గురువారం, మార్చి 21, 2019

రంగేళీ హోలీ...

హోలీ సందర్బంగా మిత్రులందరకు శుభాకాంక్షలందచేస్తూ చక్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చక్రం (2005)
సంగీతం : చక్రి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్

కృష్ణ కృష్ణ కృష్ణా...
హే రామ రామ రామా
చిన్నా పెద్దా అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
పండుగ చేయ్యలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
తీపి చేదు అంతా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్
పంచి పెట్టాలంటా
జమ్ చిక చిక జమ్ జమ్ చిక చిక జమ్ హేయ్

హేయ్ రంగేళి హోలీ హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలీ
రవ్వల రించోలీ సిరిదివ్వెల దీవాళీ

ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహుర్తం ఉంటుందా

జీం తరత్తా తకథిమి, జీం తరత్తా (2)

హేయ్ రంగేళి హోలీ హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వలరించోలీ సిరిదివ్వెల దీవాళీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలీ


తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే
ప్రతిరోజు వసంతమవుతుంది
గడపలు అన్ని జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం
నిత్య భాద్రపదమవుతుంది
లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగజేసే జాగరణే... శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చె రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగాలేదా

రంగేళి హోలీ హంగామా కేళీ

తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై
నరుడికి గీత పదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయ్యింది
మనలో మనమే కలహించే మనలో మహిషిని తలతుంచి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటైంది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

గొబ్బియలో... గొబ్బియలో (2)

ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వునువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళు ఉంటామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే 

 

2 comments:

బిలేటెడ్ హాపీ హోలీ వేణూజీ..

థాంక్స్ శాంతి గారూ.. మీక్కూడా హోలీ శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.