పార్దసారధి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పార్దసారధి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2020

అల్లో నేరేడు కళ్ళ దాన...

శీను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
  

చిత్రం : శీను (1999)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : పార్థసారధి, చిత్ర 

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా 
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా 
అల్లుకుంటూ ఒళ్ళో లేనా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

దాయీ దాయీ అనగానే 
చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే 
పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక 
మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా 
చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని 
కంటిపాప ఇంటిలోన ఏరికోరి 
చేరుకున్న దీపమా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా

అన్నెం పున్నెం లేని వాడని 
అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని 
అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో 
మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో 
తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో 
సంకురాత్రి పండగంటి సందడల్లే 
చేరుకున్న రూపమా

అల్లో నేరేడు కళ్ళ దాన 
ప్రేమ వళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన 
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా 
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా 
అల్లుకుంటూ ఒళ్ళో లేనా 
 

మంగళవారం, సెప్టెంబర్ 08, 2020

బంగారం తెచ్చి...

ఇద్దరు మిత్రులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : పార్థసారధి, చిత్ర

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాల బొమ్మ గీయమ్మ..
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాల బొమ్మ గీయమ్మ..
ఇన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి 
అరుదైన రూపం ఈ బొమ్మ
ఫించం కుంచెగ మారనీ 
మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ 
వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . 

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాలబొమ్మ గీయమ్మ..

జో లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనె పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు 
మనసంత నవ్వుల నెలవు ఓ 
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి 
అందాలబొమ్మ గీయమ్మ 

అడగక ముందే అన్నీ చేసి సేవకుడివనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడనీ మధురిమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .

మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై 
అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధిలో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం 
ఉందని చూపిన నేస్తమా 
 

మంగళవారం, ఆగస్టు 20, 2019

విన్నపాలు వినవలే...

అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

గురువారం, సెప్టెంబర్ 27, 2018

మనసిచ్చిన మారాజే...

సంక్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి
గానం : పార్థసారధి, మురళి

సూర్యకాంతి పడి మెరిసే అరవిందమీ వదనం
వేల మెరుపులొకసారి మెరిసేటి ద్విగుణ తేజం
కోటి చందురుల చల్లదనాలు చిందే కనులు
సర్వ లోకముల పూజలు పొందే సీతారామా
పుణ్య చరిత శుభ నామా సీతామనోభిరామా

మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళా
మరుమల్లె బుగ్గలో సిగ్గు సింధూరమాయెనే
కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా
మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చెనే


అన్నయ్య మనసు తోటలో పారిజాతమై
అనురాగ పరిమళాలె పంచింది సొంతమై
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ
వచ్చింది ఇంటికి తన జంట గూటికి
చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక


సిరివెన్నెలంటి చెలిమిని మాకుపంచగా
నెలవంక ఇలకు చేరెనా చిన్న వదినగా
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే
  

గురువారం, నవంబర్ 10, 2016

విన్నపాలు వినవలె...

 
క్షీరాభ్ది ఏకాదశి సంధర్బంగా ఆ శ్రీనివాసుడ్ని స్మరించుకుంటూ అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

మంగళవారం, ఫిబ్రవరి 24, 2015

కుడికన్ను అదిరెనే...

స్వరాభిషేకం సినిమా కోసం విశ్వనాథ్ గారు స్వయంగా రాసిన ఈ పాట విన్నారా.. అచ్చం అన్నమయ్య కీర్తనలా అనిపించే ఈ గీతానికి అంతే అద్భుతంగా స్వరాలందించినది పార్ధసారధి గారు. ఈ చిత్రానికి సంగితం అందించినది విద్యాసాగర్ గారు అయినప్పటికీ ఈ పాట ఒక్కటీ మాత్రం పార్ధసారధి గారు కంపోజ్ చేశారుట. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : పార్థసారధి (ఈపాటకు మాత్రమే)
సాహిత్యం : కె.విశ్వనాథ్
గానం : బాలు, సునీత

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా... ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ 
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్...
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే...ఏ.. ఆ మేను...
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.