సుశీల గారు పాడిన మరో అద్భుతమైన కన్నయ్య పాట ఇది. నాట్య ప్రధానమైన గీతం కావడంతో సాహిత్యానికీ సంగీతానికీ కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ చేసినటువంటి ఈ పాట వింటూ ఒక్కసారైనా కాలుకదపని వ్యక్తి ఉండరేమో అనిపిస్తుంది మీరూ విని ఆస్వాదించండి. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల
జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ
కలికి చూపులతోనే చెలులను కరగించి..
కరకు చూపులతోనే అరులను జడిపించి..
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర నరవర సిరిదొర
జోహారు శిఖిపింఛ మౌళీ
నీ నాదలహరిలో నిదురించు భువనాలు...
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగ యుగాల దివ్యలీల నెరపిన
అవతారమూర్తి ఘనసారకీర్తి
జోహారు శిఖిపింఛ మౌళీ
చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో
4 comments:
super song venujii :-)
థాంక్స్ తృష్ణ గారు :)
కమలా లక్ష్మణ్ గారు, వైజయంతి మాల, హెమ మాలిని, యల్.విజయ లక్ష్మి..ఇలా మన అలనాటి తారల లో, అద్భుతమైన నర్తకీమణులందరికీ మీ పాటతో మా జోహారులు..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.