రాహుల్ నంబియార్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాహుల్ నంబియార్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, జులై 22, 2020

వానా వానా వెల్లువాయే...

రచ్చ సినిమా కోసం గ్యాంగ్ లీడర్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వానావానా వెల్లువాయే పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గ్యాంగ్ లీడర్ (2012)
సంగీతం : బప్పీలహరి
రీమిక్స్ : మణిశర్మ
సాహిత్యం : భువనచంద్ర 
గానం : రాహుల్ నంబియార్, చైత్ర  

ఇక ఈ పాట ఒరిజినల్ వర్షన్ లో చిరంజీవి విజయశాంతి డాన్స్ చేయలేదు సింపుల్ గా పాటతో ఆడుకున్నారు అని అప్పట్లో టాక్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం : బప్పీలహరి
సాహిత్యం : భువనచంద్ర 
గానం : బాలు, చిత్ర 

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకులా చలికి ఒణుకుతూ 
చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే 
కొండకోన తుళ్లిపోయే

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై 
పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 
 

శనివారం, మార్చి 28, 2020

జూన్ జూలై ఒడిలో పూసే...

కళాశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళాశాల (2009)
సంగీతం : జాషువా శ్రీధర్    
సాహిత్యం : భువనచంద్ర
గానం : రాహుల్ నంబియార్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే
మొగ్గే కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

ఊరేదో పేరేదో చూడమే
కన్నీళ్ళు తుడవడం మరువమే
నీ బాధ చూడలేక మనసు ఆగలేక
కురియు వర్షమే చెలిమిరా
కాలేజీ ఇచ్చే కానుక
కడదాక నిలిచే స్నేహమే
ఇది పాఠాల నిలయమైన
టీచింగే మధురమైన మాటలు
మిగిలేటి బంధమే
ఎన్నెన్నో అల్లరులే చేస్తాం
ఎన్నెన్నో స్వప్నాలే కంటాం
ఎన్నెన్నో గాయాలను చూస్తాం నేస్తమా
ఎన్నెన్నో పాఠాలను చదివి
ఎన్నెన్నో నీతుల్నే నేర్చి
ఎన్నెన్నో గొడవల్నే పడినా
ఎన్నెన్నో నిరసనలే చేసిన
గుండెల్లో స్నేహముండునోయ్

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా

విత్తుల్లో దాగిన మొక్కనీ
వాన మొలకెత్తించెనే
ఎదలో మరుగుపడ్డ
మధుర భావనని
స్నేహమే వెలికి తీయులే
ఈనాటి మనమధ్య చెలిమిని
కాలేజీ నీడలు తెలుపులే
ఈ కాలేజీ బెంచ్ లన్నీ
కాంపౌండు గోడలన్నీ
మరల కథలు వినిపించులే
హాలిడేస్ ఇచ్చేశారంటే
ఇళ్ళల్లో మనసుండదు అంటా
మళ్ళీ కలిసే దాకా ఆగమే
ఒంటరిగా క్షణమే యుగముగా
మిస్సయ్యే ఊహలో నిట్టూర్పులు రాగా
అందరమూ ఒకటయ్యే దాకా
నవ్వుల్నీ చిందించే దాకా
గుండెల్లో బెంగ తగ్గదే

జూన్ జూలై ఒడిలో పూసే
పువ్వేరా స్నేహం
రాదారి పక్కన విచ్చే మొగ్గే
కదరా మన స్నేహం
గుండెల్లో మెదిలే
జ్ఞాపకమేరా ఈ స్నేహం
లోకంలో పూసే పూలన్నీ
ఒక రోజులో వసి వాడునురా
ఎన్నడు అరె ఎన్నడూ
విడిపోనిదే మన స్నేహమురా  
 

బుధవారం, మార్చి 27, 2019

ఓహో ఓ అబ్బాయి...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
సంగీతం : మిక్కీ జె మేయర్
రచన : అనంత శ్రీరామ్
గానం : రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా


సోమవారం, జులై 30, 2018

నేను నీ బలమేనులే...

