మంగళవారం, మే 31, 2016

మనసే గువ్వై ఎగసేనమ్మో...

నా పేరు శివ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నా పేరు శివ (2011)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : సాహితి
గానం : కార్తీక్

మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే
నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే
 
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
 
చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం
అనుదినం జరిగెడీ నాటకం
ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం
తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే

కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
 
హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదె నే లేను ఓఓహో..
నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరేను
ఎలా నిను చేరక బ్రతికేను ఓఓహో..
నా ఇరు కళ్ళకి ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే
 
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు 

 

సోమవారం, మే 30, 2016

ప్రేమ కథ మొదలెడితే...

లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించిన నేటి సిద్ధార్ధ చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నేటి సిద్దార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్ ప్యారేలాల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కవితాకృష్ణమూర్తి

ప్రేమకథ మొదలెడితే పెదవులలో కచటతప 
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో గజడదబ
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

ప్రేమకథ మొదలెడితే మతులు చెడే మరుజనక 
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో కసినడక 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

ఈ తుషారాలలో వయసులో హుషారందుకో.. 
ఈ విహారాలలో వలపులో నిషాపంచుకో.. 
అరెరెరె..హలో అంటె ఛలో అంటుంది 
ఒకే ఈడుగల చిలకల రెప రెప

వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

మిడిసిపడే మెరుపులతో ఒరుసుకునే తొలిపరువం
ఉలికిపడే సొగసులలో మెలికపడే చలి విరహం 
నీ కళ్ల గానం నా కన్నె మౌనం 
సాయంత్ర గీతం సై అందిలే 

అరె వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం
 
ప్రేమకథ మొదలెడితే మతులు చెడే మరుజనక
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో గజడదబ
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
హహ వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 

 

ఆదివారం, మే 29, 2016

చెలి నడుమే అందం...

ధర్మక్షేత్రం చిత్రం లోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. లిరిక్స్ లో అక్కడక్కడ కొన్ని లైన్స్ భరించగలిగితే ట్యూన్ మంచి పెప్పిగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినడానికి ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ధర్మక్షేత్రం (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

చెలి నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ

చూశానేనావైపూ ఏ చుక్కా చూడని షేపు
పూపొదరిళ్లల్లో పోపు నే పెట్టెయ్యనా
మత్తెక్కించే చూపు నా మతిపోగొట్టే ఊపూ
సెక్సీ సినిమా స్కోపూ నే చుట్టేయనా
సైడు తగిలే నా కోడే ఈడు రగిలే
గాలి తగిలే నా కన్నెమబ్బు చెదిరే
ఓయ్ నీ దివ్య భారాలు దిద్దుకుంటా
నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ

శృంగారంలో ఈది మధుమందారంలో తేలి
వాలే పొద్దుల్లోనే నీకందించనా
పులకించే పూరేకూ నే పూజించే నీ సోకూ
కొట్టేస్తున్నా షాకు నే చుంబించనా
పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే
అరెరెరె ముట్టడిస్తే నీ కన్నె బొట్టు కరిగే
హే ఓ బాల గోపాల ఒప్పుకుంటా
వయ్యారి గంథాలు అంటేదాకా ఆరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో
నినుకోరీ సరసాలా వర్ణంలో
ఒడిచేరీ పరువాలా పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం
మెడలో హారం పడుచాహారం లవ్లీ
ప్రియ రతిలో రాగం జతలో తాళం
యదలోబంధం పొదసంబంధం లవ్ మీ

శనివారం, మే 28, 2016

వేచి వేచి వే వేచివేచి వేసారిపోయాను...

