ఆదివారం, ఫిబ్రవరి 10, 2019

పయనించే ఓ చిలుకా...

కులదైవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కులదైవం (1960)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : సముద్రాల
గానం : ఘంటాసాల

పయనించే..ఓ..ఓ.. ఓ... చిలుకా
ఆ...ఆ....ఆ....ఆ...ఆ..
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో..పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా
ఎగిరిపో..పాడైపోయెను గూడు
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ...
 
తీరెను రోజులు నీకీ కోమ్మకు...కోమ్మా ఈ గూడు వదలి
తీరెను రోజులు నీకీ కోమ్మకు...కోమ్మా ఈ గూడు వదలి
ఎవరికి వారే ఏదోనాటికి...ఎరుగము ఎటకో ఈ బదిలీ
మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ
మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపథాన...
నిజాయితీగా ధర్మపథాన....ధైర్యమే నీ తోడు
 
పయనించే ఓ చిలుకా...
ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ..
 
పుల్ల పుడక ముక్కున కరచి...గూడును కట్టితివోయి
పుల్ల పుడక ముక్కున కరచి...గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగి రెక్కలు...ఎండకు ఆరినవోయి
ఫలించ లేదని చేసిన కష్టం..మదిలో వేదన వలదోయి
ఫలించ లేదని చేసిన కష్టం..మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెను వెంట..త్యాగమే నీ చేదోడు
 
పయనించే ఓ చిలుకా...
ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ..

మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే
మరవాలి నీ కులుకుల నడలే...మదిలో నయగారాలే
తీరని వేదన తీయని ముసుగే...శిరస్సున శింగారాలే....
ఓర్వలేని ఈ జగతికి నీ పై...ఈ..ఈ..
ఓర్వలేని ఈ జగతికి నీ పై...లేవే కనికారాలే
కరిగి కరిగి కన్నీరై...
కరిగి కరిగి కన్నీరై...కడతేరుటే నీ తల వ్రాలి

పయనించే ఓ చిలుకా...
ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా

గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు
గోడుమని విలపించేరే ...నీ గుణం తెలిసిన వారు
జోడుగ నీతో ఆడీ పాడీ...కూరుములాడిన వారు
ఏరులైయే కన్నీరులతో...మనసారా దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా...ఎవడే తెలిసిన వారు

పయనించే ఓ చిలుకా...
ఎగిరిపో..పాడైపోయెను గూడు...
పయనించే ఓ చిలుకా
ఆ...ఆ...ఆ...ఆ...

2 comments:

యెవ్వర్ గ్రీన్ సాంగ్..

అవును శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.