మంగళవారం, డిసెంబర్ 31, 2013

పిలిచిన మురళికి వలచిన మువ్వకి

హాస్యరస ప్రధానమైన చిత్రాలకు స్థిరపడకముందు జంధ్యాల గారు చేసిన చక్కని కథాచిత్రం ఆనందభైరవి ఆయన సంగీతాభిరుచికి నిదర్శనం చూపే పాటలు ఈ సినిమా సొంతం. రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినిమాలో ఎన్నో మంచిపాటలు ఉన్నాయి అందులే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. మీరూ చూసి వినీ ఆనందించండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం: ఆనంద భైరవి (1984)
సంగీతం: రమేష్ నాయుడు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పిలిచిన మురళికి వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం అది ఆనందభైరవి రాగం

మురిసిన మురళికి మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం మది ఆనందభైరవి రాగం


కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే
కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే
మనసే మురళీ ఆలాపనలో.. మధురానగరిగ తోచే
యమునా నదిలా పొంగినదీ.. స్వరమే వరమై సంగమమై

మురిసిన మురళికి.. మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందభైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే
ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో వుంటే.. ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పోయినదీ.. లయలే ప్రియమై జీవితమై..

మురిసిన మురళికి.. మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం


పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందభైరవి రాగం 

సోమవారం, డిసెంబర్ 30, 2013

నువ్వు వస్తావనీ బృందావని

చక్రవర్తి గారి ఆణిముత్యాలలో మల్లెపువ్వు ఒక మరుపురాని ఆల్బం, ఇందులో ఎన్నో మంచి పాటలున్నాయి వాటిలో ఈ పాట ఒకటి. సాహిత్యం ఆరుద్ర గారా వేటూరి గారా అనే ఓ చిరు సందేహం ఉంది తెలిసినవారెవరైనా కామెంట్స్ లో చెప్పగలరు. ఈ మధురగీతం మీకోసం.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గానం : వాణీ జయరాం
రచన : ఆరుద్ర/వేటూరి

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..
ఓ..ఓ..ఓ..గిరిధర.. మురహర..
రాధా మనోహరా..ఆఆ..ఆఆ..ఆఆ.

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. 
క్రిష్ణయ్యా.. రావయ్యా..

నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా..
మమతల దీపాలు వెలిగించాను 
మమతల దీపాలు వెలిగించాను 
కుశలము అడగాలని.. పదములు కడగాలని..
కన్నీటి కెరటాలు తరలించాను..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా 
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..
వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..ఓ..కృష్ణయ్యా..

 
నీ పద రేణువునైనా.. పెదవుల వేణువునైనా..
బ్రతుకే ధన్యమని భావించానూ..
బ్రతుకే ధన్యమని భావించానూ....
నిన్నే చేరాలని.. నీలో కరగాలని..
నా మనసే హారతి గా వెలిగించాను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
ఒకసారి దయచేసి దాసిని దయచూడరా..
ఒకసారి దయచేసి దాసిని దయచూడరా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా...

ఆదివారం, డిసెంబర్ 29, 2013

వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా..

వంశవృక్ష అనే కన్నడ నవల ఆధారంగా బాపూగారి దర్శకత్వంలో వచ్చిన "వంశవృక్షం" సినిమాలోని ఈ "వంశీ కృష్ణా యదు వంశీ కృష్ణా" పాట చాలా బాగుంటుంది. సినారేగారు తేలికైన పదాలతో చాలా అందంగా రాస్తారు ముఖ్యంగా రెండో చరణంలో ప్రాణులంతా వేణువులై నీరాగాలే పలుకుతున్నారని అన్నీ నీలీలలే అని అన్నా ఆటగా రణమును నడిపిన కృష్ణ అనీ పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా అని అన్నా కృష్ణతత్వాన్ని ఎంత సింపుల్ గా చెప్పారని అనిపిస్తుంది. ఈ పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు లేదా కింది ప్లగిన్ లో వినవచ్చు. వీడియో దొరకలేదు మీకు కనిపిస్తే కామెంట్స్ లో పంచుకోగలరు.



చిత్రం : వంశవృక్షం(1980)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, శైలజ

వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున
నిలిచింది గీతాసారంలో
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది
ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నీవేలే 
అన్నీ నీ లీలలే
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

నోటిలో ధరణి చూపిన కృష్ణా..
గోటితో గిరిని మోసిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా..
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా..
కిల కిల మువ్వల కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా..
తకధిమి తకధిమి తాండవ కృష్ణా... తాండవ కృష్ణా..
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా.. 
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా.. 
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా..