వంశీ గారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన నీకు 16 నాకు 18 చిత్రంలోని ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నీకు16 నాకు18 (1994)
సంగీతం : వంశీ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర

వేచి వేచి వే వేచివేచి వేసారిపోయాను
చిరుగాలి నోచుకోనీ చివురాకునైనాను
విరహాలనేలే రాణి త్రివేణి

చూసి చూసి నీవేపే చూసి ఏమారిపోయాను
నువులేక నాలోనేను వసివాడిపోతుంటే
అణగారిపొయే ఆశ నిరాశై

నా ప్రాణమా ఇదో శాపమా
వెన్నెలమ్మా తారాడినా కన్నెమబ్బు పారాడినా
తొంగి చూశా నీవేనని కుంగిపోయా రాలేదనీ
ఒక నిముషం కనపడవా ఎద సొదలూ వినపడవా
చెలియా సఖియా లలనా రావే
విరహాలు తాళగ లేనే మరాళీ

చూసి చూసి నీవేపే చూసి ఏమారిపోయాను
నువులేక నాలోనేను వసివాడిపోతుంటే
అణగారిపొయే ఆశ నిరాశై

ఆవేదన అదో శోధన
చెప్పనిదీ ఆ హాయిలో చిక్కుకున్నా నీ ఊహలో
పక్కనున్నా రాలేకనే సొక్కుతున్నా ఈ రేయిలో
నిను విడిచీ మనగలనా విధిలిఖితం అనగలనా
కరిగే కలగానైనా రావా
పరువాల పూలే రాలె వనానా 

వేచి వేచి వే వేచివేచి వేసారిపోయాను
చిరుగాలి నోచుకోనీ చివురాకునైనాను
విరహాలనేలే రాణి త్రివేణి


శుక్రవారం, మే 27, 2016

ఏదో ప్రియరాగం వింటున్నా...

ఆర్య చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ స్వర సారధ్యంలో సిరివెన్నెల గారు వ్రాసిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సాగర్, సుమంగళి(ఆలాప్)

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలేగురువారం, మే 26, 2016

శుభలేఖ రాసుకున్నా...

కొండవీటిదొంగ చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో  
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
  


బుధవారం, మే 25, 2016

ప్రియా ప్రియతమా రాగాలు...

కిల్లర్ సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కిల్లర్ (1991)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వేటూరి
గానం : మనో, చిత్ర

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం నీలో నాలో పలికే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే  
నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

శరత్తులోనా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు


మంగళవారం, మే 24, 2016

అమ్మ సంపంగి రేకు...

శత్రువు సినిమా కోసం రాజ్-కోటి స్వరపరచిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శత్రువు (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ 
జై మదన కామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో..
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో..

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకూ..

కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే
సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే 
శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే 
సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ
ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ 
మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల
చందనాలు చల్లిపోతే

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ
 
యమో యమో చలి ఉపాయమో కసి కథాకళీ తెలిసే 
నమో నమో మరుని బాణమో విరిదుకాణమో తెరిసే
నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్రా లాభాలు కోరేనులే 
నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే
ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో  
ఒకటైతే మనసివ్వూ రెండైతే ఒకటవ్వు
మంచిరోజూ పొంచిఉంది మావిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో

 
అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ
జై మదన కామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో..
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో..

 
అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు
అమ్మ సంపంగి రేకూ..

 

సోమవారం, మే 23, 2016

దోర దోర దొంగముద్దు...

ఇంద్రుడు చంద్రుడు సినిమా కోసం ఇళయరాజా గారు స్వర పరచిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాటఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన

నీ చలి నా గిలి ఓపలేను అందగాడా
నీ శృతి నా లయ ఏకమైన సందెకాడ
అంటినా ముట్టినా అమ్మగారూ
అగ్గిపై గుగ్గిలం నాన్నగారు
ఎంత పడి చస్తున్నానో వెంటపడి వస్తున్నాను
తెలిసిందా ఓ కుర్రోడా దక్కనివ్వు నా మర్యాద
ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ జెండా

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ
గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ
అందుకే సాగనీ రాసలీల
అందమే తోడుగా ఉన్న వేళ
ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో
తెలిసాకే ఓ అమ్మాయి కలిసాయి చేయి చేయి
కానిలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయనా

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన

  

ఆదివారం, మే 22, 2016

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు...

