మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరకూ శుభాకాంక్షలందజేస్తూ తూర్పూ పడమర చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం: తూర్పుపడమర (1976)
గానం: పి.సుశీల
సాహిత్యం: సినారె (సి.నారాయణరెడ్డి)
సంగీతం: రమేష్ నాయుడు
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే
నవ వేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికీ మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ...ఆఅ.ఆఆఆఆఅ
కాలమనే గాలానికి చిక్కీ
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే
కలల వెలుగులో కన్నీరొలికే
2 comments:
వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ..థాంక్యూ ఫర్ పోస్టింగ్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.