శనివారం, డిసెంబర్ 28, 2013

మధుర మురళి హృదయ రవళి

మొన్న వేవేలా గోపెమ్మలా పాట గురించి మాట్లాడుకుంటూ కమల్ పై సరదాగా చిత్రీకరించిన కొన్ని మధురమైన పాటల గురించి చెప్పుకున్నాం కదా ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది, ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈపాట కూడా కృష్ణుడి మీదే కావడం. సినిమా కామెడీ సినిమా కావడంతో ఈ పాటకూడా పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా చిత్రీకరించినా పాటమాత్రం చాలా మధురంగా ఉంటుంది నాకు బాగా ఇష్టమైనపాట. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : ఒక రాధ ఇద్దరు కృష్ణులు 
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, జానకి

మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
 


మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా

గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో

 పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ

 రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం 

 
మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడిరేగే
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా

హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే

 ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే
 

పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం

మధుర మురళి హృదయ రవళి 

 అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
 ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా 

శుక్రవారం, డిసెంబర్ 27, 2013

మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ..

శివరంజని సినిమాలోని పాటలు ఎంత ఫేమస్సో చెప్పక్కర్లేదు కదా అందులో బోలెడు పాటలు సూపర్ హిట్ వాటి మరుగున కాస్త తక్కువ పేరు తెచ్చుకున్న పాట ఈ "మాపల్లె వాడలకు" పాట. ఇది రాసినది ఎవరో నాకు తెలియదు రమేష్ నాయుడి గారి సంగీతం మాత్రం అలా గుర్తుండిపోతుంది. ఈ పాట చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు. 

చిత్రం : శివరంజని(1978)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : 
గానం : బాలు, సుశీల
మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ
మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ


కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ
కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ
వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ
వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ
మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ
ఆ..ఆ..మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ

యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ
వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ
యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ
వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ


మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ
నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ


సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా
సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా
కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా
కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా
సరసమైన ధర చెప్పు ఓ మందయానా
ఆ..ఆ.. సరసమైన ధర చెప్పు ఓ మందయానా

తల్లి చాటు పిల్లనయ్యా కృష్ణమూర్తీ
మా నాయనమ్మ నడగాలయ్యా కృష్ణమూర్తీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇదే జానపదాన్ని పైపాటలో రమేష్ నాయుడు గారు డ్యూయెట్ గా మారిస్తే, జానపదాన్ని అలాగే ఉంచి పెద్దగా మార్చకుండా కె.వి.మహదేవన్ గారు సూత్రధారులు సినిమాలో ఉపయోగించారు. ఈ పాటకూడా నాకు చాలా ఇష్టం. వీడియో ఇక్కడ చూడవచ్చు, ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.

చిత్రం : సూత్రధారులు(1989)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : 
గానం : బాలు, కోరస్

జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ

యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై

దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతక్కు తకదిమి
దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి

కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ

గురువారం, డిసెంబర్ 26, 2013

యమునా ఎందుకె నువ్వు

ఇళయరాజ సంగీతం సమకూర్చిన మరువలేని ఆల్బమ్స్ లో నిరీక్షణ కూడా ఒకటి. ఇందులోని "ఆకాశం ఏనాటిదో", "చుక్కల్లే తోచావే", "తియ్యన్ని దానిమ్మ" పాటలతో పాటు కన్నయ్యమీద ఉన్న ఈపాట కూడా నాకు బోలెడంత ఇష్టం. యమునా నదికి నల్లని రంగు కిట్టయ్యతో కూడడం వలన అబ్బిందట ఎంత చక్కని భావనో కదా.. మనసుకవి ఆత్రేయ గారిది చాలా బాగా రాశారు సాహిత్యానికి తగిన సంగీతం కూడా మనల్ని అలరిస్తుంది. చిత్రీకరణ సైతం బాగుంటుంది ఈ పాట తెలుగు వీడియో ఎక్కడా దొరకలేదు కనుక తెలుగు ఆడియో ఇక్కడ వింటూ తమిళ్ వీడియో చూసేయండి.



