రుద్రవీణ చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతె ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ
దిశనెరుగని గమనము కద
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
ఏ కళ కైనా ఏ కల కైనా
జీవిత రంగం వేదిక కాదా
ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలకదు కద
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
4 comments:
మంచి సాహిత్యం. హంసధ్వని రాగం లో బాణీ కూడా బాగుంది. అయితే చరణాలలో - ఏదీ సొంతం,కూసే కోయిల - అన్న చోట - నిషాదం octave మారడం వినసొంపు గా లేదు. ఒక్కోసారి ప్రయోగం అంతగా నప్పదు . but for this the song is a good one.
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ జికెకె గారు.. బహుశా కావాలనే అలా పెట్టి ఉంటారండీ.. తరువాత సీన్ లో గణపతి శాస్త్రి గారితో హంసధ్వని కాదది హింసధ్వని అని అనిపించాలి కదా :-)
చాల మంచి పాట 👌
థ్యాంక్స్ జాన్సన్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.