రాక్షసుడు సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాక్షసుడు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు..
మల్లె జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటీ ఈ చిన్నదాన్ని..
చూడకుంటే నాకు వెన్నెలేది..

ఏదో అడగాలనీ.. 
ఎంతో చెప్పాలనీ..
రగిలే ఆరాటంలో..
వెళ్ళలేను.. ఉండలేను.. ఏమి కాను...
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

చేరువైనా రాయబారాలే
చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే
పాడలేని భావగీతం
ఎండల్లో.. వెన్నెల్లో.. ఏంచేతో..
ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా
కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా
తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

కళ్ళనిండా నీలిస్వప్నాలే..
మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే..
నీవు కాదా నాకు ప్రాణం
సందింట్లో ఈ మొగ్గే పూయనీ
రాగాలే బుగ్గల్లో దాయనీ
గులాబీలు పూయిస్తున్నా
తేనేటీగ అతిధేడి
సందెమబ్బులెన్నొస్తున్నా
స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరదా

జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలనీ
ఎంతో చెప్పాలనీ
రగిలే ఆరాటంలో..
వెళ్ళలేను.. ఉహ్మ్..
ఉండలేను.. ఉహ్మ్...
ఏమి కాను... హా..

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు
లలలల.. లలలలలాలా
ఉహ్మ్.. ఉహ్మ్.. హహహహా..

 

శనివారం, మే 21, 2016

వయసే తొలి వసంతాలాడు...

ఇళయరాజా గారి స్వర రచనలో చైతన్య చిత్రం కోసం వేటూరి గారు రాసిన ఒక అందమైన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో
 
మనసే ఒక సవాలైపోయె మల్లె మొగ్గల్లో
పిలుపే తొలి ఫిడేలైపోయె పిల్ల సిగ్గుల్లో
మనకొద్దీ వాయిదాలూ పరువాలే జీవితాలూ
కుర్రకారుల్లో కొత్త ట్యూన్సూ
జార విడిచావా లేదు ఛాన్సూ

వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో

 
కవ్విస్తే ఖలేజాలు చూపే కాళీ మార్కు యువతులం
నవ్విస్తే సరోజాలు పూసే వయ్యారాల వనితలం
సూర్యుణ్ణే హలో అంటాం చంద్రుణ్ణే ప్రియా అంటాం
ఇంద్రుణ్ణే ఛలో అంటాం స్వర్గంలో మకాం వేస్తాం
భామ తన్నింది ప్రేమ పుట్టింది వలపుల క్రియల్లో

 
వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో

 
సరసంలో కులాసాలు చేసే శృంగారాల పురుషులం
సమరంలో భరోసాలు చూపే ఝాన్సీ రాణి గురుతులం 
మానండీ యురేకాలూ మాటల్లో మజాకాలూ
ఎదిరిస్తాం తడాకాలూ ఎగరేస్తాం పతాకాలూ
యుగం మారింది జగం మారాలి జనగణమనల్లో
 
వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో
సొగసే చలిసరాగాలాడు సందె ముద్దుల్లో 
మనసే ఒక సవాలైపోయె మల్లె మొగ్గల్లో
పిలుపే తొలి ఫిడేలైపోయె పిల్ల సిగ్గుల్లో
మనకొద్దీ వాయిదాలూ పరువాలే జీవితాలూ
కుర్రకారుల్లో కొత్త ట్యూన్సూ 
జార విడిచావా లేదు ఛాన్సు 
శుక్రవారం, మే 20, 2016

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా...

ఇళయరాజా గారు స్వరపరిచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, చిత్ర

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ....
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా..

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే..
వీడికి అన్నయ్య వాడే..