చిత్రం : నిరీక్షణ
సంగీతం : ఇళయరాజ 
సాహిత్యం : ఆత్రేయ
గానం : జానకి

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
 శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ


బుధవారం, డిసెంబర్ 25, 2013

మల్లెల వేళ అల్లరి వేళ

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన ఒక మంచి మెలోడీ ఈ మల్లెలవేళ అల్లరివేళ పాట. సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ అప్పట్లో ఈపాటకూడా రేడియోలోనే విన్న గుర్తు. పల్లవి పాడే ముందు ఊహుహు అంటూ మొదలుపెట్టడం భలే ఉంటుంది. ఈ పాటమీరూ చూసి విని ఆనందించండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: జి. ఆనంద్, సుశీల

మల్లెల వేళ.. అల్లరి వేళ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా


ఉహూహు ఊఊ.. 
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
ఉహూహు..ఊ.ఉ..

 
ఒక యమున నేడు పొంగింది
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు ఝల్లంది
 
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ

ఉహూహు..ఊ.ఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

 
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది

నింగీ నేల మురిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల జీవించు వేళ

ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల


మంగళవారం, డిసెంబర్ 24, 2013

వేవేల గోపెమ్మలా మువ్వాగోపాలుడే..

ఈ పాట చూసినపుడు విశ్వనాథ్ గారిపై నాకు అపుడపుడు కోపం వస్తుంటుంది అంటే చాలాసార్లు నవ్వుకున్నా అపుడపుడు మాత్రం కోపమనమాట. తెలుగు సినిమా పాటల చిత్రీకరణపై సెటైరిక్ గా ఒక పాట తీద్దామని అనుకున్నారు బానే ఉంది కానీ దానికి ఒక మీడియోకర్ పాటను ఎంచుకుని సైతం ఇలా చిత్రీకరించి ఉండవచ్చు కదా ఇంత మంచిపాట రాయించుకుని ఇంత చక్కని బాణికట్టించుకుని ఈ పాటని అలా పాడుచేయాలని ఎలా అనిపించిందో ఈయనకి అని తిట్టుకుంటూంటానమాట :-)
అందుకే ఎక్కువసార్లు ఈ పాట చూడకుండా ఆడియో మాత్రం వింటూ ఊహలలోకి వెళ్ళిపోతుంటాను. పాటమొదట్లోనూ చరణాలకు ముందు వినిపించే వేణుగానం ఎంతోఅద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంటుంది. ఇక వేటూరి వారి సాహిత్యం గురించి ఏం చెప్పగలం అంత బాగా ఆయనమాత్రమే రాయగలరని తప్ప. ఈ చక్కనిపాట చూసి విని ఎంజాయ్ చేయండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : సాగరసంగమం 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి 
గానం: బాలు, శైలజ

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే


ఆ అహహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే...ఏ..ఎ..
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె ఆఆ..ఆఅ
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె


చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే..ఏ..ఎ..ఎ..
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే

రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
ఆఆ..ఆఅ
 గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే

నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే..మ్మ్.. మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే..మ్మ్.. మది వెన్నెలు దోచాడే

ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..
మా ముద్దూ గోవిందుడే.

సోమవారం, డిసెంబర్ 23, 2013

నేనె రాధనోయీ.. గోపాలా..


భానుమతి గారి పాటలలో మరో ఆణిముత్యం ఈ నేనె రాధనోయీ.. ఈ పాట గురించి మాట్లాడలేము జస్ట్ విని ఆస్వాదించగలం అంతే మీరూ చూసీ విని తరించేయండి. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.




చిత్రం : అంతా మన మంచికే (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం: భానుమతి

మ్మ్...
ఆ...
ఆ...

నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ..
గోపాలా.. నేనె రాధనోయి..


విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో
నీ పెదవులపై వేణుగానమై..
నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురా నేనే వేళా
పొంగిపోదురా నే..నే వేళా

నేనె రాధనోయీ గోపాలా
నేనె రాధనోయీ..


ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
ఆడే పొన్నల నీడలలో
నీ మృదుపదముల జాడలలో
నేనే నీవై... నీవే నేనై..
కృష్ణా....ఆ....ఆ...ఆ...
నేనే నీవై నీవే నేనై
అనుసరింతురా నేనేవేళా
అనుసరింతురా నేనేవేళా

నేనె రాధనోయి.. గోపాలా నేనె రాధనోయీ
ఆ...ఆ...ఆ..ఆ.. నేనె రాధనోయి
ఆ..ఆ...ఆ...ఆ...ఆ... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ....... నేనె రాధనోయి
ఆ..ఆ..ఆ..ఆ...ఆ...........నేనె రాధనోయి గోపాలా
నేనె రాధనోయి
నేనె రాధనోయి
నేనె రాధనోయి...ఈ...ఈ

ఆదివారం, డిసెంబర్ 22, 2013

అన్నయ్యా.. కుక్క కావాలి..