బలం (కాబిల్) చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బలం (కాబిల్) (2017)
సంగీతం : రాజేష్ రోషన్   
సాహిత్యం : రాజశ్రీ సుధాకర్ 
గానం : రాహుల్ నంబియార్, వందన శ్రీనివాసన్

నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా

నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమ
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలోనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచేనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా

సరదాలతో సందళ్ళతొ ఈ లోకమే మరిచేములే
ఓ...అనురాగమే అనుబంధమై మన జీవితం సాగాలిలే
నా గుండెలో నీ కోసమే నునువెచ్చని చోటుందిలే
నాలో నీవు నీలో నేను కొలువుందాములే

నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నవ రాగమా
స్వప్నాలలో ఏముందిలే దోసిలిలోనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనే
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా

ఏనాడు చేసిన పుణ్యమో నిజమైనదే నేడు నా కల
నే కోరుకున్న నా దైవమూ నా తోడుగా నడిచేనిలా
తన వన్నెలే సిరి వెన్నెలై నా కోసమే వెలిసిందిలా
ఎన్నడు వీడని జంటై మేము కలిసుంటామిలా

నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమా
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా


శనివారం, మే 19, 2018

గ..ఘ‌..గ..ఘ‌..మేఘ..

ఛల్ మోహన రంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛల్ మోహన రంగ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : రాహుల్ నంబియార్

గ..ఘ‌..గ..ఘ‌..మేఘ
క‌నులే చెప్పే కొత్త సాగా
గ..ఘ‌.. గ..ఘ‌..మేఘ
నింగే మ‌న‌కు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేసావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా


ఇల్లాగే ఇల్లాగె ఇల్లాగే
ఏటేపో వెళ్ళాలి అంటూ మనసు లాగే
అల్లాగే అల్లాగె అల్లాగే
అంటూనే లేదంటూ ఏది ముందులాగే
ఇవ్వాళే ఇవ్వాళే ఇవ్వాళే
కన్నుల్లో కలల్ని నువ్వు పైకిలాగే

సరేలే సరేలే ఘ అన్నానులే మేఘా

గ..ఘ‌..గ..ఘ‌..మేఘ
క‌నులే చెప్పే కొత్త సాగా
గ..ఘ‌.. గ..ఘ‌..మేఘ
నింగే మ‌న‌కు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేసావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా

బేబీ ఎవిరిడే ఐ ప్రామిస్
ఐ విల్ మేక్ యువర్ డే  మచ్ బెటర్
ఐ ప్రామిస్ ఐ వోంట్ ట్రీట్ యు లైక్ దెమ్ అథర్స్
ఐ ప్రామిస్ ఐ వోంట్ మేక్ యు థింక్ అఫ్ ది రథర్
ఈఫ్ యు లుకింగ్ ఆట్ ది స్కై థాట్స్ అప్ ఎబోవ్
ది మూన్ అండ్ ది స్టార్స్ అర్ ది సింబల్ అఫ్ మై లవ్
జస్ట్ కాల్ మీ బై మై నేమ్
వెన్ యు నీడ్ మీ మై డియర్
అండ్ ఐ విల్ బి రైట్ థెర్
టూ మేక్ యువర్ ప్రాబ్లెమ్స్ డిసప్పీర్


గమ్మత్తులో ఊగామా
తుళ్ళింతలో తేలామా
ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసెనా
హఠాత్తుగా ఎదలోనా హడావిడే పెరిగేనా
అమాంతమూ ఈ చిరునవ్వులకే అర్ధం దొరికెనా

ఓఓ ఓఓ ఓఓ
ముందే మలుపు ఉందో
ఓఓ ఓఓ ఓఓ
ఘ అన్నానులే మేఘా


శనివారం, ఫిబ్రవరి 17, 2018

బూచాడే బూచాడే...

రేసుగుర్రం చిత్రం లోనుండి ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రేసుగుర్రం (2014)
సంగీతం : తమన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్, శ్రేయ ఘోషల్

బూ… బూ… బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే డిస్కనెక్ట్ కాడే..
బూ… బూ… బూ… బూ… బూ… బూ…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపొతే దిస్కనెక్ట్ కాడే..
రేసు గుర్రం లాంటోడే రివర్స్ గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే

బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే.
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే దిస్కనెక్ట్ కాడే..

బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే… చాడే… చాడే… చాడే… చాడే…
ఓ సాల సాల సాలా నీ చూపె మస్సాలా
ఓ సాల సాల సాలా నీ ఊపె మిస్సైలా
ఓ నిక్కిన జింకల నక్కిన దిక్కుల
లెక్కలు బొక్కలు తేల్చేయరా
చిక్కిన చక్కని చెక్కర ముక్కను
వక్కలు చెక్కలు చేసెయరా
తూ ఆజా రే తూ ఆజా రే
ముఝే లేజారే సాలా…

బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే

బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
కిరాకోడే గిరాకోడే బీ కేర్ ఫుల్ అంటాడే బూచాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
సునామీకే బినామోడే బోటే తెత్తాడే…
బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే… బూచాడే.. 

