బుధవారం, ఏప్రిల్ 01, 2020

అయ్యోలూ హమ్మోలు..

ఫూల్స్ డే నాడు తలుచుకోవడానికి అసలు ఇంతకన్నా అర్హత వున్న వాళ్ళెవరైనా ఉంటారా. తమ అమాయకత్వం తో అతి తెలివితో అమోఘమైన ఐడియాలతో బోల్తాపడుతూ అప్పాజీకి పెనాల్టీలు చెల్లిస్తూ మనకి బోలెడు నవ్వులని పంచుతారు కదా. అందుకే అమృతం (అ)ద్వితీయం అంటూ మొన్న ఉగాది నుండీ జీ5 లో సెకండ్ సీజన్ మొదలెట్టేసిన అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ ని ఈ రోజు తలుచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సెకండ్ సీజన్ ప్రోమో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : అమృతం (2020)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : కళ్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

నువ్వాకాశానికి
చిల్లెట్టేంత డేంజరువా
స్పేసంతా ఇరుకై
పోయేటంత ట్రాఫిక్కువా
నీకోసం పుట్టాయా
లోకంలో అన్ని కష్టాలు
నీవల్లే వస్తాయా
ప్రళయాలూ విశ్వ విలయాలు

భయం లేదు శిశువా
ఇసుక తునకంత లేవే నువ్వసలు
నువ్వేం చేయగలవా
అష్ట దిక్కుల్ని వణికించే పనులు
ఎవరెస్టును తొక్కేస్తాయా
మన ఈ పాదాలూ
పసిఫిక్కుని ఇంకించేస్తాయా
నీ పంతాలూ

ఆటం బాంబ్ వేశావే
భూగోళం పేలి పోయిందా
గనులెన్నో తవ్వావే
పాతాళం గాని తగిలిందా

ఒరేయ్.. ఒరేయ్.. ఒరేయ్..
ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు.. 
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్..
 
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ సీరియల్ మొదటి సీజన్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాను దానిగురించి ఇదివరకు నేను వేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : అమృతం (2001)
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హు హు హు..
ఆహాలూ ఓహొలు..
ఉంటాయి వెతుకు హ హ హ..

మన చేతుల్లోనే లేదా
రీమోట్ కంట్రోలు..
ఇట్టే మార్చేద్దాము
ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు..

వార్తల్లొ హెడ్ లైన్సా..
మన కొచ్చే చిలిపి కష్టాలు..
అయొడిన్ తో అయిపోయే..
గాయాలే మనకు గండాలు..

ఎటో వెళ్ళి పోతూ..
నిన్ను చూసింది
అనుకో ఓ ట్రబులు..
hello..how do u do..
అని అంటోంది
అంతే నీ లెవెలు..
ఆతిధ్యం ఇస్తానంటె
మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం
చేస్తుందా..

గాలైనా రాదయ్యా..
నీదసలే ఇరుకు అద్దిల్లు..
కాలైనా పెడుతుందా
నీ ఇంట్లో పెను తుఫానసలు..

ఒరేయ్ ఆంజినేలు..
తెగ ఆయస పడిపొకు చాలు..
మనం ఈదుతున్నాం..
ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc.. మన కష్టాలు..
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ..
ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే..
టెన్షన్ లేం పడకు గోలీ మార్.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.