీవే సఖా

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి.. 

 
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
మనియేములే ఇక విరితావిలీల
మన ప్రేమ కెదురేది లేదే సఖి..

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..

ఊగేములే తుల తూగేములే 
 ఇక తొలి ప్రేమ భోగాలా..
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
మురిపాలతేలే మన జీవితాలు
మురిపాలతేలే మన జీవితాలు 

 దరహాస లీలావిలాసాలులే..

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..
ఈనాటి ఈ హాయి..


సోమవారం, సెప్టెంబర్ 09, 2019

నీకోసమె నే జీవించునది...

మాయాబజార్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఘంటసాల, P.లీల

నీకోసమె..నే జీవించునది
ఈ విరహములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది

వెన్నెల కూడా..చీకటియైనా
మనసున వెలుగే..లేక పోయినా
నీకోసమె..నే జీవించునది

విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా

నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో..నా మనస్సులో
నీరూపమె..నే ధ్యానించునది

హృదయము నీతో వెడలిపోయినా..
మదిలో ఆశలు మాసిపోయినా..ఆఆ
మన ప్రేమలనే మరి మరి తలచి..
ప్రాణము నిలుపుకొనీ..ఈఈఈఇ
నీకోసమె..నే జీవించునది

మెలకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా
ఇక నా దానవెగా..ఆ ఆ ఆ

నీ రూపమెనే ధ్యానించునది
ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది 

 

శుక్రవారం, ఆగస్టు 30, 2019

ఆది లక్ష్మి వంటి...

జగదేక వీరుని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : సుశీల, లీల, సరోజిని, రాజరత్నం

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

కలుగునే మీ వంటి సాధ్వి అత్తగమాకు
తొలి మేము చేసిన పుణ్యమున గాక
మందారమాలతీ పారిజాతాలతో
అందముగ ముడివేసి అలరజేసేము

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

మనసు చల్లన కాగ మంచి గంధము పూసి
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము
పారాణి వెలయించి పాదపూజను చేసి
కోరికలు తీరునని పొంగి పోయేమూ

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా 


శుక్రవారం, ఆగస్టు 09, 2019

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులకు శుభాకాంక్షలు తెలుపుతూ వరలక్ష్మీవ్రతం చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వరలక్ష్మీ వ్రతం (1971)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : జానకి, లీల, పి.బి.శ్రీనివాస్ బృందం

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
చరణాలే శరణంటినమ్మా…
పతిదేవు బాసితి వెతలంది రోసితి
నుతియింతు పతినీయవమ్మా
వరమహాలక్ష్మీ వరమీయవమ్మా


మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

పాలకడలిన పుట్టి శ్రీహరిని చేపట్టి
వైకుంఠలోకాన లక్ష్మివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
సత్వగుణమూర్తివే ఆ… సంపత్స్వరూపివే ఆ…
సత్వగుణమూర్తివే… సంపత్స్వరూపివే…
సర్వసిద్ధివి నీవే సుమ్మా
 
నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా


వాగీశు రాణివై వరవీణపాణివై
బ్రహ్మలోకమ్మున వాణివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

కల్యాణదాయిని కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు తల్లివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
గిరిరాజ తనయవై పరమేశు తరుణివై
కైలాసలోకాన గౌరివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

శక్తిస్వరూపిణి మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
సుఖసౌఖ్య సౌభాగ్యదాయివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…


ఆదివారం, ఏప్రిల్ 14, 2019

శ్రీ రామ పరంధామా...

మిత్రులందరకూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ లవకుశ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెద్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లవకుశ (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : పి.లీల, సుశీల

జయ జయ రాం
జయ జయ రాం

శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా
శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా
రఘు రామ రామ, రణరంగ భీమ
జగదేక సార్వభౌమా

శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా

పూజాన్వయాభిసోమా
సుగుణాభి రామ శుభ నామా
పూజాన్వయాభిసోమా
సుగుణాభి రామ శుభ నామా
కారుణ్యధామ దశకంఠవిరామ
రాఘవ రాజా లలామా

శ్రీ రామ పరంధామా...
జయ రామ పరంధామా...

