సిరివెన్నెల గారి సాహిత్యం, కీరవాణి గారి సంగీతం, చిత్ర గారి స్వరం ఈ పాటకు ఏది ఎక్కువ ప్లస్ అయిందో చెప్పడం అత్యంత కష్టం, విన్న ప్రతిసారీ నా కనులు చెమర్చకుండా మాత్రం ఉండవు. చిత్రీకరణలో ఫైట్స్ తప్పిస్తే మిగిలినదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ పాట వీడియో చూడడం ఇష్టంలేని వారు చిత్రాలతో చేసిన ప్రజంటేషన్ ను ఇక్కడ చూడవచ్చు, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినండి.
చిత్రం : నేనున్నాను(2004)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర
వేణుమాధవా ఆ....
వేణుమాధవా ఆ....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
నువ్వే నడుపు పాదమిది...
నువ్వే మీటు నాదమిది..
నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా.....
రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....
6 comments:
నమస్కారము.
నేను చిన్నప్పుడు మా ఊరి దేవాలయము నుండి ఒక హనుమాను రామాయణం కు సంబదించిన పాట వినేవాడిని.
నాకు సరిగా గుర్తు లేదు.
శ్రీ హనుమన్ నాచే పలికే అని ఇలా ఉంటుంధి.
దయచేసి మీకు తెలిస్తే ఆ భక్తి గీతము వివరాలు తెలుపగలరు.
డౌన్లోడ్ లింక్ ఇస్తే చాల సంతొషము.
కృతజ్ఞతలు
ఆజ్ఞాత గారు ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి. మీరు చెప్పిన లైన్స్ నాకు గుర్తులేవండీ కానీ సుందరకాండ కొంచెం అలాగే ఉంటుంది "శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ" అని.. ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ ఇక్కడ విని చూడండి.
http://www.youtube.com/watch?v=hCzgPw8_KQw
ఈ పాటలో బీజియంస్ చాల, చాలా బావుంటాయి వేణూజీ..
అవును శాంతి గారు థాంక్స్..
Adbhutham mee blog...aanandakaram ee paata..telugu prajalaku mee vantu seva ilaa chesthunnaduku garvangaa vundi mithrama...dhanyavaadalu..
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ చంద్రగారు.. ఇదేదో నేను నా సరదా సంతోషాలకోసం చేస్తున్నానే కానీ తెలుగు ప్రజలకు నేను చేస్తున్న సేవ ఏమీ లేదండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.