జగదేకవీరుడి కథా.. ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల.. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా.. పదులా వందా
బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా.. మతి పోయిందా
చాల్లే మీ కాకి గోలా.. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కథా? కదిలిందా లేదా కథా?
వ్రతమేదో చేస్తోందటా.. అందాక ఆగాలటా
లౌక్యంగా బ్రతకాలీ.. సౌఖ్యాలే పొందాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

గురువారం, మే 19, 2016

తొలిసారి ముద్దివ్వమందీ...

నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. సత్యం గారి సంగీతం పంచే హాయే వేరు.. మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు. పి.సుశీల

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా.
 
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే..

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే

ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా

పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

 

బుధవారం, మే 18, 2016

ఈ కేరింత ఊరింత...

మైఖేల్ మదన కామరాజు చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక సరదాఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మైఖేల్ మదన కామరాజు (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ


ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం


ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఉరకాలి సింగారం ఒలికించాలి వయ్యారం
నీకేల సందేహమే హొయ్ ఇక నీదేగా సంతోషమే
పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగా హత్తుకో అబ్బబ్బబ్బా

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం

గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
 

అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రొజూ తాకాలి అందుకే అవతారమే
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రొజూ తాకాలి అందుకే అవతారమే
కళ్యాణం కాకుండా మన కచ్చేరి సరి కాదు
చెయ్యడ్డుగా పెడితే హోయ్ గోదారి ఆగిపోదు
చెప్పకామాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బా 

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
 
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
 

అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
 
 

మంగళవారం, మే 17, 2016

ఘుం ఘుమాయించు కొంచెం...

కొదమ సింహం  చిత్రం కోసంరాజ్ కోటి స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కొదమ సింహం (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : వేటూరి
గానం : మనో, చిత్ర

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోకుండా తొలికోడి కూసింది
కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది ఒంపో ఏది సొంపో ఉన్నటెంపో పెంచకే

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మొగుడు అవుతాడే మగడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుగుంటే ఘాటురా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం


సోమవారం, మే 16, 2016

మొగలిపువ్వే మోనికా...

కీచురాళ్ళు సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం :కీచురాళ్ళు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

హలో ఐయామ్ హియర్

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా
నీది రూపమా తేనె దీపమా
వాన చీర వయ్యారాలేల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

సాయంత్రం సందెల్లోనా
స్నానాలు చేసే ట్యూనే సంగీతమా
చుంబించు చూపుల్లోనా
బింబించు బింకాలన్నీ సౌందర్యమా
వైశాఖ మాసం వైజాగు తీరం
ఈ రాధ కోరే బృందా విహారం
ఆరు తీగలా నీగిటారుతో
రార వేణుగోపాల బాల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

లకుముకి చెకుముకి చంచం
చెకుముకి లకుచికు చంచం
వల్లంకి పిట్తరో వావిలి గుంట
ముసినవ్వు పంటరో ముద్దులగుంట
ఝల్లంది ఎక్కడో జాబిలి జంట
దానినవ్వుల్లో ఉందిరో మన్మధ మంట
తుళ్ళింత రేగితే తొక్కిడి తంట
కొత్త కవ్వింత పండితే కోరిన జంట

వేసంగి వీధుల్లోనా
వెన్నెల్ల షెల్టరు లోనే శృంగారమా..
శ్రీరంగ నీతుల్లోనా
చీకట్లు ఓకే అంటే సంసారమా
నీ కిస్కిమోలు కొట్టే సవాలు
నా ఎస్కిమోలు కోరే ధృవాలు  
నీ తరంగమే నేను తాకితే
ఏ మృదంగమో మోగే వేళ

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

నీది రూపమా తేనె దీపమా
వాన చీర వయ్యారాలేల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా

మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా


ఆదివారం, మే 15, 2016

ఆయి ఆయి శ్రీ రంగశాయి...

పెళ్ళిపుస్తకం చిత్రంలోని ఓ హాయైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల..
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు
అభిమానమే చాలు అణుచుకొన మేలు

ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు

మాగన్నులోనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్షా..

 
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.