తేజ తీసిన సినిమాలన్నిటిలోకి నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా ఈ 'ఫ్యామిలీ సర్కస్'. పిల్లల అల్లరి, ధర్మవరపు కోటా కాంబినేషన్, రాజేంద్రప్రసాద్, ఎమ్మెస్, బ్రహ్మానందం ఒకరేంటి ప్రతి సీన్ నవ్వులే నవ్వులు. ఈ సినిమాలో సీన్స్ మీమర్స్ ఇప్పటికీ వాడుతున్నారంటే అర్ధంచేస్కోవచ్చు. అలాంటి సినిమాలో నుండి ఒక సరదా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఈ రోజు విడుదలవుతున్న సీత చిత్రం యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని ఒక చక్కని పాట విందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు.
ఒక టైమ్ లో ఆర్పీ పట్నాయక్ పాటలు ఎంత బాగుండేవో.. తేజ,కులశేఖర్,ఇతను కలిసి ఇచ్చిన మెలోడీస్ ని ఎప్పటికీ మర్చిపోలేం అలాంటి ఓ అందమైన మెలోడి జయం చిత్రంలోని ఈ పాట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఆదివారం, డిసెంబర్ 22, 2013వేణూశ్రీకాంత్2 వ్యాఖ్యలు
తేజ మొదటి సినిమా “చిత్రం” లోని ఈ సరదా అయిన పాట నాకు చాలా ఇష్టం, క్యాసెట్ రిలీజ్ అయిన కొత్తలో పదే పదే వినేవాడ్ని. కులశేఖర్ రాసిన సాహిత్యం భలే సరదాగా ఉంటుంది. కుక్కకావాలని ఏడ్చే ఓ పిల్లవాడికి రామాయణ భారత బాలనాగమ్మ కథలను చెప్తూ వాడి దృష్టి మరల్చాలనే ప్రయత్నంతో సాగే ఈ పాట పిల్లలనీ పెద్దలనీ కూడా ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో ఉత్తేజ్ తెలంగాణా యాసలో పాడడం కూడా చాలా సరదాగా ఉంటుంది. ఈపాట మీకోసం ఇక్కడ ఇస్తున్నాను విని ఎంజాయ్ చేయండి. ఈటివి తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానల్ లో బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు కాకపోతే ఈ లింక్ అమెరికాయేతర పాశ్చత్యదేశాలలో పనిచేయదు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినండి.
చిత్రం : చిత్రం
సాహిత్యం: కులశేఖర్
సంగీతం: ఆర్ పి పట్నాయక్
గానం: నిహాల్, సందీప్, ఆర్ పి పట్నాయక్, రవి వర్మ, గాయత్రి, ఉత్తేజ్
అన్నయ్యా...... కుక్క కావాలి.........కుక్క కావాలి.........
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ.......
దశరధ రాజుకు వారసుడు.......... సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు......... మంచి గుణాల లిస్టతడు
భీష్మ...
-
త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా
నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం
త్రివిక్రమ్ సినిమా చూస...