అమ్మలందరకూ ఆ అమ్మల ప్రేమని చవి చూస్తున్న పిల్లలందరకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా 24 సినిమా కోసం ఏ.ఆర్.రహ్మాన్ స్వరసారధ్యంలో నిత్యామీనన్ గానం చేసిన ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. లిరికల్ వీడియో ఇక్కడ.
చిత్రం : 24 (2016)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : నిత్యామీనన్
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. కన్నాజో
చిన్ని రాజుకు లాలిజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. కన్నాజో
చిన్ని రాజుకు లాలిజో
లేత వేళ్ళకు లాలీజో
లేలేత కాళ్లకు లాలీజో
నాలోని కలలను వెలిగించే
నీలాల కళ్ళకు లాలీజో
నీ చిట్టి చేతుల సైగలతో
నీ చుట్టు గాలై తిరిగానే
నీ చిరు గుండెల సవ్వడిలో
నింపానురా నా కాలాన్నే
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. కన్నాజో
చిన్ని రాజుకు లాలీజో
జన్మం పొందే ప్రతి జీవికీ
ఏదో అర్ధం ఉంటుందిరా
నాకు అర్ధం నువ్వేరా
నాకు అద్దం నువ్వేరా
తపస్సు నీకై చేస్తున్నా
నా ఆయుష్షు నీకే పోస్తున్నా
సిరుల నెలవా లాలీజో
చిత్రాల కొలువా లాలీజో
సిరుల నెలవా లాలీజో
చిరంజీవా లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. కన్నాజో
చిన్ని రాజుకు లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. లాలీజో
మ్.ఊఊ.. కన్నాజో
చిన్ని రాజుకు లాలీజో
మ్.ఊఊ..కన్నాజో
చిన్ని రాజుకు లాలీజో
చిన్ని రాజుకు లాలీజో
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.