సాకేత పురాధిప రామా
సీతామనోహరా శ్రీరామా
సాకేత పురాధిప రామా
సీతామనోహరా శ్రీరామా
అరవిందలోచనా సుందర సురుచిర
ఇందీవర శ్యామా... అ.. అ.. ఆ..

శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా...
రఘు రామ రామ, రణరంగ భీమ
జగదేక సార్వభౌమా
శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా

జయ జయ రాం జయ రఘురాం
జయ జయ రాం జయ రఘురాం
జయ జయ రాం...


బుధవారం, ఫిబ్రవరి 20, 2019

ఊరేది పేరేది ఓ చందమామ...

రాజమకుటం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట గురించి రాగాల గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజమకుటం (1960)
సంగీతం : మాస్టర్ వేణు(ఆర్కెస్ట్రేషన్)
బాలాంత్రపు రజనీకాంతరావు (బాణి కూర్పు)
సాహిత్యం : నాగరాజు.
గానం : ఘంటసాల, లీల.

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓ...ఓ..
ఊరేది పేరేది ఓ చందమామ
ఊరేది పేరేది ఓ చందమామ
నిను చూచి నీలి కలువ పులకింపనేలా
ఊరేది పేరేది ఓ చందమామ


ఓ..ఓ..జాబిల్లి నీలీ కలువా విడరాని జంట
ఊరేల పేరేల ఓ కలువ బాల
ఊగెటి తూగెటి ఓ కలువ బాల

ఆ..ఆ..ఆ..
విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ..
కురిసే తేనేల కలువనురా
తరిపి వెన్నెలల దొర రారా ఆ..ఆ..ఆ..
మరుగెలనురా నెలరాజ
తెర తీయర చుక్కల రేడా
రావోయి రావోయి ఓ చందమామ


పరువములొలికే విరిబోణీ
పరువములొలికే విరిబోణీ
స్వప్నసరసిలో సుమరాణీ ఆ..ఆ..
కొలనంతా వలపున తూగే
అలలై పులకింతలు రేగే
నీవాడ నేగాన ఓ కలువ బాలా..ఆఆ..

తరుణ మధుర మొహనా హిమకర
గరళ యవ్వనాంబురాశి కనర
సురుచిర మదనా నివాళి ఇదిగో
సురుచిర మదనా నివాళి ఇదిగో
వలచిన నా హృదయమె గైకొన రారా


నీదాననే గానా ఓ కలువ రేడా
నీవాడనే గానా ఓ కలువ బాల
ఊహూ..హూ..హూ..హూ... 

 

బుధవారం, జనవరి 09, 2019

నల్లనివాడే చల్లనివాడే...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిసందడి (1959)
సంగీతం : ఘంటసాల   
సాహిత్యం : సముద్రాల జూ.
గానం : పి.లీల, కె.రాణి   

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే

గోవర్థనగిరి గోటను నిలిపీ
గోవుల కాచినవాడే
కాళియనాగును కాలనురాచీ
కాచిన మగసిరివాడే

జలకములాడే గోపీజనులా
వలువలు దోచినవాడే
ఒంటరి పడుచుల పైటలులాగే
తులిపే తుంటరివాడే

బృందావని నీ ఆనందముతో
మైమరపించిన గోవిందుడే
మైమరపించిన గోవిందుడే

చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే

మోహన మురళీ గానముతో
హాయిని గొలిపే వాడే
అందెల చిందుల సందడితో
మది తొందర పరిచే వాడే
చిన్నగ చేరీ పాలూ పెరుగూ
వెన్నలు దోచేవాడే
వన్నెలు చేసీ కన్నెల వలపూ
మిన్నగ దోచేవాడే

మాయా పూతన మాయా కంసుని
హతమార్చిన మొనగాడే
మధురానగరికి మాతామహునీ
రాజును చేసినవాడే
అందరివాడే సుందరుడే
మన నందకిశోరుడు గోవిందుడే
మన నందకిశోరుడు గోవిందుడే

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

ఓఓఓఓఓ...హో.హో...

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

 

శనివారం, డిసెంబర్ 22, 2018

గోపాల జాగేలరా...

