మంగళవారం, జనవరి 07, 2014

రాధికా కృష్ణా రాధికా..

మేఘసందేశం సినిమా కోసం రమేష్ నాయుడి గారి స్వరకల్పన లో ఏసుదాసు గారు సుశీల గారు కలసి గానం చేసిన ఈ జయదేవుని అష్టపది సినిమాలోని మిగిలిన పాటలతో పాటు ఎక్కువగా ఖ్యాతిని పొందడం వలనేమో అసలు ఈ అష్టపదిని తలచుకోగానే నాకు ఈ సినిమాపాటే గుర్తొస్తుంది. ఈగీతం సినిమాలో చూసిన గుర్తు లేదు వీడియో కూడా దొరకలేదు. ఆడియోతో చేసిన ప్రజంటేషన్ క్రింద చూడవచ్చు, ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ లేదా చిమటా లో ఇక్కడా వినండి.



చిత్రం : మేఘసందేశం(1983)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : జయదేవ 
గానం : కె.జె.ఏసుదాసు, పి.సుశీల

రాధికా... కృష్ణా...
తవ విరహే... కేశవా...
స్థన విని హితమపి హార ముదారం
స్థన విని హితమపి హార ముదారం
సా మనుతే కృశ తనురివ భారం
సరసమ సృనమపి మలయజ పంకం
సరసమ సృనమపి మలయజ పంకం
పశ్యతి విశమివ వపుశిసశంకం
రాధికా కృష్ణా రాధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రాధికా


శ్వసిత పవన మనుపమ పరిణాహం
శ్వసిత పవన మనుపమ పరిణాహం
మదన దహన మివ వహతిస దాహం
దిశి దిశి కిరతి సజల కణజాలం
దిశి దిశి కిరతి సజల కణజాలం
నయన నళిన మివ విగళిత నాళం
నయన నళిన మివ విగళిత నాళం
రాధికా కృష్ణా రాధికా


తవ విరహే కేశవా.. కేశవా
రాధికా కృష్ణా రాధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రాధికా

నయన విషయమపి కిసలయ తల్పం
నయన విషయమపి కిసలయ తల్పం
కలయతి విహితహుతాశన కల్పం
కలయతి విహితహుతాశన కల్పం
త్యజతిన పాణితలేన కపోలం
త్యజతిన పాణితలేన కపోలం
బాల శశిన మివ సాయం అలోలం
బాల శశిన మివ సాయం అలోలం

రాధికా కృష్ణా రాధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రాధికా

హరిరితి హరిరితి జపతిసకామం
హరిరితి హరిరితి జపతిసకామం
విరహ విహిత మరణేననికామం
హరీ.... హరీ... హరీ...ఈఈఈ..
హరిరితి హరిరితి జపతిసకామం
విరహ విహిత మరణేననికామం
శ్రీ జయదేవ భణితమితి గీతం
శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పదము పనీతం

రాధికా కృష్ణా రాధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రాధికా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే అష్టపదిని ఘంటసాలు గారు గానం చేశారు. ఇది సినిమాలో కాక ప్రైవేట్ ఆల్బంగా రిలీజ్ చేశారని నాకు తెలిసిన సమాచారం. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ వినండి.


గానం : ఘంటసాల

ఆఆ...ఆఆ..ఆఆ..ఆఆ తారీనా....
రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా ఆఅ...
రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా ఆఅ...
రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా ఆఅ...
రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా ఆఅ... 
రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా ఆఅ...
  
స్థన విని హితమపి హార ముదారం 
సా మనుతే కృశ తనురివ భారం
స్థన విని హితమపి హార ముదారం 
సా మనుతే కృశ తనురివ భారం
సరసమ సృనమపి మలయజ పంకం
సరసమ సృనమపి మలయజ పంకం
పశ్యతి విశమివ వపుశిసశంకం

రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవాఆఆ...
రాధికా కృష్ణా రాధికా..
 
హరిరితి హరిరితి జపతిసకామం
హరే..ఏ.ఏ.. హరే..ఏ... హరే..ఏ..ఏఏఏ...
 హరిరితి హరిరితి జపతిసకామం
విరహ విహిత మరణేననికామం
శ్రీ జయదేవ భణితమితి గీతం
శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పదము పనీతం

రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవాఆఆ
రాధికా కృష్ణా రాధికా
కృష్ణా రాధికా కృష్ణా రాధికా..ఆఆఅ...

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే అష్టపది బాలమురళి గారి గాత్రంలో ఈ క్రింది యూట్యూబ్ వీడియో లో చూస్తూ వినండి ఎంత మధురంగా ఉంటుందో మాటలలో చెప్పలేము విని ఆస్వాదించవలసినదే.. అసలాయన కృష్ణా... అని పిలుస్తుంటే కృష్ణుడు విని పరిగెత్తుకొచ్చేయట్లేదు కదా అని చుట్టూ వెతకాలని అనిపిస్తుంది మనకి.. అంత బాగా పాడారు.
గానం : బాలమురళీ కృష్ణ గారు
 
రాధికా... కృష్ణా... రాధికా...  
తవ విరహే... కేశవా... 

స్థన విని హితమపి హార ముదారం
స్థన విని హితమపి హార ముదారం
సా మనుతే కృశ తనురివ భారం  
కృష్ణా... 

రాధికా... రాధిక.. తవ విరహే కేశవా..

