బుధవారం, ఫిబ్రవరి 20, 2019

ఊరేది పేరేది ఓ చందమామ...

రాజమకుటం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట గురించి రాగాల గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజమకుటం (1960)
సంగీతం : మాస్టర్ వేణు(ఆర్కెస్ట్రేషన్)
బాలాంత్రపు రజనీకాంతరావు (బాణి కూర్పు)
సాహిత్యం : నాగరాజు.
గానం : ఘంటసాల, లీల.

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓ...ఓ..
ఊరేది పేరేది ఓ చందమామ
ఊరేది పేరేది ఓ చందమామ
నిను చూచి నీలి కలువ పులకింపనేలా
ఊరేది పేరేది ఓ చందమామ


ఓ..ఓ..జాబిల్లి నీలీ కలువా విడరాని జంట
ఊరేల పేరేల ఓ కలువ బాల
ఊగెటి తూగెటి ఓ కలువ బాల

ఆ..ఆ..ఆ..
విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ..
కురిసే తేనేల కలువనురా
తరిపి వెన్నెలల దొర రారా ఆ..ఆ..ఆ..
మరుగెలనురా నెలరాజ
తెర తీయర చుక్కల రేడా
రావోయి రావోయి ఓ చందమామ


పరువములొలికే విరిబోణీ
పరువములొలికే విరిబోణీ
స్వప్నసరసిలో సుమరాణీ ఆ..ఆ..
కొలనంతా వలపున తూగే
అలలై పులకింతలు రేగే
నీవాడ నేగాన ఓ కలువ బాలా..ఆఆ..

తరుణ మధుర మొహనా హిమకర
గరళ యవ్వనాంబురాశి కనర
సురుచిర మదనా నివాళి ఇదిగో
సురుచిర మదనా నివాళి ఇదిగో
వలచిన నా హృదయమె గైకొన రారా


నీదాననే గానా ఓ కలువ రేడా
నీవాడనే గానా ఓ కలువ బాల
ఊహూ..హూ..హూ..హూ... 

 

4 comments:

ఈ మూవీ చాలా బావుంటుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

చారుకేశి రాగాన్ని ఇంత అందంగా ఇంకెవ్వరూ కంపోజ్ చెయ్యలేరు.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ sistla గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.