నిత్యశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిత్యశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, ఏప్రిల్ 15, 2020

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా...

టీవీ సీరియల్స్ చూడకపోయినా ఒకే సమయానికి ప్రతి ఇంట్లో మోగే టీవీల్లోంచి వచ్చే ఆ సీరియల్స్ టైటిల్స్ సాంగ్ నుండి మాత్రం తప్పించుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇక కాస్తో కూస్తో పాటల పిచ్చి ఉన్నవాళ్ళకి అసలు అసాధ్యం. అప్పట్లో అన్ని సీరియల్ పాటలు కాకపోయినా కొన్ని కొన్ని పాటలు భలే ఆకట్టుకునేవి మనకి తెలియకుండానే పాడేసుకునేంతగా నాటుకు పోయేవి వాటిలో అమృతం, ఋతురాగాలు, తర్వాత ఈ 'పిన్ని' అనే సీరియల్ సాంగ్. ఈ పాట ఐన తర్వాత పిన్నీ అని పిలిచే పిలుపు భలే చిత్రంగా అనిపించేది. ఎప్పటినుండో తెలియదు కానీ ఈ సీరియల్ రెండో సీజన్ మొదలవుతుందని విన్నాను.

ఈ పాటకి సంగీతం అందించినది ఎక్కువగా తమిళ్ టీవీ సీరియల్స్ కి సంగీతం అందించే 'దిన' అయితే రాసినది ఓంకార్ పరిటాల వీరు సీనియర్ నటుడూ మరియూ రచయిత, మన రియాల్టీ షోస్ వన్ సెకన్ ఓంకార్ కాదు. కొన్ని సినిమాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ సంభాషణా శైలితో ఆకట్టుకున్నారు, అలాగే తన రచనలలో సామాజిక అంశాలను చొప్పించి పేరు తెచ్చుకున్నారు. ఈ పాట ఫస్ట్ సీజన్ వీడియో మంచి క్వాలిటీ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఇదే పాట సెకండ్ సీజన్ విజువల్స్ తో  ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : పిన్ని
సంగీతం : దిన
సాహిత్యం : పి. ఓంకార్ (సీనియర్ యాక్టర్/రైటర్)
గానం : నిత్యశ్రీ 

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 

నిని సాసాస.. నిని సాసాస
నిసగగ నిసగగ గమపమగరిసా
నిసగగ నిసగగ గమపమగరిసా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం
గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం కాదా
సీత గీత దాటిందా యుద్దకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...ఓఓఓ...
ఝుంతనఝనఝన..ఝుంతనఝనఝన..
ఝుంతన..ఝుంతన..ఝుంతనన..ఓఓఓ...

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 


శనివారం, మార్చి 21, 2015

ఉగాది శుభాకాంక్షలు...

మిత్రులందరకూ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్బంగా బాలచందర్ గారు "పరవశం" అనే సినిమా కోసం రాయించుకున్న "మన్మథ మాసం" పాటను ఈ రోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : పరవశం (2001)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : ఎ.ఎమ్.రత్నం, శివగణేష్
గానం : శంకర్ మహదేవన్, నిత్యశ్రీ

మన్మథ మాసం...
ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
 
ఈఈఈ...ఆఆ...ష్.త్తారా...రే.రే.రే..రే...
ఇది మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం 
మన్మథ మాసం మద మద మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మద మద మాసం 
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం

ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
సిరి వెన్నెల విరియు మల్లెల మాసం మన్మథ మాసం
ఇది పండెండ్రు మాసములలొ పరువపు మాసం
ఇది ఒకరి ఒడిలొ ఒకరు ఒదుగు వలపుల మాసం
మన్మథ మాసం....
సిరిమల్లెల మంజుల మన్మథ మాసం
సిరిమల్లెల మంజుల మన్మథ మాసం
తనువు తాకినా... ఊరెరిగే...
మనసు తాకినా... ఊరెరుగదులే...
తనువూ..ఊఊఊఊ...
తనువు తాకినా....
తనువు తాకినా.. ఊరెరిగే.. ఊరెరిగే..
మనసు తాకినా.. ఊరెరగదులే..
ఆఆఆఅ మనసు తాకినా.. హే..ఊరెరగదులే..
మనసు తాకినా.. ఊరెరుగదులే..

మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
ఇది మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మద మద మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మథ మాసం మన్మథ మాసం
మన్మథ మాసం మన్మధ...మాఆఆ...సం....


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.