గురువారం, ఏప్రిల్ 08, 2021

నీ చూపే నాకు...

ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ’99సాంగ్స్’ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : 99సాంగ్స్ (2021)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్  
సాహిత్యం : రాకేందు మౌళి 
గానం : సిధ్ శ్రీరాం

ఓఓ..! నీ చూపే నాకు ఆయుషే పోసే
దూరమైతే అది ఏం కానే… ఏం కానే
ఓఓ ఓ..! నీ నవ్వు నన్ను బానిసే చేసే
స్వేచ్ఛే ప్రసాదిస్తే ఏం కానే… ఏం కానే

నీ తలపులతోనే ఓ సఖియా
నారోజే మొదలవునే సఖియా
ఇక పగలే సెగలే నా సఖియా, ఆ ఆఆ
సఖియా చెలియా రా… ఆ ఆ ఆఆ

నా గళము స్వరము నీవేగా
నా గానము ధ్యానము నీవేగా
నా బతుకున భావము నీవేగా, ఆ ఆఆ
నీవే లేక నే లేనే… ఏ ఏఏ ఏ

ఆశైనా ఊసైనా శ్వాసైనా… నీ ధ్యాసే నే
మదిలో నీ గురుతేగా నను నడిపించి మోసేలే
ఓ ఓ.. నీ స్నేహములోనే తేలే నా ప్రాణం
ముంచేసి పోతే ఏం కానే… ఏం కానే

నీ కలలే పూని కళ్ళల్లో
కథగా మిగిలే కల్లల్లో
కలకాలం చితిలో నా సఖియా, ఆ ఆఆ
నీవే లేక నే లేనే… ఏ ఏఏ ఏ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.