సోమవారం, జనవరి 13, 2014

కళ్యాణ వైభోగమూ..

ధనుర్మాసపు చివరి రోజు శ్రీకృష్ణుని కళ్యాణం పాట పోస్ట్ చేద్దామని వెతికితే ఒక్కటీ కనపడదే... సీతారాముల కళ్యాణానికి ఇచ్చినంత ప్రాముఖ్యతని సినిమావాళ్ళు మా కన్నయ్య కళ్యాణానికి ఇవ్వలేదే అని దిగులేసింది. అయితే అపుడే యశోదకృష్ణలోని ఈ పాట ఒక నేస్తం గుర్తుచేశారు. పనిలో పనిగా ఈ చివరి రోజు శ్రీదేవి కృష్ణునిగా నటించిన యశోదకృష్ణ సినిమా కూడా చూసేస్తారని సినిమా వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను.

సాలూరి వారి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ పాట చిత్రీకరణ నాకు బాగా నచ్చుతుంది, కళ్యాణంలోని ఒక్కొక్క ఘట్టాన్ని శ్రీకృష్ణుని అష్టభార్యలలోని ఒక్కో భార్యతో చిత్రీకరించడం బాగుంటుంది. చూడచక్కని ఈ పాటను ఇక్కడ చూడవచ్చు లేదా ఎంబెడ్ చేసిన సినిమా వీడియోలో 2 గంటల 14 నిముషాలకు ఫార్వార్డ్ చేసి చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. లేదా ఇక్కడ బెటర్ క్వాలిటీ డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు.చిత్రం : యశోద కృష్ణ (1975) 
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : ఆరుద్ర/సినారె/కొసరాజు ?
గానం : పి.సుశీల, బి.వసంత
  
కళ్యాణ వైభోగమూ..
ఇలలో కన్నుల వైకుంఠమూ..
శ్రీకృష్ణ కళ్యాణ వైభోగమూ 
చూచిన వారిదే సంతోషం.. 
చూడని తల్లిదే సంతాపం
కళ్యాణ వైభోగమూ..
ఇలలో కన్నుల వైకుంఠమూ..
శ్రీకృష్ణ కళ్యాణ వైభోగమూ

కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలిసతి ఆయె
కోరి వరించిన కోమలి రుక్మిణి గోవిందుని తొలిసతి ఆయె
మణికై వెదుకా భార్యామణిగా మగువ జాంబవతి మనువాడే..
మణికై వెదుకా భార్యామణిగా మగువ జాంబవతి మనువాడే..
సత్యభామ ప్రియ సతిగా జతగా నిత్యము హరిలో నెలకొనయే
సత్యభామ ప్రియ సతిగా జతగా నిత్యము హరిలో నెలకొనయే
కాళిందీ సతి కడు పుణ్య వ్రతమున నీలవర్ణుని నెలతాయే
కాళిందీ సతి కడు పుణ్య వ్రతమున నీలవర్ణుని నెలతాయే

కళ్యాణ వైభోగమూ..
ఇలలో కన్నుల వైకుంఠమూ..
శ్రీకృష్ణ కళ్యాణ వైభోగమూ

మేనయత్త సుత మిత్రవింద హరి ప్రాణప్రియునిగా వరియించే
మేనయత్త సుత మిత్రవింద హరి ప్రాణప్రియునిగా వరియించే
  నాగ్నజితి సతి నందనందనుని అగ్ని సాక్షిగా పెండ్లాడే 
 నాగ్నజితి సతి నందనందనుని అగ్ని సాక్షిగా పెండ్లాడే
లక్షణ కుమారి శుభలక్షణ శోభిత పంకజాక్షుని ఏడవ భార్యాయే..
లక్షణ కుమారి శుభలక్షణ శోభిత పంకజాక్షుని ఏడవ భార్యాయే..
శృతకీర్తి తనయ సుదతి బద్ర మధుసూదను అష్టమ మహిషాయే 
శృతకీర్తి తనయ సుదతి బద్ర మధుసూదను అష్టమ మహిషాయే

కళ్యాణ వైభోగమూ..
ఇలలో కన్నుల వైకుంఠమూ..
శ్రీకృష్ణ కళ్యాణ వైభోగమూ

2 comments:

ఈ ధనుర్మాసం నెల రోజులూ మేము స్వామిని పూజా పుష్పాలతో పూజిస్తే మీరు రాగ మాలికలతో అలంకరించారు..గీతం సమర్పయామి అంటే ఇలా కూడా చేయ వచ్చనిపించింది..అభినందనలు వేణూజీ..

ధన్యవాదాలు శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.