హరిరితి హరిరితి జపతిసకామం..ఆఆ..ఆ..
హరిరితి హరిరితి జపతిసకామం
 విరహ విహిత మరణేననికామం
శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పదము పనీతం 
కృష్ణా...

రాధికా... కృష్ణా... రాధికా... 
తవ విరహే కేశవా..
కృష్ణా... కృష్ణా... కృష్ణా... 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఆగండాగండి ఇంకా పూర్తవలేదు నేటి విందు.. ఇదే అష్టపదిని భానుమతి గారి గళంలో వినకపోతే ఎలా... అమ్మాయి పెళ్ళి సినిమాకోసం భానుమతిగారు స్వీయ స్వరకల్పనతో పాడిన ఈ పాటను ఇక్కడ వినండి. ఈ పాట గురించి కూడా నామాటలలో చదవడం కంటే పాట విని ఆస్వాదించడం ఉత్తమం. వీడియో చూడాలంటే ఇక్కడ నొక్కండి లేదా క్రింది ఎంబెడ్ వీడియోలో 3:32 వరకూ ఫార్వార్డ్ చేసి చూడండి.


చిత్రం : అమ్మాయిపెళ్ళి 
సంగీతం : భానుమతి 
సాహిత్యం : జయదేవ 
గానం : భానుమతి 

రాధికా కృష్ణా రాధికా  
తవ విరహే కేశవా..తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రాధికా  
తవ విరహే కేశవా..తవ విరహే కేశవా

స్థన విని హితమపి హార ముదారం 
సా మనుతే కృశ తనురివ భారం
  
రాధికా కృష్ణా రాధికా  
తవ విరహే కేశవా..తవ విరహే కేశవా

దిశి దిశి కిరతి సజల కణజాలం
నయన నళిన మివ విగళిత నాళం 
నయన విషయమపి కిసలయ తల్పం
కలయతి విహితహుతాశన కల్పం
రాధికా కృష్ణా..
కృష్ణా...కృష్ణా...కృష్ణా...

రాధికా కృష్ణా రాధికా  
తవ విరహే కేశవా..తవ విరహే కేశవా

హరిరితి హరిరితి జపతిసకామం
విరహ విహిత మరణేననికామం
శ్రీ జయదేవ భణితమితి గీతం .. ఆఆఆఆ..ఆ..
శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పదము పనీతం
 

రాధికా కృష్ణా..
కృష్ణా...కృష్ణా...కృష్ణా...

రాధికా కృష్ణా రాధికా  
తవ విరహే కేశవా.. తవ విరహే కేశవా 
తవ విరహే కేశవా

7 comments:




ఒకే పాటను సుప్రసిద్ధులైన 5 గురు గాయనీ గాయకులు పాడినది వినిపించారు.అన్నీ బాగున్నాయి.ఎంచడం కష్టం.నా favourite మాత్రం ఘంటసాల గారు పాడినదే.ఆయన ఇంకా మరికొన్ని జయదేవ అష్టపదులతో కలిపి ఈ ఆల్బం ఇచ్చారు.అందువలననే కాబోలు అన్ని చరణాలు పాడలేదు.ఎవరు ఏ రాగంలో పాడారో తెలియజేయగలరా?

బాగుందండి .ఐదింటిలో మూడు ఇదివరకు విన్నవి.రెండు ఇప్పుడు వింటున్నాను.థాంక్స్ వేణు గారు .అన్నట్టు నా పూర్తి పేరు రాధికా కృష్ణ అండి . చిన్నప్పుడు ఈ పాట పాడి చాలా మంది ఏడిపించేవారు:)నానమ్మ పేరులో కృష్ణ ఈ కృష్ణ .రాధిక (నాని)

If you consider non-Telugu songs also on lord Krishna, "Krishna nee begane baaro" is an excellent Carnatic number sung by various artists so far. The most recent one is by Karthik for the album "Music I like"

$iddharth

ధన్యవాదాలు కమనీయం గారు, నాకు పాటలు విని ఆనందించడమే తప్ప స్వరాలూ రాగాలూ తెలియవండీ. మిత్రులెవరైనా చెప్తారేమో చూద్దాం. నాకు దదాపు అన్ని వర్షన్స్ కూడా దేనికదే అన్నట్లు అనిపించిందండీ.

థాంక్స్ రాధిక గారు మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు :-)

థాంక్స్ సిద్దార్థ్ గారు కృష్ణానీబేగనే ఫ్యూజన్ కొలోనియల్ కజిన్స్ పాడినది నా ఫేవరెట్ అండీ. కార్తీక్ పాడినది వినలేదు. ప్రస్తుతం తెలుగుకు మాత్రమే ప్రాముఖ్యత ఇద్దామనుకుంటున్నానండీ మీరు చెప్పిన పాట ఇతర వర్షన్స్ త్వరలో పోస్ట్ చేస్తాను.

కనుల ముందు కన్నయ్యని వుంచారు..ధాంక్యు..బట్ బాలమురళీ కృష్ణగారిదే మరో ఓల్డ్ వెర్షన్ ఈ పాటది వుంది..నాకెక్కడా దొరకలేదు..మీ వల్లయితే..

థాంక్స్ శాంతి గారు.. బాలమురళి గారి పాట ఈ ఒక్క వర్షన్ మాత్రమే దొరికిందండీ మీరడిగిన వర్షన్ దొరికితే తప్పక పోస్ట్ చేస్తాను.

దర్బారీ కానడ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.