 

శనివారం, అక్టోబర్ 29, 2016

వెండి చీర చుట్టుకున్న...

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కృష్ణగాడి వీర ప్రేమ గాథ 
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : రాహుల్ నంబియార్, సింధూరి విశాల్

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా
వచ్చివాలి చంపమాకు నన్నిలా
చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా
మచ్చుకైన విచ్చుకోదు నవ్విలా

అబ్బ ఇంత కోపమా
దగ్గరుండి దూరమా
తియ్యనైన కొరివి కారమా
పదును లేదు సులువు కాదు
మలుపులేని నలుపు దారిదే

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి ఉరిమి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...

బుల్లి విలనుతో పాటు
పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి బూతం వుంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపడం లేటు
లేని పోనిది డౌటు
చిన్ను బుజ్జికావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారమా
పొగుడుతుంటే నేరమా
లైఫు టైము తెగని బేరమా
పొగడమాకు వినను నీకు
లొంగనింక బేరమాడకు

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...

పెళ్ళి తంతుకే మేము పెద్ద మనుషులం కామ?
పక్కనున్న లెక్కలేదు మేము హర్ట్ లే
బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా మీరు
బుంగ మూతి పెట్టుకోము మేము హర్ట్ లే

చిన్ని చిన్ని నవ్వులం
చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటే విడిచిపోములే
బ్లాక్ రోడ్ రెడ్ కార్
పైగా మేము బంపర్ ఆఫర్

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి ఉరిమి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...


గురువారం, మార్చి 19, 2015

చల్లగా ఒక చినుకులా...

రాజా రాణి సినిమాలోని ఈ పాట చాలా బాగుంటుంది. నాకు నచ్చిన పాటను మీరూ చూసీ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


 
చిత్రం : రాజా రాణి (2014)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : అనంత శ్రీరామ్ 
గానం : రాహుల్ నంబియార్, క్లింటన్, మేఘ

చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగేనే హల్లా
నీ కనుపాపై నే చేరినా పిల్లా
నీ కలలాగ నే మారినా పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ

ఓసి మడత కాజ నా మామిడి తండ్రా నవ్వి సంపొద్దే 
నా మోట బావిలో నీ నాటు వోడని అట్టా నడపొద్దే 
కళ్ళేవి పడకుండా కళ్యాణం చేద్దామా
కల కాలం ఉందామా…

కొంచెం చూడు మరి కొంచెం నవ్వు మరి
అంటూ నా కనులు హయ్యయ్యో నను తిట్టే
మండు వేసవిలో పండు వెన్నెలలు
చల్లుతుంది మది ఏదేదో పిచ్చి పట్టి
గాలివాన వలనే తోసినావు నాదు ఎదనే
నీ వల్లే అయ్యానే దారాన్నే
తెంపేసిన గాలి పటం
అమ్మాయి అమ్మాయి
నే పడితే చేరాలి నీ పాదం

నీ కనుపాపై హో..నే చేరినా పిల్లా
నీ కలలాగ హా..నే మారినా పిల్లా

చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగెనే హల్లా

సుందరి కిన్నరి మణి కొలుసా 
తరి వళకిరు కిలుక్కిరుక్కా
తరి మిన్నారం చెరు పొన్నారం
ఇదు మధుర మధుర కరింబో..కళ వేణీ మృదు పాణీ 
నిన్ హృదయ వనియలన్ గానం
స్వరమాయే జతిఆయే 
ఇన్ నుణరి మరియ నాన్ మొహం

ప్రేమ తాకి జ్వరమేదో సోకి మరి ఆవిరైతి 
నువు ముద్దిచ్చి తగ్గించు
కోపగించు కొను వేళలోన కనుపాప దొరకుండు
కోపాన్నే రప్పించు 
ఉసురు తీయు సొగసా నీ నీడకింత చలవా 
బతుకంతా బ్రతిమాల్నా విడిపోని మత్తేదో చల్లావే 
నదులైనా కడలైనా ఆపలేనీ నిప్పల్లె చేరావే

నీ కనుపాపై హో నే చేరినా పిల్లా
నీ కలలాగా హా నే మారినా పిల్లో
హే హే ఓ ఓ ఓ ఓ


శనివారం, ఫిబ్రవరి 14, 2015

ప్రేమికులరోజు శుభాకాంక్షలు...