తేజ మొదటి సినిమా “చిత్రం” లోని ఈ సరదా అయిన పాట నాకు చాలా ఇష్టం, క్యాసెట్ రిలీజ్ అయిన కొత్తలో పదే పదే వినేవాడ్ని. కులశేఖర్ రాసిన సాహిత్యం భలే సరదాగా ఉంటుంది. కుక్కకావాలని ఏడ్చే ఓ పిల్లవాడికి రామాయణ భారత బాలనాగమ్మ కథలను చెప్తూ వాడి దృష్టి మరల్చాలనే ప్రయత్నంతో సాగే ఈ పాట పిల్లలనీ పెద్దలనీ కూడా ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో ఉత్తేజ్ తెలంగాణా యాసలో పాడడం కూడా చాలా సరదాగా ఉంటుంది. ఈపాట మీకోసం ఇక్కడ ఇస్తున్నాను విని ఎంజాయ్ చేయండి. ఈటివి తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానల్ లో బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు కాకపోతే ఈ లింక్ అమెరికాయేతర పాశ్చత్యదేశాలలో పనిచేయదు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినండి.



చిత్రం : చిత్రం
సాహిత్యం: కులశేఖర్
సంగీతం: ఆర్ పి పట్నాయక్
గానం: నిహాల్, సందీప్, ఆర్ పి పట్నాయక్, రవి వర్మ, గాయత్రి, ఉత్తేజ్

అన్నయ్యా...... కుక్క కావాలి.........కుక్క కావాలి.........
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ.......
దశరధ రాజుకు వారసుడు.......... సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు......... మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా...... బ్లూకలర్ల మస్తుగుంటడు......
లక్ష్మణుడని బ్రదరున్నాడు....... అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు..... సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా....
బ్రదర్సు ఒకటేగాని..కలర్సు వేర్రా నాని....
దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు..
అన్నదమ్ములేమో ఒకటంటావ్...రంగులేమో అలగలగ్ అంటావ్...
కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది....రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది....ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు.......అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు....
పదముల చెంతే ఉంటాడు....
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో.. కుక్కని కొట్టినట్టు కొడతాడు...
ఆ...కుక్క.....కుక్క కావాలి.........కుక్క కావాలి.........

అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది....
వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా.....నోరిప్పనీయద్దసలు.....

అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములయందు
అవిక్రమ పరాక్రమవంతుడు....కురువంశొద్భవుండు..... సుయోధనుండు....
రారాజు సోదరులు హండ్రెడు....తకతకిట
ఆ పాండవులతో ఉండరు......తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ......
బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ..

ద్రౌపది వస్త్రాపహరణం.... ఆపలేదెవరూ దారుణం....
పులిలాగ భీమన్న లంఘించినాడు.....
బలశాలి కోపంతొ కంపించినాడు.....
గద ఎత్తినాడు...తొడ కొట్టినాడు....
గద ఎత్తినాడు...తొడ కొట్టినాడు....
గద ఎత్తినాడు...తొడ కొట్టినా...
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది....
భీముడు గద తీసిండు పిసికిండు......
దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు......
ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు....
ఆడు కొట్టిండు.. ఈడు కొట్టిండు..
ఈడు తలకాయ మీద కొడ్తె ఆడు కాల్ మీద కొట్టిండు....
ఈడు కాల్ మీద కొడ్తె ఆడు తలకాయ మీద కొట్టిండు....
కొట్టిండు కొట్టిండు....
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై......దుర్యొధనుడు ఖాళీ విలన్....
ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు....
ఆ...కుక్క.....కుక్క కావాలి.........కుక్క కావాలి..

అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా...
నువ్వు చెప్పు.....నువ్వు చెప్పు.....
ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని.. నువ్వు చెప్పురా....

అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు.... 
ఎం చదువుకున్నార్ వయ్యా మీరు....
ఇస్టోరి నే చెప్తా... చెవులు పెట్టి ఇనుండ్రి.....

ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ....
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ.....

