శ్రీదేవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీదేవి (1970)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, జానకి
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మా.. కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో హా
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ..
అందాలా పయ్యెద నేనై ఆటాడనా ఆ..
కురులందు కుసుమం నేనై చెలరేగనా.. ఆ..
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...
3 comments:
good one bro. I always listen to this song
Great composer G K Venkatesh. Melodious song. The guitar bits in this song are very pleasant.
థ్యాంక్స్ ఎలాట్ సోదరా.. మీ నలభీమ బ్లాగ్ గురించి నిన్ననే తలచుకున్నాం. అంతలో మీరిక్కడ కామెంట్ పెట్టడం చాలా సంతోషం :-)
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ జీ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.