గురువారం, ఏప్రిల్ 23, 2020

మనసు ఉన్నది మమతల కోసం...

వెండితెర మీద ఎలా ఐతే ఒక వెలుగు వెలిగిందో అంతకు రెండింతలు సీరియల్స్ లోనూ ప్రభంజనం సృష్టించిన నటి రాధిక. తమిళంలో తీసిన సీరియల్స్ అయినా జెమినీ టీవీ పుణ్యమా అని తెలుగులోనూ డబ్బింగ్ అయి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి తన సీరియల్స్. అలాంటి వాటిలో ఈ శివయ్య ఒకటి. తమిళ్ లో అన్నామలై పేరుతో వచ్చిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ విజువల్స్ ప్రత్యేకంగా ఉండి నాకు భలే నచ్చేవి అప్పట్లో. అలాగే మొదట్లోనూ చివరలోనూ వచ్చే ఆలాపన ఆ ట్యూన్ కూడా ప్రత్యేకంగా ఉండేవి.

నాకు గుర్తున్నంతవరకూ మధ్యాహ్నం ఒకటిన్నరకో రెండింటికో వచ్చేది ఈ సీరియల్. లంచ్ టైమ్ లో అమ్మా నాన్నా ఇద్దరు ఇది చూశాకే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు. నేను సీరియల్ ఫాలో అవ్వకపోయినా ఇంట్లో ఉంటే మాత్రం టైటిల్ సాంగ్ మిస్సవకుండా చూసేవాడ్ని. ఈ పాటతో పాటు మరికొన్ని సీరియల్ టైటిల్ సాంగ్స్ ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : శివయ్య (2002)
సంగీతం : దిన
సాహిత్యం :
గానం : బాలు, స్వర్ణలత

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నానేనా ఓఓఓ..
తననానీ నానేనా... 

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

ఇంకో జన్మా ఉందో లేదో
ఎవరికి తెలుసమ్మా
మళ్ళీ జన్మకు నువ్వూ నేనూ
ఎవరై పుడతామో
ఏనాటిదో ఈ బంధము
ఏ చోటికో ఈ పయనమూ
మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం
ఎవరికి ఎవరో అవుతుంటాం
తీరీ తీరని ఆశలతో
ఎపుడో విడిపోతాం

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నాననినా ఓఓఓ..
తననానీ నానానా...  

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.