ఆదివారం, మార్చి 10, 2019

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే...

ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : దేవీ శ్రీ ప్రసాద్

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక
కాలింగ్ మారినా
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే


మ్మ్.. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
లాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే


పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే
ఫ్రుటీ ల నుండి బీరు లోకి మారినా
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే 


3 comments:



నిక్కరుని వీడి జీన్సులోనికి, జిలేబి,
మారుపడ, సైకిలును వీడి మాంఛి బైకు
నెక్క, ఫ్రెండన్న మాటలో నెమ్మి మారు?
మరణమే లేనివారలు మనుజు లెల్ల
ఫ్రెండు షిప్పున సాగేటి బ్రేండు బోసు :)


జిలేబి

ప్రేమ, స్నేహం..ఎవ్వర్ గ్రీన్ యెండ్ యూనివర్సల్ కదా..

అంతేగదండీ మరి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.