బుధవారం, మార్చి 27, 2019

ఓహో ఓ అబ్బాయి...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
సంగీతం : మిక్కీ జె మేయర్
రచన : అనంత శ్రీరామ్
గానం : రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా


2 comments:

బ్యూటిఫుల్ మూవీ..యెన్నిసార్లు వచ్చినా సరదాగా చూడాలనిపిస్తుంది..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.