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు....ఎన్నో ప్లానులు గీసాడు...
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి.....ఆమెను ఇట్టే మోహించీ..
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు

గప్పుడేమైందో ఎరికెనా.......
మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని 
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు...
గంతే......బాలనాగమ్మ మారిపోయింది....
ఎలా మారిపోయింది.....అరె చెప్తున్నాగ మారిపోయింది...
అదే ఎలా మారింది...అరె చెప్తున్నాగ టాప్ టు బాటం మారిపోయింది...
చెప్తావా లేదా.....నే చెప్ప.....
చెప్తావా లేదా..... ఏంది కొడ్తరా..
ఆ..... అందరు కొడ్తారా......
ఎం డౌటా... అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు....
మాటర్ అసుంటిది.....
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై....
కుక్క కావాలి.......కుక్క కావాలి.......కుక్క కావాలి.....

ఆలారే ఆలారే

సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తేనెమనసులు అనగానే ఎక్కువమంది 1965 లో విడుదలైన సినిమానే గుర్తు తెచ్చుకుంటారు కానీ అదే పేరుతో 1987 లో జయప్రద, సుహాసిని లతో కూడా ఒక సినిమా చేశారు అందులోదే ఈ “ఆలారే ఆలారే” పాట. సుహాసినిది సెకండ్ హీరోయిన్ గా ఆరాధన ప్లస్ త్యాగం కలిసిన డీసెంట్ రోల్ అయితే జయప్రద మెయిన్ హీరోయిన్ గా చేసింది. 

ఇందులోదే “మమ్మీ మమ్మీ” అనేపాట కూడా అప్పట్లో టీ బంకుల్లోనూ అక్కడా ఇక్కడ తరచుగా వినపడే పాట ఆసక్తి ఉంటే ఇక్కడ చూసీ విని ఎంజాయ్ చేయండి.  ఈ పాటలో స్టెప్స్ సూపర్ అసలు :-) ఇక మన పాట బప్పీలహరి పంథాలో కొంచెం బీట్స్ ఎక్కువగా వినిపించినా వేటూరి గారి సాహిత్యం, సుహాసిని అభినయం సుశీల గారి గానం తోడవడంతో చక్కని పాటగా తయారైంది. నేను తరచుగా వినేపాటలలో ఇదీ ఒకటి. మీరూ చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.

 

చిత్రం : తేనెమనసులు 1987
సాహిత్యం : వేటూరి
సంగీతం : బప్పీలహరి
గానం : పి. సుశీల

ఓఓఓ... ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా.. మా ఇంట విందారగించగా..

ఓఓఓ..ఓ.ఓ పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
పచ్చాకర్పూరాలేసి గుమ్మపాలల్లో..
తేనే పొంగళ్ళే పోసీ వెన్నా జున్నుల్లో.. విందులే.. చేయనా..
వేణూ గానాలెన్నో ఈ రాధా గుండెల్లో..
మౌన గాథలెన్నో ఈ పేద గుండెల్లో..
పాడనా.. ఊపిరై.. రాధాలోలా..

ఆలారే..ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

ఓఓఓ.. ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
ప్రేమే నా... ప్రాణమూ..
ప్రేమ కుటీరం మాదీ పేద కుటీరం..
కృష్ణ సంగీతం మదిలో బృందావిహారం..
ప్రేమే నా... ప్రాణమూ..
ప్రేమే ఆతిధ్యమ్.. నీకూ ప్రేమే ఆహ్వానం..
ప్రేమే నా జీవం.. కృష్ణ ప్రేమే నాదైవం..
స్నేహమే....ఏ.. ప్రాణమూ.. రాధాలోలా..

ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..
ఆలారే ఆలారే.. ముకుందా మురారే..
కృష్ణయ్యా వచ్చేదీనాడే.. మా ఇంట విందారగించగా..
మా ఇంట విందారగించగా..

శనివారం, డిసెంబర్ 21, 2013

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా

కొన్ని కొన్ని పాటలు జీవితకాలం వెంటాడుతుంటాయి. ఎలాంటి మూడ్ లో విన్నా ఎపుడు విన్నా ఆ పాట మూడ్ లోకి అలా లాక్కెళ్ళిపోగల పాటలుంటాయి. అలాంటి పాటే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా “ నువ్వే నువ్వే” లోని ఈ పాట. కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి సాహిత్యం చిత్రగారి గళంలో మనల్ని వెంటాడుతుంది. ఈ పాట మీకోసం... ఆడియోమాత్రం వినాలంటే ఇక్కడ వినండి. 



చిత్రం : నువ్వే నువ్వే
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: చిత్ర

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాశ లేని ఆశ నేనై.. మిగలనా.ఆఅ..ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

నేల వైపు చూసే నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపువ్వునీ
ఏ మంత పాపం ప్రేమా ప్రేమించటం
ఇకనైనా చాలించమ్మా వేధించటం
చెలిమై కురిసే సిరివెన్నెలవా...
క్షణమై కరిగే కలవా... ఆఆఅ..ఆ.ఆ.
 
