సోమవారం, ఏప్రిల్ 20, 2020

ఆశా చిన్నిఆశా...

రెయిన్ బో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రెయిన్ బో (2008)
సంగీతం : నిహాల్  
సాహిత్యం : జిల్లెళ్ళ వరప్రసాద్ 
గానం : సునీత

లాల్లా..లాలలాలా..
ఊహూహూ.. ఆహాహాఅ
ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా
నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా
నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా
ఎదురే చేరి ప్రేమించగా..

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా

గతంలోన కథల్లోన చూడని
పథంలోన పతంగాల ఆమని
నన్ను చూసి నాతో ఆడేనా
వనంలోని విహంగాల సారిక
ఇలా నన్ను వెతుక్కుంటు వాలగ
జంట చేరి నాతో పాడేనా
వేల వేల ఆశల్లోన సూర్యోదయం
కోటి కోటి తారల్లోన చంద్రోదయం
హరివిల్లులో కొత్త రంగునై చేరనా

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా

వయ్యారాల వసంతాల వాకిట
స్వరంలోన పదాలల్లి పాడగ
మేఘమాల నేనై సాగేనా
పదారేళ్ళ పసందైన కోరిక
పదా అంటు పిలుస్తున్న వేడుక
పారిజాత పువ్వై పూసేనా
గాలి నీరు నేలా నింగి దీవించగా
అంతులేని ఆనందాలే లోగిళ్ళుగా
తొలివేకువై కొత్త లోకమే చూడనా

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
లాల్లా..లాలలాల.. లాలలాల.. హాయిగా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.