శనివారం, డిసెంబర్ 20, 2014

గోకుల కృష్ణా గోపాల కృష్ణా...

ఇది నాకు చాలా ఇష్టమైన పాట. కృష్ణుని విభిన్న తత్వాలను నాయికా నాయకులతో చెప్పిస్తూ సిరివెన్నెల గారు రాసిన లిరిక్స్, దానికి కోటి గారి సంగీతం, అలాగే బాలు చిత్రలు గానం చేసిన తీరు అన్నీ అద్భుతమే. నేను తరచుగా వినే ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోకులంలో సీత (1997)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల
ముద్దు బాలుడెవరే
వెన్న కొల్లగొను కృష్ణ పాదముల
ఆనవాలు కనరే
 
ఆ....
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
పదుగురి నిందలతో పలుచన కాకయ్యా
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
 
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా


ఏ నోట విన్నా నీ వార్తలేనా
కొంటె చేష్టలేలరా కోణంగిలా 
ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా
కల్లబొల్లి మాటలే నా రాధికా
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా 
ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా
తెలియని లీలలతో తికమక చేయకయా  
మనసును చూడకనే మాటలు విసరకలా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

 
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

 
ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా
అంతతోనే ఆగెనా ఆ బాలుడు 
ఆ..అవతార మూర్తిగా తన మహిమ చాటెగా
లోకాల పాలుడు గోపాలుడు
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు  
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కధా తరములు నిలిచె కదా 
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

 
గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా
అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
అందెల సందడితో గుండెలు మురిసెనురా
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

6 comments:

ee paata raasindi Sirivennela gaaru anukunta..

థాంక్స్ అజ్ఞాత గారూ, పోస్ట్ అప్డేట్ చేశాను. నేను ఒక వెబ్ సైట్ లో చూసి వేటూరి గారే అని పొరబడ్డాను. మీ కామెంట్ చూశాక చెక్ చేస్తే భువన చంద్ర గారు రాసిన రెండు పాటలు మినహా ఈ సినిమా పాటలన్నీ సిరివెన్నెల గారే రాశారు.

ఈ పాట వింటే నిందాస్తుతి లా అనిపిస్తుంది..

అవునండి.తెలుగు భాష తెలుగు పదాల గొప్పతనం అదే..మనం తెలుగువారు గా పుట్టడం పూర్వజన్మ సుకృతం

అవునండీ.. అగ్రీ విత్ యూ.. థ్యాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.