బుధవారం, ఏప్రిల్ 21, 2021

అంతా రామమయం...

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడిని స్మరిస్తూ శ్రీరామదాసు సినిమాలోని ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామదాసు, పోతన
గానం : బాలు 

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు

అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. 
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.