ప్రేమికులందరికీ ప్రేమికులరోజు శుభాకాంక్షలు. ఈ స్పెషల్ డే సందర్బంగా దూకుడు చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ప్రేయసి తొలిసారిగా కనిపించిన క్షణాలను అపురూపంగా గుర్తుంచుకుని ఆ క్షణం నుండీ తన జీవితం ఎంత మారిపొయిందో దానిపై ఆ అమ్మాయి ప్రభావం ఎంత ఉందో ఎంతా బాగా చెప్తున్నాడో ఈ ప్రేమికుడు మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దూకుడు (2011)
సంగీతం : ఎస్. ఎస్. తమన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రాహుల్ నంబియార్

గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40..
తొలిసారిగా చూసానే నిన్నూ..ఊ..
చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి..
నిదరే పోనందే నా కన్నూ..ఊ..
 
గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40..
తొలిసారిగా చూసానే నిన్నూ..ఊ..
 
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే..
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేసావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర సున్ తో జర జానే జానా..
దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన..
సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా.. హసీనా..

 
నువ్ వాడే పెర్ఫ్యూమ్.. గుర్తొస్తే చాలే..
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం.. నీతో నిండిందే..
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమెట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో..
అన్నట్టుందే.. క్రేజీగా ఉందే
నింగీ నేల తలకిందై కనిపించే
జాదూ ఏదో చేసేశావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర సున్ తో జర జానే జానా..
దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన..
సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా
ఐ లవ్ యూ బోలోనా.. హసీనా..

 
గడియారం ముళ్ళై తిరిగేస్తున్నానే..
ఏ నిమిషం నువ్వు 
ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే..
నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడుంటూ
డైలీ రొటీన్ టోటల్ గా నీ వల్లే చేంజ్ అయ్యింది..
చూస్తూ చూస్తూ.. నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంటు కుర్రాణ్ణి
అవారా లా మార్చేసావే..ఓయే.. 

ఓం శాంతి శాంతి అనిపించావే
 
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా..
చెలియలా చేరిపోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా..
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం.. నా సర్వం.. నీకోసం..



~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


అందమైన అనుభవం చిత్రం కొసం ఎమ్మెస్ విశ్వనాథ్ గారి స్వరకల్పనలో బాలు జానకి గారు గానం చేసిన ఈ పాట చూడండి. బాలచందర్ గారు సింగపూర్ అందాలను ప్రేమికుల మధ్య అందమైన క్షణాలను చూపిస్తూ చాలా బాగా చిత్రీకరించారీ పాట. ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్ని మాటలు మాత్రం సరిపోతాయ్ అనుకున్నారో ఏమో అందమైన అనుభవం, యాన్ ఎఫైర్ టు రిమెంబర్ అన్నమాటలతోనే స్వరాలొలికించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


శనివారం, నవంబర్ 22, 2014

ఇలా ఎంత సేపు...

సిరివెన్నెల గారి పాటలలో నాకు చాలా నచ్చే పాట ఇది. ముఖ్యంగా రెండో చరణం చాలా అద్భుతంగా రాశారనిపిస్తుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శశిరేఖాపరిణయం (2008)
సంగీతం : మణిశర్మ, విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాహుల్ నంబియార్

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన భ్రాంతివో
కలవనిపించిన కాంతవో .. ఓ ఓ ఓ
మతి మరపించిన మాయవో
మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా
ఎదో .. గుండెలోన కొంటె భావనా
అలా .. ఉండిపోక పైకి తేలునా


శుభలేఖలా .. నీ కళా .. స్వాగతిస్తుందో
శశిరేఖలా .. సొగసెటో .. లాగుతూ ఉందో
తీగలా .. అల్లగా .. చేరుకోనుందో
జింకలా .. అందకా .. జారిపోనుందో
మనసున తుంచిన కోరికా
పెదవుల అంచును దాటకా
అదుముతు ఉంచకె అంతగా .. ఓ ఓ ఓ
అనుమతినివ్వని ఆంక్షగా
నిలబడనివ్వని కాంక్షగా
తికమక పెట్టకె ఇంతగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

మగపుట్టుకే .. చేరనీ .. మొగలి జడలోనా
మరుజన్మగా .. మారనీ .. మగువ మెడలోనా హో
దీపమై .. వెలగనీ .. తరుణి తిలకానా
పాపనై .. ఒదగనీ .. పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగా
నా వలపులు పారాణిగా
నడిపించిన పూదారిగా .. ఓ ఓ ఓ
ప్రణయము విలువే కొత్తగా
పెనిమిటి వరసే కట్టగా
బతకన నేనే తానుగా .. ఓ ఓ ఓ

ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినా
సరే .. చాలు అనదు కంటి కామనా

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.