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాశ లేనీ ఆశ నేనై మిగలనా

వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడా చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో

మధురమైన పాటలలో సైతం సంధర్బానుసారంగా చిత్రీకరణతో కామెడీ పండించిన ఘనత ఈసినిమాలో సింగీతంగారికీ ఆ తర్వాత "వేవేల గోపెమ్మలా" పాటలో విశ్వనాధ్ గారికీ మాత్రమే దక్కుతుందేమో, చిత్రమేమంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరో కమల్ గారే కావడం. "సొమ్మొకడిదీ సోకొకడిది" సినిమాలోని ఈ పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంతే సరదాగా ఉంటుంది. ఆ చక్కని పాటని చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. 

 

చిత్రం :    సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం :    రాజన్-నాగేంద్ర
సాహిత్యం :    వేటూరి
గానం :    బాలు, సుశీల

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా


రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
అది తీపి కోపాల వయసూ..
ఆ ఆ ఆ....
కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
అది మాయ మర్మాల మనసూ

అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
పదహారువేల సవతులు వద్దు
ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు


ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా

ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
ఆ..ఆ..ఆ..
ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
కలహాలు పెంచే కౌగిలి ముద్దు
ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా


ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న
ఆహాహహాహ లాల్లలలలాల్ల
ఆహాహహాహ లాల్లలలలాల్ల

శుక్రవారం, డిసెంబర్ 20, 2013

యమునా తీరాన రాధ మదిలోనా

నేను పుట్టకముందు రిలీజైన ఈ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు అస్సలు తెలియదు కానీ ఈ పాట కూడా నేను రేడియోకి అతుక్కుపోవడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి.. వివిధభారతిలో తరచుగా వినిపించే ఈ పాట ఈరోజు వింటూన్నాకూడా ఆరుబయట నులకమంచం పై పడుకుని రేడియోని గుండెలమీద పెట్టుకుని స్పీకర్ లో మొహం పెట్టేసి మరీ వింటున్న అనుభూతే కలిగింది నాకు. ఇక ఇందులో ఎమ్మెస్వీ సంగీతమా రాజశ్రీ సాహిత్యమా బాలూ సుశీలల స్వరమా ఏది బాగుందో చెప్పడం ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చినా చెప్పడం అసాధ్యమని నా అనుకోలు. ఈ అద్భుతమైన పాట మీరూ వినండి. ఆడియో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : గౌరవం (1970)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, పి.సుశీల

యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా..ఆఆఅ.అ..
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..

హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..

యమునా తీరాన ఆహాహాఆఆ అహహఆఅ
రాధ మదిలోన ఆహాహాఆఆ అహహఆఅ
కృష్ణుని ప్రేమ కథా...ఆఆఆ.. ఆహాహాఆఆ అహహఆ
కొసరి పాడేటి కోరి వలచేటి ఆఆ 
మనసు నాది కదా.. ఆఆ

ఎదలో తలపే తొణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయనిదీచరితమే

మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొలిగేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ

యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా..ఆఆఆ..
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా..
లా..లాలలాలలలా..

గురువారం, డిసెంబర్ 19, 2013

సా విరహే తవదీనా రాధా.

శ్రీ సూర్యనారాయణా మేలుకో అంటూ సాక్షాత్తు సూర్యభగవానుడ్నే గద్దించి నిదుర లేప గల సత్తా ఉన్న భానుమతమ్మ తొలినాళ్ళలో మధురంగా ఆలపించిన ఈ పాట వినని తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకోను, బహుశా ఈ తరం యువతకి చేరి ఉండకపోవచ్చేమో తెలియదు. జయదేవుని అష్టపదినుండి కొన్ని పంక్తులను తీసుకుని రసాలూరు సాలూరి వారి స్వరసారధ్యంలో కూర్చిన ఈ అందమైన పాట మీకోసం.. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు. 

ఈ పాటలో ఉపయోగించిన లైన్స్ కి అర్ధం ఇదట : ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. యమునా తీరంలో ఒక పొదరింటిలో చంచల మనస్కుడై రాధను తలుస్తున్న కృష్ణుణ్ణి సమీపించి, రాధ పడే బాధనీ, నానా అవస్థలనీ ఆమె చెలికత్తె చెప్తుంది.
"రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు."

