పాత భక్తిపాటల్లో కొన్ని మనసుకు అలా హత్తుకు పోతాయి. అలాంటి పాటల్లో దేవులపల్లి గారు రచించగా ఆదినారాయణ గారు స్వరపరచిన "ఘనా ఘన సుందరా" ఒకటి. భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ బాగుంటాయి కానీ ఈ పాట ప్రత్యెకతే వేరు. దేవులపల్లి గారు చక్కని పదాలతో ప్రభాత వేళను కనుల ముందు నిలిపితే అందమైన సంగీతం లో ఘంటసాల గారి గాత్రం తన్మయత్వంతో ఊయలలూగిస్తుంది. నాకు సంగీతంతో పరిచయం లేదు కానీ ఈ పాట మోహన రాగం లో చేసినదని అందుకే అంత మాధుర్యం అనీ ఎక్కడో చదివాను. ఈ పాట చరణం చివర ఘంటసాల గారు పైస్థాయిలో "నిఖిల జగతి నివాళులిడదా" అన్న వెంటనే ఆర్తిగా "వేడదా.. కొనియాడదా.." అన్నచోట ఒక్కసారిగా మనకు మనమే ఆ స్వామికి అర్పించుకున్న అనుభూతి కలుగుతుంది.
ఇంకా ఈ పాట ఎప్పుడు విన్నా చిన్నతనంలో ఉదయాన్నే గుడిలో మైకుద్వారా విన్నప్పటి రోజులలోకి వెళ్తూ ఆనందానుభూతిని పొందుతాను. మీరు గమనించారోలేదో పాత గ్రామ్ ఫోన్ రికార్డ్ లలో పాటలు వింటున్నపుడు ఒక విథమైన చిర్పింగ్ సౌండ్ వస్తుంది, కొన్ని పాటలు పూర్తి క్లారిటీ తో వినడం కంటే ఆ చిర్పింగ్ సౌండ్ తో వినడం లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇది కూడా అలాంటి పాటలలో ఒకటి. పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. ఆలశ్యమెందుకు మీరు కూడా చూసి విని ఆనందించండి. వీడియోలో ఆడియో క్లారిటీ అంత బాగాలేదు, ఆడియో మాత్రమే వినాలంటే చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినచ్చు.
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల
హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
ఆ-అ-అ-అ-అ-ఆ... అ-ఆ...
ఆ.ఆ... ఆ.ఆ... ఆ... అ-ఆ...
ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా.
ఘనా. ఘన సుందరా..
కరుణా.. రస మందిరా. ..
అది పిలుపో.. మేలు కొలుపో..
నీ పిలుపో.. మేలు కొలుపో..
అది మధుర. మధుర.
మధురమౌ ఓంకారమో.. ..
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా...
ఆ... అ-అ-ఆ..
.....
ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడీ...
నీపద పీఠిక తలనిడీ..
ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడి...
నీపద పీఠిక తలనిడీ..
నిఖిల జగతి నివాళులిడదా..
నిఖిల జగతి నివాళులిడదా..
వేడదా.. కొనియాడదా..
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా
కరుణా.. రస మందిరా
ఆ... అ-అ-ఆ..
గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...
గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...
సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
శ్రీకరా... భవహరా...
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
కరుణా.. రస మందిరా.అ-అ-ఆ..
ఆ... అ-అ-ఆ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
4 comments:
I love all songs & beautiful action of all actors especially ANR & Anjali in Bhakta Tukaaram. I purchased DVD of this film for listening songs..
ఓలేటి గారు నెనర్లు, నిజమేనండి పాటలకోసమే డివిడి కొనదగిన సినిమా ఇది.
I'm really a big fan of ANR. I love his movies thanks for sharing the post with us.
i like old songs very much...thanks for posting the lyrics
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.