శుక్రవారం, ఫిబ్రవరి 08, 2019

అనురాగ సీమ...

కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కనక దుర్గ పూజా మహిమ (1960)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : పి. బి. శ్రీనివాస్, జిక్కి

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ... మనదే సుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
ఓ హొహొహో...అహహ...అహహ...అహహా...

ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే
చిగురాకు పూబాలలూగే
ఆ....ఆ... ఆ...
తెరవోలె చిరుగాలి పారాడి సాగే
కెరటాలు కోనేట తూగే

ఓ... మధురానుభవమే ఈ జగానా..
మధుమాసమై నేడు శోభించెనా...
ఇలనిండె వలపు ఈ దినానా...
కలలన్ని కనులార కాంతుమా...

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల చవి చూదమా

నెలరాజు నేడేల కనరాక మానే
నీ మోము తిలకించి తలదించెనే....
ఓ...ఆ...ఆ....
పలికేటి చిలుకేల తన పాట మానే
కలకంఠి నీ కంఠమాలించెనే...

కులికింది కళలా ఈ లోకమెల్లా...
పులకించె నిలువెల్ల గిలిగింతలా...
మనలోని ప్రేమా... ఎనలేని ప్రేమా
మనసార తనిదీర సేవింతుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవి చూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ మనదే సుమా

అనురాగ సీమ మనమేలుదామా
ఆనందాల చవి చూదమా
అహా హా హా ...
ఓహో ఓ హో హో హొ హో...


2 comments:

ఈ పాట యెప్పుడు విన్నా చాలా తమాషాగా అనిపిస్తుంది..ఒక మీటర్ కి పాట రాయాలి అనే మిత్ బ్రేక్ చెసినట్టుంటుందీ పాట..రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికీ ఆ క్రెడిట్ చెందుతుందనిపిస్తుంది..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.