మంగళవారం, ఏప్రిల్ 13, 2021

కోకిలమ్మ కొత్తపాట...

మిత్రులకు ప్లవ నామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ సుందరకాండ సినిమాలోని ఓ సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సుందరకాండ (1992)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, చిత్ర

కోకిలమ్మ కొత్తపాట పాడింది
కూనలమ్మ కూచిపూడి ఆడింది
సందెపొద్దు నీడ అందగత్తె కాడ
సన్నజాజి ఈల వేయగా

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా

పక్కపాపిడెందుకో
పైట దోపిడెందుకే
మగడా ఎడాపెడా 
గడీ పడగానే 

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా

పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో 
నీ గుట్టు తీపిగున్నది
పైటగుట్టు బైటపెట్టు చేతిపట్టులో 
నీ కట్టు జారుతున్నది
కొత్తగుట్టు కొల్లగుట్టు కోకోనట్టులో
రాబట్టు కొబ్బరున్నది
దాచిపెట్టి దోచిపెట్టు చాకులెట్టులో
బొబ్బట్టు మోతగుందది
బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే 
విచ్చుకుంటావయ్యో
నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే
పుచ్చుకుంటానమ్మో
వరసే నిలు కలు కొలు అనగానే

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా

కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకపట్టులో
కాల్‌షీటు నైటుకున్నది
పాలుపట్టి పండబెట్టు పానిపట్టులో
బెడ్‌షీటు బెంగపడ్డది
బెడ్డులైటు తీసికట్టు గుడ్డునైటులో
కుర్ర ఈడు కుంపటైనది
ఉట్టికొట్టి చట్టిపట్టు జాకుపాటులో
ఆటుపోటు అక్కడున్నది
ఒంపులో సొంపులో నిన్ను 
వొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో
చెప్పినా చేసినా నీది కాని 
నాది ఎక్కడుంటాదయ్యో
ఘజలే చెలి అనార్కలి అనగానే 

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా

పక్కపాపిడెందుకో
పైట దోపిడెందుకే
మగడా ఎడాపెడా 
గడీ పడగానే 

అరె మావా ఇల్లలికి 
పండుగ చేసుకుందామా
ఓసోసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.