శుక్రవారం, జనవరి 31, 2014

మబ్బులోన చందమామ...

ఇళయరాజా గారి స్వరకల్పనలో సాహసమే జీవితం సినిమాకోసం ఏసుదాస్ గారు పాడిన ఈ పాట చాలా చాలా బాగుంటుంది. వేటూరి గారి చక్కని సాహిత్యం ఏసుదాస్ గారి కమ్మనైన గళంలోనుండి అలవోకగా జాలువారుతుంటే మనసు హాయైన లోకాలలో తేలిపోతూ ఆ మబ్బుచాటు చందమామని దర్శించేస్తుంది. ఈ చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఈ ప్లగిన్ పని చేయకపోతే ఇక్కడ డౌన్లోడ్ ప్రయత్నించండి. 


   
చిత్రం : సాహసమే జీవితం (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్

బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ..
బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ.. 

ఘూంఘట్ కె పీచే..ఖూబ్ సూరత్..సమఝ్ మే..బసే..హ..హా 
బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ..

 మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త..తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ


లేత గాలి సోకగానే..నీలిమబ్బు కరిగిపోయే
జాబిలమ్మ వెలగదా...జాజివాన కురవదా..ఆ..ఆ
బిడియమే..ఏ..ఏ.. తీరిపోయి..వడికి తాను చేరదా..ఆ..
కనులతో..ఓ..ఓ.. ముద్దులాడి..కౌగిలింతలీయదా..ఆ
మోము చాటు చేసినా..ఆ..ఆ.. మోహనమేగా..ఆ..ఆ..

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ

కన్ను నేను గీటగానే..కన్నె సిగ్గు తీరిపోయే..
జోరు ఇంక..ఆగునా...జారు పైట నిలుచునా..ఆ
ఎవ్వరెన్ని వాగినా..ఆ... యవ్వనాలు దాగునా..ఆ
కొమ్మ పూలు పూయగా..ఆ..తుమ్మెదొచ్చి వాలదా..ఆ..
ఎంత దూరమేగినా..ఆ.. చేరువకేగా..ఆ..

పాటలాంటి వయస్సు నాది..పల్లవించు సొగస్సు నీది
శరణమయిన సాగదా..ఆ..చెలిని నేను చేరగా..
ప్రణయమే గానమైన..హృదయవీణ మ్రోగదా..ఆ
పల్లకీ..ఈ..కోరుకున్న..పడుచు ఆశ తీరదా..ఆ
విరహబాధ తీయనీ..వేదన కాదా..ఆ..ఆ

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త.. తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మా...

గురువారం, జనవరి 30, 2014

మనసున ఉన్నదీ/ఎలా ఎలా ఎలాతెలుపను

హ్మ్.. గతమూడురోజులుగా విన్న పాటలు చూసి ప్రేమలేఖలూ ఎలా చెప్పాలో తెలీక కన్ఫూజ్ అవడాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాబోలు అనుకుంటున్నారా.. లేదండీ నిజానికి ప్రేమకి ఆడామగా తేడా లేదు ఒకసారి ఆ దోమ కుట్టిందంటే పడే పాట్లు అందరి విషయంలోనూ కామనే. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి తనమనసులో ఉన్న ప్రేమంతా ఆ అబ్బాయికి చెప్పాలని ఉందట కానీ అతడెదురుపడితే బిడియం అడ్డుపడుతుందట ఆ విషయం మనకి చెప్పీ చెప్పకనే తన ప్రేమావస్థనంతా ఎలా ఈ పాట రూపంలో స్పష్టంగా చెప్పేస్తుందో సిరివెన్నెల గారి మాటలలో మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : ప్రియమైన నీకు(2000)
సంగీతం : శివశంకర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....

చింత నిప్పైన చల్లగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని
లేత గుండెల్లొ కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా ఎద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లొ అతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లొ ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా... ఆ.....
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

ఇక ఈవిడ అవస్థ చూస్తారా అసలు ప్రేమని ఎలా తెలుపాలో అర్ధంకాక చంద్రబోసు గారి మాటల సాయం తీసుకుని తన ప్రేమని ప్రియుడికి ఎలా చెప్పటం బెటరో చెప్పమని మనల్నే సలహా అడుగుతుంది, మీరేమైనా సహాయం చేయగలరేమో ఓ సారీ పాట విని చెప్పండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : నువ్వులేక నేను లేను (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉష

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా 

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

రామచిలుక గోరువంక బొమ్మ గీసి తెలుపనా
రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా
నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా
తెలుపకనే తెలుపనా..

