శనివారం, మే 07, 2016

ముద్దబంతి పూచేనులే...

దళపతి చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట ఆడియోలో మాత్రమే ఉంటుంది కానీ సినిమాలో ఉండదు కనుక వీడియో లేదు.



చిత్రం : దళపతి (1992)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : మనో, స్వర్ణలత

ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే

గుండెల్లో ఊసులన్నీ కళ్లల్లో పొంగెనే
కళ్లల్లో బాసలన్నీ రాగాలై సాగెనే

జాబిలి ఆ నింగిలోన
మబ్బులలో దాగేనో వెన్నెలలే దాచేనో
తీయని నీ ధ్యాసలోనే
నిలిచేనే నా ధ్యానం నీతోనే నాలోకం
కనికరించి నన్నే సేదతీర్చువేళా
కళ్లలోన ప్రేమా చిలకరించువేళాకరిగేనే నీలో...


ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
 
జీవితం పండేను నేడు పలికెనులే
ఓ గీతం పాడెనులే సంగీతం

తోడుగా నీవున్ననాడు ఆశలకే శ్రీకారం
మమతలకే ప్రాకారం
చల్లగాలి నీవై సద్దుచేసినావే
చందమామ నీవై పలకరించి నావే
వెలిసేనే నీకై..

ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే

ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
 

గుండెల్లో ఊసులన్నీ కళ్లల్లో పొంగెనే
కళ్లల్లో బాసలన్నీ రాగాలై సాగెనే

ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
 

ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్ని ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
   
 

2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.