భలే అమ్మాయిలు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే అమ్మాయిలు (1957)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం
గానం : ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల
 
గోపాల జాగేలరా 
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా 
నన్ను లాలించి పాలింప రావేలరా
బాలగోపాల జాగేలరా 
దరిజేర చలమేలరా...ఆ...
దరిజేర చలమేలరా 
నన్ను దయజూడ విధియేమిరా 
దరిజేర చలమేలరా 
నన్ను దయజూడ విధియేమిరా
మొర వినవేల కనవేల 
మురళీధర కరుణాకర గిరిధర 

గోపాల జాగేలరా

కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి
కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ
అనుపమ సంగీతమొలికించు సరళి 
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా 
కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ...
చనువున నేనెంతో బ్రతిమాలినా
కనికరించి పలుకరించవేలర
మురళీధర కరుణాకర గిరిధర 

గోపాల జాగేలరా

సరిగపద గోపాల జాగేలరా
సదపగరి సరిగపద గోపాల జాగేలరా
పగరిసదా సరిగపద గోపాల జాగేలరా
దాసరి పాదస పా సరిగపద గోపాల
గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద గోపాల
సాస దదసాస గపదసాస 
రిగపదసాస సరిగపద గోపాల జాగేలరా
 
రీగ రిగ రీరీ... ఆ...
రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ
పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా
గమపదని గోపాల జాగేలరా
 
నిస్సనినిసా...ఆ...
నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని
దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద
పమాపదని గోపాల జాగేలరా 

గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద
సనిదపపా దసరిగా... ఆ...
రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస
సానీదాప దసరిగరీ...ఈ...
రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి
పదమగారి సనిద పదగరీస
నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ
గరిసరి గమ పద సరిగ గోపాల  
మగపదస మాగా మగగరిస దాసా
దరిసనిదపాదా సనిదపద జాగేలరా

రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని
రిసని పమ రిరిమమ
నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి
మారీ రిసని రీసా సని పసారీ మపని గోపాల జాగేలరా

గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస
పదరిసరి దసదప పాదా
సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస
ససరిసరిససద పాపదగరీ...
రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా
దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా
గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా...
గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా
గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస
రిగరిగ సరిస
దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద
గోపాల జాగేలరా...


ఆదివారం, సెప్టెంబర్ 16, 2018

జాలీ బొంబైలే మామా...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళి సందడి (1959)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : ఘంటసాల, లీల/జిక్కి

ఓఓఓఓఓఓఓ... ఓయ్.. మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా

జాలీ బొంబైలే మామా ఓ మామా

ఓఓఓఓఓఓఓఓఓ..ఓఓఓహోహోయ్...
జాలీ బొంబైలే మామా ఓ మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా

జాలీ బొంబైలే మామా ఓ మామా

ఈదంట ఎళుతుంటే ఈలేసే మామ
ఈదంట ఎళుతుంటే ఈలేసే మామ
సెరువూ కెళుతుంటేను సెంగూలాగే మామ
సెరువూ కెళుతుంటేను సెంగూలాగే మామ
ఎక్కడున్నా ఎన్నడైన నేనూ నీదాన
ఎదలోన నీసోకె ఎలిగేను మామ
ఒకటి రెండు మూడు నాలుగైదు
ఆరు ఏడు ఎనిమిది
లెక్కపెట్టే తలికి నీ పక్కనే వుంటాను మామా

జాలీ బొంబైలే... 
జాలీ బొంబైలే మామా ఓ మామా

పంటా సేలాదారి పలుకాడుకుందాం
పంటా సేలాదారి పలుకాడుకుందాం
పైరూ గాలిలోనా పయనాలుసేద్దాం
పైరూ గాలిలోనా పయనాలుసేద్దాం
సల్లాని ఎన్నెల్లో సరసాలు సేసి
సన్నజాజి పొదలమజిలీలుయేసి
సుళ్ళు తిరిగి గళ్ళు కదలి వూళ్ళు దాటి ఏళ్ళుదాటి
ఏకధాటి ఎగురుకుంటూ ఎల్లిపోదాం మామా

జాలీ బొంబైలే...
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా
జాలీ బొంబైలే మామా ఓ మామా 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.