ఈ అష్టపది పూర్తి స్క్రిప్ట్ భావంతో సహా తెలుసుకోవాలంటే ఈమాటలోని ఈ వ్యాసం చూడండి. (పై పేరా ఈ వ్యాసంనుండి సంగ్రహించబడినదే) ఈ వ్యాసంలోనే ఇదే అష్టపదిని బాలమురళీ కృష్ణ గారు, టంగుటూరి సూర్యకుమారి గారు, నిత్యసంతోషిణి ఇంకా ఎందరో ఇతర గాయనీ గాయకులు పాడగా చేసిన రికార్డింగ్స్ కూడా వినవచ్చు ఆసక్తి ఉంటే తప్పక చూడండి.


చిత్రం : విప్రనారాయణ
సాహిత్యం : జయదేవుడు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : భానుమతి

విరహే..ఏ.ఏ.ఏ.ఎ.ఎ.ఎ.ఎఎ
తవా...ఆఆఆ...ఆఆఅ....
దీనా ఆఆఆఆ....ఆఆ.ఆఅ.అ.అ.అ.అ...
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా....

నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివా..ఆఆ..ఆఆ.ఆఆ.ఆఆఆఅ
 వ్యాళనిలయ మిళనేన గరళమివా కలయతి మలయ సమీరం
సా విరహే తవ దీనా

కుసుమ విశిఖశరతల్పమనల్ప విలాస కళా కమనీయం
వ్రత మివ తవ పరి రంభసుఖాయా...
వ్రత మివ తవ పరి రంభసుఖాయా కరోతి కుసుమ శయనీయం
సా విరహే తవ దీనా

ప్రతిపద మిద మపి నిగదతి మాధవ.. నిగదతి మాధవ..
నిగదతి మాధవ తవచరణే పతితాహం....
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే.. తనుదాహం
సా విరహే తవ దీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా...
కృష్ణా...ఆఆఆఆఆఆఆఆ....
తవ విరహే..ఏఏఏ....దీనా... ఆఆఆఆఆ..ఆఅ.అ.అ.ఆఆఆ...

బుధవారం, డిసెంబర్ 18, 2013

అదిగదిగో యమునాతీరం

ఈ పాట మీలో ఎందరికి తెలిసి ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా చాలా ఇష్టమైన పాట, ఇదికూడా రేడియోలోనే పరిచయం నాకు. వస్తున్నపుడు ఎందుకో తెలీదు అలా ఆగిపోయి వినేవాడ్ని చేస్తున్న పనులు అన్నీ ఆపేసి శ్రద్దగా ఈ పాట వినేసి మళ్ళీ పనులు చేసుకోవడం అనమాట. ఈ సినిమా గురించికానీ వీడియో గురించి కానీ నాకు తెలీదు యూట్యూబ్ లో వెతికినా కనిపించలేదు కానీ పాట మాత్రం ఎంతో ఇష్టం, బాలు జానకి గార్లు సరదాగా ఆటలాగా పాడిన పాటలలో ఇదీ ఒకటి. ఈ అందమైన పాటని ఇక్కడ వినండి ప్లగిన్ పనిచేయకపోతే చిమటాలో ఇక్కడ వినచ్చు.




చిత్రం : తెల్లగులాబీలు
సాహిత్యం : మైలవరపు గోపీ
సంగీతం : శంకర్-గణేష్
గానం : బాలు, జానకి

అదిగదిగో..ఓఓ..ఓ.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

అదిగదిగో.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..


దూరాన యే వాడలోనో..
వేణుగానాలు రవళించ సాగే..
ఓఓ..ఓ.. గానాలు వినిపించగానే..
యమున తీరాలు పులకించి పోయే..

పూల పొదరిళ్ళు పడకిళ్ళు కాగా..
చిగురు పొత్తిళ్ళు తల్పాలు కాగ..
ఎన్ని కౌగిళ్ల గుబులింతలాయే..

అదిగదిగో.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
 

అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

 

విధి లేక పూచింది కానీ..
ముళ్ళగోరింట.. వగచింది..ఎదలో..

ఆఆఆ.ఆ..ఆ...పూచింది యే చోటనైనా..
పూవు చేరింది పూమాలనేగా...
యే సుడిగాలికో.. వోడిపోక..
యే జడివానకీ.. రాలిపోక..
స్వామి పాదాల చేరింది..తుదకు..


అదిగదిగో.. హాఅ..ఆ.ఆఅ.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..

