ఈటీవీ సుమన్ గారి గురించీ అంతరంగాలు సీరియల్ గురించీ తెలియని తెలుగు వారుండరేమో. టైటిల్ సాంగ్స్ అంటే ఓకే కానీ సినిమాల్లోలాగా సీరియల్ కి పాటలేంటీ అని విస్తుపోయే రోజుల్లో ఒక టీవీ సీరియల్ కి పాటలు కంపోజ్ చేయించి క్యాసెట్ రిలీజ్ చేయడం సుమన్ గారికే చెల్లింది. అందులో సునీత పాడిన ఈ పాట అప్పట్లో నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో మంచి క్వాలిటీ దొరకలేదు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
సీరియల్ : అంతరంగాలు (1998)
సంగీతం : వాసూరావ్
సాహిత్యం : సుమన్
గానం : సునీత
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఏమిటీ కొత్త వింత మదిలో ఏదో పులకింత
అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింతా
ఇదేనేమో ప్రేమా నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
అడగకు ఇది ఏమనీ
అంతరంగానికిదే ఆమని
అనంత జీవన వాహినీ
అద్భుతానందావని
ఇది కమ్మని యామిని
జన సమ్మోహిని
జగతికే వరదాయని
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది మదిలో వెల్లివిరిసే ఇంధ్ర ధనుస్సు
మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సూ
ఇది యవ్వన యశస్సూ ఆశల ఆశీస్సూ
దీనికో నమస్సూ
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
సంగీతం : వాసూరావ్
సాహిత్యం : సుమన్
గానం : సునీత
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఏమిటీ కొత్త వింత మదిలో ఏదో పులకింత
అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింతా
ఇదేనేమో ప్రేమా నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
ఇది తొలి తొలి వలపుల
తొలకరి ధ్వని తొలకరి ధ్వని
తపనకు తరగని గని
తలపుల రాజధాని
అడగకు ఇది ఏమనీ
అంతరంగానికిదే ఆమని
అనంత జీవన వాహినీ
అద్భుతానందావని
ఇది కమ్మని యామిని
జన సమ్మోహిని
జగతికే వరదాయని
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడెందుకో
పెదవులకీ వణుకెందుకో
పరువానికీ పరుగెందుకో
తనువుకీ తపనెందుకో
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు
ఎద ఎదనూ పండించే ఎర్రని తేజస్సూ
ఇది మదిలో వెల్లివిరిసే ఇంధ్ర ధనుస్సు
మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సూ
ఇది యవ్వన యశస్సూ ఆశల ఆశీస్సూ
దీనికో నమస్సూ
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
గుండెకీ సవ్వడందుకే
పెదవులకీ వణుకందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
పరువానికీ పరుగందుకే
తనువుకీ తపనందుకే
ఇదే ఇదే ప్రేమా
నవయవ్వన సీమా
ఇదే సుమా ప్రేమా
ఆ మదనుడి మహిమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.