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

కాలివేలు నేల మీద రాసి చూపనా
నా చీరకొంగు తోటి  వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారమంపనా 
గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా
నాలో ప్రాణం నీవనీ..

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపనా
నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా
వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు
ఏర్చి కూర్చి చూపనా
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను

బుధవారం, జనవరి 29, 2014

హలో హల్లో ప్రేమలేఖా

ఒకప్పుడు సందేశాలు అందించేందుకు పావురాలను, ఆ తర్వాత గుర్రాలపై వెళ్ళి సందేశాలను అందించే వేగులను, ఆ తర్వాత ఉత్తరాలను చేర్చే పోస్టల్ వ్యవస్థను, అటుపై టెలిగ్రాములను వాటితర్వాత వచ్చిన టెలీఫోనులను, ఈ మెయిల్స్ నూ, ఇప్పటి సెల్ఫోన్సూ, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్ ఎట్సెట్రాలనన్నిటినీ ప్రేమ సందేశాలను అందించడానికి వాడుకున్నారు ప్రేమికులు. ఫోన్లు బాగా పాపులర్ అయిన టైమ్ లో ఉన్న ఈ ప్రేమికుడిని చూడండి, ప్రేయసితో డైరెక్ట్ గా మాటాడే ఛాన్స్ కోసం ఏకంగా ఫోను చేసేసి ప్రేమలేఖ రాయలేక ఫోను చేశాను అని అందమైన ఆబద్దం అంతే అందమైన పాట రూపంలో చెప్పేస్తున్నాడు తన ప్రేయసికి, ఆ కథా కమామిషూ ఏవిటో మీరు కూడా వినండి మరి. ఈ పాట వీడియో వెతికే సాహసం చేయలేకపోయాను ఆడియో క్రింది ప్లగిన్ పని చేయకపోతే ఇక్కడ ప్రయత్నించండి.చిత్రం : గ్యాంగ్ మాస్టర్ (1994)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేకా 
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్.. ఎల్ బోర్డిది నౌ
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా హయ్..
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అందె నాకు లేఖా చందమామ కేక నన్నింక కవ్వించక
తోటలోని రోజా తోటమాలి పూజ వేళాయే వేధించక
ఈ దూరమే మధురం నీ ఫోను అధరం
సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో
అందాల వాణి విన్నాను ఈ వేళ

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నౌ  
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా హోయ్
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

అర్దరాత్రి దాకా నేను ఆగలేక కొట్టాను లవ్ గంటలే
తెల్లవారేదాకా తేనె విందు లేక కోరాను నీ జంటనే
రాశాను లవ్ లెటరే ఓహ్హో..ఓఓ.. అందాల అడ్రస్ కే
చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో
ఆకాశవాణి చెప్పిందీ శుభవార్త

హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా

హలో హల్లో ప్రేమలేఖా ఫోను చేశా రాయలేక
L O V E లవ్ టెల్ మి అది హౌ
లైనేసిన లవ్ ఎల్ బోర్డిది నవ్
చెలి ఫోనిది మారెను పోను పోను ఓ ప్రేమ ట్యూనుగా
హలో హల్లో ప్రేమలేఖ ఫోను చేశా రాయలేక

మంగళవారం, జనవరి 28, 2014

ప్రేమ లేఖ రాశా నీకంది ఉంటది

సరే ఎలాగోలా ప్రేమ లేఖ రాసేశాము పంపేశాము కదా ఇకనేం హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నారా అయితే ఈ ప్రేమికుడిని చూడండి. ప్రేమలేఖ రాసేసి ఊరికే కూర్చోకుండా దానివెంటనే తనుకూడా ప్రేయసి వద్దకి వెళ్ళి అందిందో లేదో అడుగుతూ ఎలా ఓ చక్కని డ్యూయెట్ వేసేసుకున్నాడో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. వీడియో క్రింద పదిహేనునిముషాల వరకూ ఫర్వర్డ్ చేసి చూడవచ్చు.  చిత్రం : ముత్యమంత ముద్దు (1989)
సంగీతం : హంసలేఖ 

సాహిత్యం :  వేటూరి 
గానం : బాలు, జానకి

ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ
పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ

మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ
వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట !

హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా .. 
అందమైన పొడుపు కథలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా .. 
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా 
సత్యభామ అలకలన్ని పలకరింతలే .. 
అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో .. 
అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే .. 
సరసమాడినా క్షమించలేనురా
వలచి వస్తినే వసంతమాడవే .. 
సరసమాడినా క్షమించలేనురా
కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... !

హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
పూల బాణమేశా ఎదకంది ఉంటదీ


మాఘమాస వెన్నెలెంత వెచ్చనా .. 
మంచి వాడివైతె నిన్ను మెచ్చనా 
పంటకెదుగుతున్న పైరు పచ్చనా .. 
పైట కొంగు జారకుండ నిలుచునా
సినీమాల కథలు వింటె చిత్తు కానులే .. 
చాలించు నీ కథాకళీ
ఆడవారి మాటకు అర్థాలే వేరులే .. 
అన్నాడు గ్రేటు పింగళీ
అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
నుయ్యొ.. గొయ్యొ .. ఏదో అడ్డదారి చూసుకుంట ...!

ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ !
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

సోమవారం, జనవరి 27, 2014

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది

హ్మ్.. ప్రేమ చూడడానికి సింపుల్ గా ఉన్నట్లు ఉంటుంది కానీ ప్రేమికులకి ఎన్ని కష్టాలండీ... పాపం ఈ ప్రేమికుడిని చూడండి మనసులో ఎన్ని మధురమైన భావాలున్నా వాటిని ప్రేమలేఖలో అక్షరబద్దం చేయడానికి చదువుకోలేదట అంతమాత్రానా మౌనంగా ఊరుకుంటే అతను ప్రేమికుడెలా అవుతాడు లెండి అందుకే ఏమాత్రం మొహమాట పడకుండా తన ప్రియురాలి సహాయాన్నే తీసుకుని ఆ భావాలని అక్షరాలలో పెట్టించేశాడు. ఆ కథేమిటో మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : గుణ (1991)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, శైలజ

ఊ..రాయి..రాయీ... 
ఏం రాయాలి?
లెటర్. 
ఎవరికి? 
నీకు. 
నాకా?

నాకు రాయటం రాదు,
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా.

వెయిట్ వెయిట్ నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
హహహ I Like it. చెప్పు.

నా ప్రియా. ప్రేమతో. నీకు. నీకు. నేను రాసే.. రాసే.
నేను. రాసే. ఉత్తరం.
ఉత్తరం లెటర్ ఛా. కాదు ఉత్తరమే అని రాయి. చదువు.

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.
పాటలా మార్చి రాసావా? నేను కూడా మారుస్తా.

మొదట నా ప్రియా అన్నాను కదా!
అక్కడ ప్రియతమా అని మార్చుకో.

ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా?
ఇక్కడ నేను క్షేమం.

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే.
ఆహా ఒహో
ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతోంది.
కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే !!!

ఊహలన్ని పాటలే కనుల తోటలో. అదే!
తొలి కలల కవితలే మాట మాటలో. అదే!
ఆహా! బ్రహ్మాండం కవిత కవిత పాడు

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని నీ ప్రేమలేఖనే రాసింది హృదయమే
లాలలా లాలాల లాలలాలాలలా లాలాల లాలలా
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాలలా లాలాల లాలలాలాలలా లాలాల లాలలా

నాకు తగిలిన గాయమదే చల్లగా మానిపోతుంది.
అదేమిటో నాకు తెలియదు,ఏం మాయో తెలియదు.
నాకేమీ కాదసలు. ఇది కూడా రాసుకో.
అక్కడక్కడా పువ్వు నవ్వు ప్రేమ అలాంటివేస్కోవాలి.. ఆ...
ఇదిగో చూడు.
నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది.
నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు.
ఉమా దేవి. దేవి ఉమా దేవి.
అది కూడా రాయాలా? అహహా..... అది ప్రేమ.

నా ప్రేమెలా చెప్పాలో తెలియకిదౌతుంటే ఏడుపొస్తుంది.
కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా
బాధ పెడుతున్నాననుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. హహ్హ......
మనుషులర్థం చేసుకునేందుకిది మాములు ప్రేమ కాదు.
అగ్ని లాగ స్వచ్ఛమైనది.

గుండెల్లొ గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే...
ఎంత గాయమైనగానీ నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగు తున్నదీ....
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితె తాళనన్నదీ....
మనుషులెరుగలేరు
మామూలు ప్రేమ కాదు అగ్నికంటె స్వచ్ఛమైనదీ....

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నిలువుమా...
శుభ లాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
నా హృదయమా...  

థాంక్స్ టు http://www.yugandroid.in/songs-lyrics/guna/priyathama.html

ఆదివారం, జనవరి 26, 2014

అందమైన ప్రేమరాణి/ఓ చెలియా

రహమాన్ సంగీతంతో శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు సినిమాకోసం చేసిన "అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే" అనే ఈ ప్రేమపాటలో ప్రేయసి ఎంత అపురూపమో కుర్రకారుకి సులువుగా అర్ధమయేలా చాలా సాధారణమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు రాజశ్రీ. బాలు ప్రభుదేవాల డాన్స్ బిట్స్ తో ఈ పాట చిత్రీకరణ కూడా సరదాగా ఉంటుంది. ఈ చక్కని పాట మీకోసం :-) ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఉదిత్ నారాయణ్, బాలు, ఎస్. పి. పల్లవి

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. 
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే.. 
ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
ఊహూ..భూమికే భూపాలమే...

సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో..
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే...
ఎంగిలైన అమృతమ్ములే..
బోండుమల్లి ఒక్క రూపాయి..
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి..
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు

ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్..
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..
 ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..
 ఊహూ..భూమికే భూపాలమే...

ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే..
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే..
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే..
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే..
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకసం భూమి మారినా మారులే..
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే..
ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని...
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే సినిమాలోని మరో చక్కని ప్రేమ పాట ఓ చెలియా నా ప్రియ సఖియా అది కూడా ఇక్కడ చూడండి. ఆడియో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఉన్నికృష్ణన్

ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ..
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ..
నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ..

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే...

ఈ పూటా .. చెలి నా మాటా .. ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే...
వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే...

ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే
ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ...

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ..
వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ..
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ..

నా ఆశలా ..ఊసులే ..చెవిలోన చెబుతానే...
నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే

ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే...
 

శనివారం, జనవరి 25, 2014

ఆకాశం ఏనాటిదో...

ఇళయరాజా గారి మరో మాజిక్ ఈ ఆకాశం ఏనాటిదో పాట... ఆత్రేయ గారి సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలలో చెప్పలేం. అచ్చమైన ప్రేమ పాటంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రేమ అనేది విధి వ్రాత అనీ ప్రీ డిఫైన్డ్ డెస్టినీ అని సాగే ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం. ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినండి.చిత్రం : నిరీక్షణ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి

లాలలా..లాలాలల..లాలలా..లాలాలల
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ

ల లా లా లా లా...
లా లా లా ఆ..లా లా
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
లాల్లాల.లలలల.లాలాల లలలాల..
లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..

శుక్రవారం, జనవరి 24, 2014

పల్లవించవా నా గొంతులో

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని కనుల ముందుంచేస్తాయి. ఈ మధురగీతం మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే.. నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని.. నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే.. నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని.. నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో..
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా...
పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో..

గురువారం, జనవరి 23, 2014

మధువొలకబోసే..

రామకృష్ణ గారి గళంలో ఆకట్టుకునే గీతం కన్నవారికలలు లోనీ ఈ మధువొలకబోసే గీతం. టిపికల్ సెవెంటీస్ తరహా చిత్రీకరణ ఇపుడు చూస్తే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో శోభన్ బాబు గారు వాణీశ్రీ లమీద తీసిన చిత్రీకరణ బహుశా ఒక ఊపు ఊపి ఉండచ్చేమో :-) ఈపాట కూడా నాకు రేడియోలోనే పరిచయం తరచుగా వినేవాడ్ని. ఈ అందమైన పాట మీకోసం ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.      


చిత్రం : కన్నవారికలలు
సాహిత్యం : రాజశ్రీ ? సినారె
సంగీతం : వి.కుమార్
గానం : రామకృష్ణ, సుశీల

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..
మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

అడగకనే ఇచ్చినచో అది మనసుకందము
అనుమతినే కోరకనే నిండేవు హృదయము
తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము
బహుమతిగా దోచితివి నాలోని సర్వము
మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ..

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

గగనముతో కడలి చెలీ పలికినది ఏమనీ.. 
తలపులకూ వలపులకూ సరిహద్దు లేదనీ..
కుసుమముతో ఆ భ్రమరం తెలిపింది ఏమనీ..
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ..
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే..
హా...
ఈ చిలిపికళ్ళు..
ఆఆఆఆఅ
అవి నాకు వేసే..
హా ఆఅ ఆఅ
బంగారు సంకెళ్ళూ...

బుధవారం, జనవరి 22, 2014

చూపులు కలసిన శుభవేళ..

అక్కినేని నాగేశ్వరరావు గారికి అంజలి ఘటిస్తూ... తను లెక్కకు మిక్కిలిగా చేసిన ప్రేమ చిత్రాలలో ఒక ప్రేమ పాటను ఎన్నుకోవడమనే అతి కష్టమైన పనిని చేయలేక నాకు బాగా ఇష్టమైన ఈ పాటను మీకోసం అందిస్తున్నాను. చలాకీ చిలిపివయసులో ఏఎన్నార్ ఎంత అందంగా ఉంటాడో ఈ పాటలో. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. చిత్రం : మాయాబజార్ 
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి 
గానం : ఘంటసాల, లీల 
 
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము

ఉల్లాసముగా నేనూహించిన
అందమే నీలో చిందెనులే

చూపులు కలసిన శుభవేళ 
 
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే 
చూపులు కలసిన శుభవేళ 

ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే...
 
ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే...
 చెలువములన్నీ చిత్ర రచనలే...
చెలువములన్నీ చిత్ర రచనలే
చలనములోహో నాట్యములే

చూపులు కలసిన శుభవేళ 

శరముల వలెనె చతురోక్తులను
చురుకుగా విసిరే నిజములే...
 
శరముల వలెనె చతురోక్తులను
చురుకుగా విసిరే నిజములే...
ఉద్యానమున వీర విహారమే..
ఉద్యానమున వీర విహారమే
తెలిపెను ఒహో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము

ఎందుకు నీకీ కలవరము

మంగళవారం, జనవరి 21, 2014

మాటే మంత్రమూ

ఈ పాట గురించి ఏం చెప్పగలం, ఇప్పటివరకూ ఈ పాట వినని తెలుగు వాళ్ళుంటారని నేను అనుకోను. ఈ కమ్మని ఇళయరాజా గీతాన్ని మీరూ మరోసారి ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : శీతాకోక చిలుక (1981)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, శైలజ

ఓం శతమానం భవతి శతాయుః పురుష‌
శతేంద్రియ ఆయుష్షేవేంద్రియే ప్రతి తిష్ఠతీ !


మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం


ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం

ఓ ఓ మాటే మంత్రమూ..మనసే బంధమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే

ఎద నా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ 

 ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓఓఓ..లాలలాలలా..లాలలాలలా..
ఊహూహూహూ..ఊహూ.హుహు

సోమవారం, జనవరి 20, 2014

కళకే కళ ఈ అందమూ

ఈ పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన చాలా బాగుంటుంది ఇళయరాజా బాణిలో స్మూత్ గా అలా సాగిపోయే ఈ పాట వినడం నాకు చాలా ఇష్టమైన ఒక మంచి అనుభూతి. ఎంబెడ్ చేసిన వీడియోలో ఆలాపన లేదు అది వినాలంటే ఇక్కడ వీడియో లింక్ లో కానీ లేదా ఆడియోలో ఇక్కడ కానీ వినగలరు.చిత్రం : అమావాస్య చంద్రుడు (1981)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : బాలు

మ్మ్..మ్..మ్..మ్.మ్..
హాఆఆహా దరరారరారర..
దరారరరారర...
కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ

నీలి కురులు పోటీ పడెను .. మేఘమాలతో
కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో.. నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము !

కళకే కళ ఈ అందమూ

పగడములను ఓడించినవి .. చిగురు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు .. మల్లె తొడుగులూ
చూపులో తూపులో .. చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు..

కళకే కళ ఈ అందమూ

తీగెలాగ ఊగే నడుమూ .. ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ .. నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో .. కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము !

కళకే కళ ఈ అందమూ

ఆదివారం, జనవరి 19, 2014

ఇలాగే ఇలాగే సరాగమాడితే

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ పాట కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఎందుకో ఈ పాట నాకు సంగీత సాహిత్యాలంటూ ఎక్కువగా డిసెక్ట్ చేయకుండా ప్రశాంతంగా అలా వింటూ ఉండిపోవడం చాలా ఇష్టం. ఈ చక్కని పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : బాలు, సుశీల 
 
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే


వయసులో వేడుంది
మనసులో మమతుంది
వయసులో వేడుంది
మనసులో మమతుంది
మమతలేమో సుధామయం
మాటలేమో మనోహరం

మదిలో మెదిలే మైకమేమో

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే


కంటిలో కదిలేవు జంటగా కలిశావు
కంటిలో కదిలేవు జంటగా కలిశావు

నీవు నేను సగం సగం
కలిసిపోతే సుఖం సుఖం
తనువు మనసు తనివి రేపునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే

భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోనా ఒకే స్వరం
కలలేమో నిజం నిజం

పగలు రేయి ఏదో హాయి

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే
ఊయలూగునే
ఆహహాహహహ

శనివారం, జనవరి 18, 2014

మంచు కురిసే వేళలో

ఈ పాట ప్రారంభంలో వచ్చే ఫ్లూట్ బిట్ నాకు చాలా ఇష్టం, చిత్రీకరణ సోసోగా ఉంటుంది కానీ పాట సంగీత సాహిత్యాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్లుగా చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టమైన ఈ పాట మీకోసం. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. చిత్రం : అభినందన  (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో

జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…

మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.