హాఆఅ..ఆ..అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

మంగళవారం, డిసెంబర్ 17, 2013

చందన చర్చిత నీలకళేబర

ధనుర్మాసం ఆరంభమైందట కదా మరి కృష్ణప్రేమికులంతా ఆరాధనకు సిద్దపడి ఉంటారుగా.. అందుకే ఈవేళ నేనుకూడా మా కృష్ణయ్యపాటనే తీసుకు వచ్చాను. ఈ జయదేవుని అష్టపదిని ఇప్పటివరకూ నాలుగు సార్లు సినిమాలలో వాడారని వినికిడి. మొదటిసారి 1936 లో సతీ తులసి అనే చిత్రంలో ఉపయోగించిన పాట దొరకలేదు కానీ మిగిలిన వర్షన్స్ చిత్తగించండి.

తెనాలి రామకృష్ణ చిత్రం కోసం 1956 లో సుశీలమ్మ పాడిన ఈపాటే నాకు అన్ని వర్షన్స్ లోకెల్లా బాగానచ్చింది. ఎమ్మెస్ విశ్వనాథన్ గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ నొక్కండి పూర్తి పాట లేదు. కింద ఎంబెడ్ చేయబడినది కృష్ణుని చిత్రాలతో ఆడియో మిక్స్ చేసి చేసిన ప్రజంటేషన్. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.
 


చిత్రం : తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్ రామమూర్తి
సాహిత్యం : జయదేవుడు
గానం : సుశీల

హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి
కేళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం
 

హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళిపరే

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామా.. ఆ ఆ ఆ...

హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళిపరే
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి

~*~*~*~*~*~*~*~*~*~*~

ఆ తర్వాత “శ్రీకృష్ణ సత్య” అనే చిత్రంలో బాలుగారి గాత్రంలో 1971 లో వచ్చిన ఈ పాటను ఇక్కడ వినవచ్చు.


~*~*~*~*~*~*~*~*~*~*~

ఆ తర్వాత పరదేశి అనే సినిమా కోసం మనో బృందం పాడగా కీరవాణి గారి స్వరసారధ్యంలో 1998 లో వచ్చిన వర్షన్ ఇది. అన్నిటిలోనూ సుశీల గారు పాడిన పాటే నాకు బాగా నచ్చింది. అయినప్పటికీ కీరవాణి గారి ఫ్యూజన్ వర్షన్ కూడా బాగానే ఉందనిపించింది కాకపోతే కేవలం క్లాసికల్ తప్ప ఫ్యూజన్ సంగీతం పట్ల ఆసక్తి లేనివాళ్ళు వినవద్దని మనవి, అలవాటున్నవారికి మాత్రం ఈ వర్షన్ కూడా నచ్చి తీరుతుంది. ఆడియో వర్షన్ వినాలంటే ఇక్కడ వినవచ్చు. 




చిత్రం : పరదేశి (1998)
సాహిత్యం : వేటూరి
సంగీతం : కీరవాణి
గానం : మనో, శుభ, సంగీత

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మణి..
It's such lovely music, but I can't sing it this style
చందన చర్చిత


చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి

హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ
గోకులమున రాధికలోన మరుల వేణుగానము లొలికిన కృష్ణ
Maidens of the meadows field ? Spirit that is so real..
Your presence is a love song కృష్ణ

సరిగమలన్నీ సరసాలాడే రిస దపగరిగ రిగప గపద పదసగరి రిస దపగ
I can feel the magic and it feels so strong
And I can feel the మోహనం of this song and I just want to sing
సరిగపదసాస

సరిగమలన్నీ సరసాలాడే మోహనమే రసకేళీ...ఈఈఈ..

చందన చర్చిత
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి

ధిన్ తరనన ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ తననా
ధిన్ తననన హెయ్ ధిన్ తననత
ధింతనననన ధిననన ధిననన ధిన్ ధిన్ తనానననాన
ధింత నననిననా హెయ్యే ధింత నననిననా
హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ
ప్రేమ కథగా మారిన వేళ వలపు వెన్నదోచిన గడుసరి కృష్ణ
Come out of the shelf right now,
Stop stealing the butter right now
You've got everything.. haven't you? కృష్ణా ...
మిసిసిపి తీరే ముసిముసి నవ్వే
రిస దపగరిగ రిగప గపద పదసగ రిస దపగ
They tell me you're shy, they say you make them cry,
You're the thief of hearts, you're a little butterfly
and you make me feel the passion deep inside

మిసిసిపి తీరి ముసిముసి నవ్వే కోరితిరా బ్రతిమాలి

చందన చర్చిత
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ హరేకృష్ణ కృష్ణ

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.