శనివారం, ఏప్రిల్ 25, 2020

మురిసే పండగపూటా..

క్షత్రియ పుత్రుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట మొదటిలో వచ్చే ఘటం మ్యూజిక్ చాలా బావుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : క్షత్రియపుత్రుడు (1994)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : మాదవపెద్ది రమేష్, సురేంద్ర
శేష గిరీశం, రాజశ్రీ

ఓ ఓ ఓ...
మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే
పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే
క్షత్రియ పుత్రుడే హొ..

మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా..

కల్లా కపటమంటూ లేనీ..
డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
పల్లె పట్టు ఈ మాగాణీ..
డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
కల్లా కపటమంటూ లేనీ
పల్లె పట్టు ఈ మాగాణీ..
మల్లె వంటి మనసే వుందీ..
మంచే మనకు తోడై వుంది..
కన్నతల్లి లాంటి ఉన్నఊరి కోసం..
పాటుపడేనంటా రాజు గారి వంశం..
వీరులున్న ఈ ఊరు
పౌరుషాల సెలయేరు..
పలికే.. దైవం..
మా రాజు గారు..

మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే
పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే
క్షత్రియ పుత్రుడే హొయ్..

మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా..


న్యాయం మనకు నీడైఉందీ..
డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
ధర్మం చూపు జాడేఉందీ..
డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
న్యాయం మనకు నీడైఉందీ..
ధర్మం చూపు జాడేఉంది..
దేవుడ్నైన ఎదిరించేటీ..
దైర్యం మనది ఎదురేముంది..
చిన్నోళ్ళింటి శుభకార్యాలు..
చేయించేటి ఆచారాలు..
వెన్నెలంటి మనసుల తోటి..
దీవించేటి అభిమానాలు..
కలిసిందీ ఒక జంట..
కలలెన్నో కలవంట
కననీ.. విననీ..
కథ ఏదో వుందంట..

మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే
పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే
క్షత్రియ పుత్రుడే హొయ్..

మురిసే పండగపూటా..
రాజుల కథ ఈ పాటా.. 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.