శుక్రవారం, డిసెంబర్ 05, 2014

కోరికలే గుర్రాలైతే.. ఊహలకే రెక్కలు వస్తే...

నాకు రేడియో వినిపించిన పాటలలో మరొక పాట ఇది. ఇంట్లో ఏ పని చేస్తున్నా పెద్దగా డిస్ట్రబ్ చేయకుండా నేపధ్యంలో ఇటువంటి సత్యం గారి పాటలన్నీ చాలా స్మూత్ గా అలా సాగిపోతూండేవి. ఇప్పటికీ ఒక్కోరోజు ఈ పాట వింటూంటే అప్పటి జ్ఞాపకాలేవో అలా తెమ్మెరలా స్పృశించి వెళ్ళిపోతుంటాయి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

ఓ..హో.. ఆహాహహా.. ఆహహా.. ఓహొహో..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

తన ఇంట సిరితోట పూచేనని.. తన దారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యని పాటేనని.. తా గన్న కలలన్ని పండేనని
సరదాలన్నీ చవి చూడాలని.. సంబరపడుతుంది
సరదాలన్నీ చవి చూడాలని.. సంబరపడుతుంది
సంపదలన్నీ తనకే కలవని.. పండుగ చేస్తుంది
ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

జాబిల్లి తనకున్న విడిదిల్లని.. వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని.. తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని.. నిచ్చెన వేస్తుంది
ఆకాశాన్ని దాటేయాలని.. నిచ్చెన వేస్తుంది
ఈ లోకాలన్ని గెలిచేయాలని.. ముచ్చట పడుతుంది..
ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే..

5 comments:

ఎంత చక్కని పాటనిగుర్తుకుతెచ్చారండి. ఆత్రేయగారి కలంలో జీవితంలో మబ్బులనుచూసి ముంతవొలకబోసుకోవద్దనే విషయాన్ని పాటలోపొందుపరిచారు. సినిమా కధ సారాంశం మొత్తం అదే సందేశంతో నడుస్తుంది. నా చిన్ననాటి సినిమా. అంతర్జాలంలోకూడా దొరకటంలేదు. వుంటే సినిమాకూడా పెడుదురు. సుశీలమ్మ గొంతులో తీపితోకూడిన వగరుకూడా ఈపాటలో కనిపిస్తుంది.అందించినందుకు ధన్యవాదాలు.

థాంక్స్ స్వరాజ్యలక్ష్మి గారు... ఇదే పాట చంద్రమోహన్ గారి వర్షన్ లో మీరు చెప్పిన చక్కని సాహిత్యం ఉంటుందండీ.. ఈ సినిమా మొత్తం ఇక్కడ చూడవచ్చు https://www.youtube.com/watch?v=9RRLxhlYDHI

thanks venu srikanth gaaru for giving movie link. thanku once again.

మనసు వేగాన్ని మనిషి అందుకోవడం కూడదు సుమా అన్నట్టుందండీ మీరు వేసిన పిక్..సో యాప్ట్ యెండ్ సో నైస్....

పాట ఉద్దేశ్యం కూడా అదేకదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.